PoliticsN ANJANEYULUeditor@indiaherald.comhttps://www.indiaherald.com/ImageStore/images/politics/politics_latestnews/----------------16fc185f-b392-49ca-8834-d3c2ccfda74f-415x250-IndiaHerald.jpghttps://www.indiaherald.com/ImageStore/images/politics/politics_latestnews/----------------16fc185f-b392-49ca-8834-d3c2ccfda74f-415x250-IndiaHerald.jpg. తాజాగా మరొక‌సారి కిలో టమాటా ధర సెంచరీ దాటేసిన‌ది. ఆంధ్రప్రదేశ్‌లో గత కొద్ది రోజులుగా కురిసిన భారీ వర్షాలతో పంటలు తీవ్రంగా దెబ్బతిన్నాయి. దీంతో కూరగాయల ధరలకు క్ర‌మ క్రమంగా రెక్కలొచ్చాయి. ఓ దశలో కిలో టమాటా ధర ఏకంగా రూ.130 వరకు చేరిన‌ది. ఇది కేవ‌లం హోల్‌ సేల్ మార్కెట్ లో నెల‌కొన్న‌ పరిస్థితి. కానీ ఇక బహిరంగ మార్కెట్‌కు వ‌ద్ద‌కు వెళ్లితే.. రూ.150 వ‌ర‌కు ప‌లికిన‌ద‌ని వ్యాపారులు పేర్కొంటున్న మాట‌. అయితే వ‌ర్షాలు త‌గ్గిపోవ‌డం.. ప్ర‌భుత్వ చ‌ర్య‌లతో పాటు ట‌మోటా ధ‌ర దిగి వ‌చ్చిన‌ది. కానీ ఆ త‌రువాత #మళ్లీ సెంచరీ దాటిన టమాటా ధర..!{#}vegetable market;Madanapalle;Chittoorమళ్లీ సెంచరీ దాటిన టమాటా ధర..!మళ్లీ సెంచరీ దాటిన టమాటా ధర..!#మళ్లీ సెంచరీ దాటిన టమాటా ధర..!{#}vegetable market;Madanapalle;ChittoorMon, 06 Dec 2021 08:58:13 GMTఇటీవ‌ల ఒక‌సారి ట‌మాటా ధ‌ర ఉన్న‌ట్టుండి ఒక్క‌సారిగా రెక్క‌లొచ్చాయ‌నే విధంగా 150 పెరిగిన విష‌యం విధిత‌మే. తాజాగా మరొక‌సారి కిలో టమాటా ధర సెంచరీ దాటేసిన‌ది.  ఆంధ్రప్రదేశ్‌లో గత కొద్ది రోజులుగా కురిసిన భారీ వర్షాలతో పంటలు తీవ్రంగా దెబ్బతిన్నాయి. దీంతో కూరగాయల ధరలకు క్ర‌మ క్రమంగా రెక్కలొచ్చాయి. ఓ దశలో కిలో టమాటా ధర ఏకంగా రూ.130 వరకు చేరిన‌ది.  ఇది కేవ‌లం హోల్‌ సేల్ మార్కెట్ లో నెల‌కొన్న‌ పరిస్థితి. కానీ  ఇక బహిరంగ మార్కెట్‌కు  వ‌ద్ద‌కు వెళ్లితే.. రూ.150 వ‌ర‌కు ప‌లికిన‌ద‌ని వ్యాపారులు పేర్కొంటున్న మాట‌. అయితే వ‌ర్షాలు త‌గ్గిపోవ‌డం.. ప్ర‌భుత్వ చ‌ర్య‌లతో పాటు ట‌మోటా ధ‌ర దిగి వ‌చ్చిన‌ది.

కానీ ఆ త‌రువాత వారం ప‌ది రోజులు గ‌డ‌వ‌క ముందే మ‌రొక సారి ట‌మోటా ధ‌ర‌కు మ‌ళ్లీ రెక్క‌లొచ్చాయి. ఏపీలో ట‌మోటాకు పుట్టినిల్లుగా భావించే చిత్తూరు జిల్లా మ‌ద‌న‌ప‌ల్లె వ్య‌వ‌సాయ మార్కెట్‌లో ఇవాళ మ‌రొక‌సారి సెంచ‌రీ దాటేసిన‌ది. కిలో ట‌మోట ధ‌ర రూ.102గా ప‌లుకుతున్న‌ది.  ఇది కాస్త వినియోగ‌దారుడికి చేరే స‌రికి మ‌రింత పెరుగుతున్న‌ది. దీంతో ట‌మోటాను కొనుగోలు చేయాలంటేనే ఆలోచించాల్సిన ప‌రిస్థితికి ఏర్ప‌డిన‌ది.

 మదనపల్లె వ్యవసాయ మార్కెట్ నుంచి తూర్పు, ఉత్తరాంధ్ర, తెలంగాణ, మహారాష్ట్ర, ఛత్తీస్‌గఢ్‌, గుజరాత్‌, మధ్యప్రదేశ్‌, పశ్చిమ బెంగాల్‌, ఒడిశా, తమిళనాడు, కర్ణాటక రాష్ట్రాలకు టమాటాల ఎగుమతి జరుగుతున్న‌ది.  నాణ్యమైన టమాటా ఈ ఏడాది ఆరంభంలో కిలో రూ.6 నుంచి రూ.14 వరకు హోల్‌సేల్‌లో విక్రయాలు కొన‌సాగాయి. ఇక‌ వర్షాలకు ముందు కిలో టమాటా రూ. 50కి పైగా పలికింది..

ఇక, ఏపీలో  వర్షాల  త‌రువాత ట‌మాటా అమాంతం పెరిగిపోయి.. వంద దాటేసిన‌ది.  మధ్యలో కాస్త తగ్గినట్టే అనిపించినా.. మరొక‌సారీ కిలో టమాటా నూరు రూపాయలకు పైగా పలుకుతున్న‌ది. దీనికి ప్రధాన కారణం పంట దిగుబడి లేకపోవడమే అని పేర్కొంటున్నారు వ్యాపారులు. టమాటా మాత్రమే కాదు..  కూర‌గాయాల‌న్నింటి  ధ‌ర‌లు  పెరిగిపోయాయి. బహిరంగ మార్కెట్‌లో ఏ కూరగాయ తీసుకున్నా కిలో రూ.60-80కి పైగా పలుకుతుంద‌ని వినియోగదారులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.






ఏపీలో వరదలపై రాజకీయాలు.. ఇబ్బందుల్లో జగన్..!

భయపెడుతున్న అనసూయ లుక్.. ప్రేక్షకులు షాక్?

జూనియర్ బాలయ్యల ను కలపబోతున్న అఖండ సక్సస్ మీట్ !



సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - N ANJANEYULU]]>