MoviesN.ANJIeditor@indiaherald.comhttps://www.indiaherald.com/ImageStore/images/movies/movies_latestnews/ntrc760fb79-2b33-4860-9c87-8964f2bdb9db-415x250-IndiaHerald.jpghttps://www.indiaherald.com/ImageStore/images/movies/movies_latestnews/ntrc760fb79-2b33-4860-9c87-8964f2bdb9db-415x250-IndiaHerald.jpgఅలనాటి స్టార్ హీరోలు ఎన్టీఆర్, ఏఎన్నార్ సినీ ఇండస్ట్రీకి రెండు కళ్ల లాంటి వారు అని చెప్పడంలో ఎలాంటి సందేహం లేదు. వారిద్దరూ తెలుగు చిత్ర పరిశ్రమను మద్రాసు నుంచి హైదరాబాద్ రావడానికి వీరు ఎంత కష్టపడ్డారో అందరికి తెలిసిన విషయమే. అంతేకాదు.. వీరిద్దరూ కలిసి చిత్ర పరిశ్రమలో ఎన్నో సినిమాలో నటించారు. NTR{#}festival;Hyderabad;NTR;CM;Ishtam;Chennai;Telugu;Audience;Cinemaఆ సినిమాలో ఎన్టీఆర్ అడిగినా నో చెప్పిన ఏఎన్నార్.. ఎందుకంటే..?ఆ సినిమాలో ఎన్టీఆర్ అడిగినా నో చెప్పిన ఏఎన్నార్.. ఎందుకంటే..?NTR{#}festival;Hyderabad;NTR;CM;Ishtam;Chennai;Telugu;Audience;CinemaMon, 06 Dec 2021 15:30:00 GMTఅలనాటి స్టార్ హీరోలు ఎన్టీఆర్, ఏఎన్నార్ సినీ ఇండస్ట్రీకి రెండు కళ్ల లాంటి వారు అని చెప్పడంలో ఎలాంటి సందేహం లేదు. వారిద్దరూ తెలుగు చిత్ర పరిశ్రమను మద్రాసు నుంచి హైదరాబాద్ రావడానికి వీరు ఎంత కష్టపడ్డారో అందరికి తెలిసిన విషయమే. అంతేకాదు.. వీరిద్దరూ కలిసి చిత్ర పరిశ్రమలో ఎన్నో సినిమాలో నటించారు. వారిద్దరూ కలిసి దాదాపు కొన్ని పదుల సంఖ్యలో సినిమాలలో నటించి, సినీ ఇండస్ట్రీకి కన్నుల పండుగను తీసుకొచ్చారు.

అయితే సాధారణంగా ఎన్టీఆర్ సినిమా అన్నా.. ఏఎన్ఆర్ సినిమా అన్నా అభిమానులకు పండుగ అని చెప్పడంలో ఎలాంటి సందేహం లేదు. ఇక అలాంటిది వీరిద్దరు కలిసి నటిస్తే.. ఇక ఎంత ఆనందంగా ఉంటుందో ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. వీరిద్దరూ కలిసి నటించిన సినిమాలను చూడటానికి థియేటర్లలో ప్రేక్షకులు క్యూ కడుతూ ఉండేవారు. అయితే చిత్ర పరిశ్రమకి ఎన్టీఆర్ కంటే ముందే అడుగుపెట్టిన ఏఎన్నార్ సినిమా రంగంలో పౌరాణిక, జానపద చిత్రాల్లో నటించి మంచి గుర్తింపు తెచ్చుకున్నారు.

అలాగే ఎన్టీఆర్ ఇండస్ట్రీలోకి అడుగు పెట్టడంతో తన రూట్ మార్చుకుని, పర్సనాలిటీకి తగ్గ పాత్రలు ఎంచుకుంటూ ఆడియన్స్‌లో తనకంటూ ఒక ప్రత్యేకమైన స్థానాన్ని సంపాదించుకున్నాడు. ఆయన హీరోగానే రాణిస్తూ సినిమాలకు దర్శకుడిగా, నిర్మాతగా కూడా వ్యవహరించారు. ఇక ఎన్టీఆర్ స్వీయ దర్శకత్వంలో దానవీరశూరకర్ణ సినిమా చేసేటప్పుడు ముందుగా అక్కినేనికి ఒక పాత్ర కోసం అవకాశం ఇచ్చారంట. అయితే ఏఎన్ఆర్ అందుకు ఒప్పుకోలేదంట.

ఇక దానికి గల ప్రధాన కారణము ఏంటంటే.. అప్పటి సీఎం జలగం వెంగళరావు కోరిక మేరకు కర్ణుడి పాత్ర కోసం ఏఎన్ఆర్‌ను.. ఎన్టీఆర్ అడిగితే అలాంటి పాత్రలు తనకు సూట్ అవవని అందుకే నిరాకరించారంట. కాగా.. ఎన్టీఆర్ ఆ సినిమాలో కృష్ణుడి పాత్ర అయినా వేయమని చెబితే నాకు ఇష్టం లేదు అంటూ చెప్పడంతో ఇక ఎన్టీఆర్ ‘దాన వీర శూర కర్ణ’ ఇలా నాలుగు పాత్రల్లో నటించి ప్రేక్షకులను ఆకట్టుకున్నారు. ఆ సినిమా అప్పట్లో కోటి రూపాయలు వసూలు చేసిన సినిమాగా ఇండస్ట్రీలో రికార్డు సృష్టించింది



నేనే నానీనే : బూతుల మంత్రికి బూస్టర్ డోస్ అదేనా!

ఏపీ బిజెపి స్పీడ్ కు కారణం...?

బ్రేకింగ్: ‘పుష్ప’ ట్రైలర్ వాయిదా..!

రేవంత్ రెడ్డి గ్రాఫ్ ఈ రేంజ్ లో పడిందా...?

ఉప్పెన భామ 'కృతి శెట్టి' కి మరో హిట్ ఖాయమేనా...

మ‌ద్యం మ‌త్తులో బైకును ఢీ కొట్టిన కారు.. దంప‌తులు మృతి

బిగ్ బాస్ 5: టాప్ 5 డిసైడ్ అయిపోయిందిగా... ఆమెకు ముగింపు?

బుడుగు: పిల్లలకు ఇలాంటి ఆహారం అస్సలు పెట్టకూడదు..!!

నేను విలన్గా నటించడానికి రెడీ : బాలయ్య



సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - N.ANJI]]>