MoviesN.ANJIeditor@indiaherald.comhttps://www.indiaherald.com/ImageStore/images/movies/movies_latestnews/ntr3d944cfb-2f74-4760-af7b-f623f562eb83-415x250-IndiaHerald.jpghttps://www.indiaherald.com/ImageStore/images/movies/movies_latestnews/ntr3d944cfb-2f74-4760-af7b-f623f562eb83-415x250-IndiaHerald.jpgతెలుగు చిత్ర పరిశ్రమలో సీనియర్ ఎన్టీఆర్ ఒక్క ట్రెండ్ సెట్ చేశారు. ఇండస్ట్రీకి పునాది రాళ్లు వేసిన వారిలో ఆయన ఒక మూలస్తంభం. చిత్ర పరిశ్రమలో ఆయన జానపద, పౌరాణిక, సాంఘిక ఇలా ఏ సినిమాలో అయినా సరే పాత్రలు వేశారు అంటే ఆ సినిమా సూపర్ హిట్ అవ్వడంలో ఎలాంటి సందేహం లేదు.NTR{#}Apple;Shakti;NTR;Telugu;Chennai;Cinemaఎన్టీఆర్‌కు ఇష్టమైన ఆహారం ఇదే..!!ఎన్టీఆర్‌కు ఇష్టమైన ఆహారం ఇదే..!!NTR{#}Apple;Shakti;NTR;Telugu;Chennai;CinemaMon, 06 Dec 2021 15:10:00 GMTతెలుగు చిత్ర పరిశ్రమలో సీనియర్ ఎన్టీఆర్ ఒక్క ట్రెండ్ సెట్ చేశారు. ఇండస్ట్రీకి పునాది రాళ్లు వేసిన వారిలో ఆయన ఒక మూలస్తంభం. చిత్ర పరిశ్రమలో ఆయన జానపద, పౌరాణిక, సాంఘిక ఇలా ఏ సినిమాలో అయినా సరే పాత్రలు వేశారు అంటే ఆ సినిమా సూపర్ హిట్ అవ్వడంలో ఎలాంటి సందేహం లేదు. ఇండస్ట్రీలో ఆయన నటుడిగానే కాకుండా దర్శకుడిగా, నిర్మాతగా కూడా వ్యవహరించారు. అంతేకాదు.. ముఖ్యంగా మద్రాసు నుంచి తెలుగు సినీ ఇండస్ట్రీని హైదరాబాద్‌కు తీసుకురావడానికి ఎంతో శ్రమించిన వారిలో ఎన్టీఆర్ కూడా ఒకరని చెప్పడంలో సందేహం లేదు.

అయితే ఎన్టీఆర్ షూటింగ్‌లలో ఎప్పుడూ బిజీగా ఉన్నా.. ఆహారాన్ని మాత్రం ప్రత్యేకంగా వండించుకుని మరీ తింటూ ఉండేవారంట. అంతేకాక.. ఆయన తినే ఆహారం ప్రతి రోజు కూడా ఇంటి నుంచి వచ్చిన ఆహారమై ఉండాలని ప్రముఖ నటి లక్ష్మి ఇటీవల ఒక ఇంటర్వ్యూలో వెల్లడించారు. ఈ సందర్భంగా లక్ష్మి మాట్లాడుతూ.. సీనియర్ ఎన్టీఆర్ వయసుతో సంబంధం లేకుండా ప్రతి ఒక్కరిని చాలా గౌరవంగా పిలిచి మరి మాట్లాడుతూ ఉండేవారంట.

అంతేకాదు.. ఒక రోజు నేను సగం దోసె తిని వెళ్ళిపోతుండగా .. ఆయన నేను వదిలేసిన ఆహారాన్ని చూసి.. నేను వృథా చేయడం చూసి.. ఏవండీ లక్ష్మి గారు మీరు ఇటు రండి అని పిలిచారంట. అయితే ఈ వయసులో ఏం తిన్నా అరిగిపోయే శక్తి ఉన్నప్పుడు ఇలా సగం దోసని తిని వదిలిపెట్టడం ఎందుకంటూ నాపై సీరియస్ అయ్యారు అని ఆమె చెప్పుకొచ్చారు. ఇక ఇప్పుడు వయసులో ఉన్నప్పుడు.. జీర్ణించుకునే శక్తి ఉన్నప్పుడు ప్రతి ఒక్కరు కడుపునిండా తినాలి, రోజు వ్యాయామం చేయాలి తప్ప ఇలా ఆహారాన్ని వృథా చేయకూడదని చెప్పుకొచ్చారు. అయితే ఎన్టీఆర్ తినే ఆహారంలో ప్రతిరోజూ దోసెలు, పూరీలు, హల్వ, ఆపిల్ జ్యూస్, కారంపూస కచ్చితంగా ఉండాల్సిందేనని ఆమె పేర్కొన్నారు.



నేనే నానీనే : బూతుల మంత్రికి బూస్టర్ డోస్ అదేనా!

ఏపీ బిజెపి స్పీడ్ కు కారణం...?

బ్రేకింగ్: ‘పుష్ప’ ట్రైలర్ వాయిదా..!

రేవంత్ రెడ్డి గ్రాఫ్ ఈ రేంజ్ లో పడిందా...?

ఉప్పెన భామ 'కృతి శెట్టి' కి మరో హిట్ ఖాయమేనా...

మ‌ద్యం మ‌త్తులో బైకును ఢీ కొట్టిన కారు.. దంప‌తులు మృతి

బిగ్ బాస్ 5: టాప్ 5 డిసైడ్ అయిపోయిందిగా... ఆమెకు ముగింపు?

బుడుగు: పిల్లలకు ఇలాంటి ఆహారం అస్సలు పెట్టకూడదు..!!

నేను విలన్గా నటించడానికి రెడీ : బాలయ్య



సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - N.ANJI]]>