HealthChandrasekhar Reddyeditor@indiaherald.comhttps://www.indiaherald.com/ImageStore/images/politics/politics_latestnews/-if-vaccination-is-not-taken-salaries-and-schemes-will-be-cut-4b3d1c08-0aa7-48e6-9102-6b4c760c9417-415x250-IndiaHerald.jpghttps://www.indiaherald.com/ImageStore/images/politics/politics_latestnews/-if-vaccination-is-not-taken-salaries-and-schemes-will-be-cut-4b3d1c08-0aa7-48e6-9102-6b4c760c9417-415x250-IndiaHerald.jpgదేశంలో ఇటీవల కరోనా కేసులు తగ్గుముఖం పట్టడంతో అటు ప్రజలు ఇటు ప్రభుత్వం కాస్త నెమ్మదించాయి. దీనితో చురుకుగా జరుగుతున్న వాక్సినేషన్ కార్యక్రమం నిదానం అయిపోయింది. అలాగే ప్రజలు కూడా యధాజీవనవిధానంలోకి వచ్చేశారు. అయితే తాజా కొత్త వేరియంట్ వార్తతో మళ్ళీ అందరు ఒక్కసారిగా కరోనా మూడ్ లోకి వచ్చేశారు. మళ్ళీ కఠిన నిబంధనలు, వాక్సిన్ హడావుడి మొదలైంది. అసలు వాక్సిన్ అంటే ఇప్పటికి వెనకడుగు వేసేవారు లేకపోలేదు. మాకు బాగానే ఉంది, మాకు ఏ వాక్సిన్ అవసరం లేదు అనేవారు అక్కడక్కడా ఉంటున్నారు. వీరికి సిరంజి అంటే భయమా లేక కsmartphonewithvaccine;{#}Gujarat - Gandhinagar;Smart phone;Government;Coronavirusగుజరాత్ : వాక్సిన్ తీసుకుంటే.. బంపర్ ఆఫర్..!గుజరాత్ : వాక్సిన్ తీసుకుంటే.. బంపర్ ఆఫర్..!smartphonewithvaccine;{#}Gujarat - Gandhinagar;Smart phone;Government;CoronavirusSun, 05 Dec 2021 15:24:19 GMTకరోనా కేసులు తగ్గుముఖం పట్టడంతో అటు ప్రజలు ఇటు ప్రభుత్వం కాస్త నెమ్మదించాయి. దీనితో చురుకుగా జరుగుతున్న వాక్సినేషన్ కార్యక్రమం నిదానం అయిపోయింది. అలాగే ప్రజలు కూడా యధాజీవనవిధానంలోకి వచ్చేశారు. అయితే తాజా కొత్త వేరియంట్ వార్తతో మళ్ళీ అందరు ఒక్కసారిగా కరోనా మూడ్ లోకి వచ్చేశారు. మళ్ళీ కఠిన నిబంధనలు, వాక్సిన్ హడావుడి మొదలైంది. అసలు వాక్సిన్ అంటే ఇప్పటికి వెనకడుగు వేసేవారు లేకపోలేదు. మాకు బాగానే ఉంది, మాకు ఏ వాక్సిన్ అవసరం లేదు అనేవారు అక్కడక్కడా ఉంటున్నారు. వీరికి సిరంజి అంటే భయమా లేక కరోనా అంటే భయమా అర్ధం కాదు కానీ, ఇలాంటి వారిని ఎలాగోలా ఆయా ఆరోగ్య కార్యకర్తలు బుజ్జగించి వాక్సిన్ వేస్తున్నారు.

వీళ్లు కాకుండా మరోరకం ఉంటారు. వాళ్ళు అసలు కారణం లేకుండానే వాక్సిన్ కార్యక్రమానికి దూరంగా ఉంటున్నారు. బహుశా వాళ్లకు దానిపై అసలు నమ్మకం లేకపోవచ్చు, గతంలో దీనిపై విషప్రచారం చూసి బయపడి ఉండొచ్చు, ఏది ఏమైనా వీళ్లు మాత్రం వాక్సిన్ కోసం ముందుకు రావడం లేదు. ఎప్పుడైనా వాక్సిన్ కార్యక్రమం వాళ్ళ ప్రాంతంలో జరుగుతుంటే పక్క ప్రాంతానికి వెళ్ళిపోతూ తప్పించుకుంటున్నారు. ఇలాంటి వాళ్ళను ఆకర్షించడానికి ప్రభుత్వాలు కూడా కొత్త కొత్త పధకాలు ప్రకటిస్తున్నాయి. అందులో గుజరాత్ లో పౌర సంఘం కూడా ఇలాంటి పరిస్థితి నెలకొనడంతో అక్కడ ఏకంగా 50వేల స్మార్ట్ ఫోన్ ఇవ్వడానికి(లక్కీడ్రా ద్వారా) సిద్ధం అయ్యింది. అంటే వాక్సిన్ వేయించుకో, స్మార్ట్ ఫోన్ పట్టుకుపో అన్న పధకం అన్నట్టుగా.

ఇలాంటివి ఆశ చూపి అయినా అందరికి వాక్సినేషన్ ఇవ్వాలనే చొరవ ప్రభుత్వాలు తీసుకుంటున్నాయి. ప్రజలు కూడా ఉచిత పధకాలకు రుచిమరిగి ఉన్నారు కదా, ఏదో ఒకటి ఇస్తాం అంటేనే కానీ వాళ్లకు మంచిదైనా పనికి కూడా రావడం లేదు. అలా తయారయ్యారు మన జనం. కానీ ప్రస్తుత పరిస్థితిని బట్టి ఎలాగోలా అందరికి వాక్సిన్ వేయించడం అవసరం. అందుకే ఏదో ఒకటి చేసి ఈ తరహా లక్ష్యాన్ని సాధించడానికి ప్రయత్నిస్తున్నారు. ఈ వైరస్ వస్తే ఒక్కళ్లతో పోదు కదా, ఒకరికి వస్తే వారితో పాటుగా అందరిని తీసుకెళ్లిపోతుంది. అందుకే ప్రభుత్వం కూడా ఏదో ఒక మాయచేసి, ప్రజలకు వాక్సిన్ ఇవ్వడానికే ప్రయత్నిస్తుంది.



ప్రముఖ కన్నడ నటుడు కన్నుమూత

బాబు ఢిల్లీ టూర్ ఏమైంది...?

నేను ఉండలేను అంటున్న టీడీపీ ఎంపీ...?

బిగ్ బాస్ కంటెస్టెంట్ పై బీర్ బాటిల్ తో దాడి?

బీజేపీ : గట్టి నిర్ణయాలు.. సుస్థిర ప్రభుత్వాలవే..!

బాబు ఆ ఓట‌ర్లు టీడీపీకి ఎప్ప‌ట‌కి దూర‌మే.. చూస్తున్నావా..?

రోశ‌య్య సేవ‌లు మ‌రువ‌లేనివి : సీజేఐ

బ్రేకప్ తో డిప్రెషన్ లోకి వెళ్ళా : బాలీవుడ్ హీరోయిన్

ముంబై టెస్ట్ లో కివీస్ స్పిన్న‌ర్ మాయాజాలం



సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - Chandrasekhar Reddy]]>