PoliticsChandrasekhar Reddyeditor@indiaherald.comhttps://www.indiaherald.com/ImageStore/images/politics/politics_latestnews/maliafrica-31220270-76f2-4f82-a377-b6200eda9a14-415x250-IndiaHerald.jpghttps://www.indiaherald.com/ImageStore/images/politics/politics_latestnews/maliafrica-31220270-76f2-4f82-a377-b6200eda9a14-415x250-IndiaHerald.jpgతీవ్రవాదులు మరోసారి ఘాతుకానికి పాల్పడ్డారు. పశ్చిమ ఆఫ్రికా మాలి లోని బందియాగ్రా సమీపంలో ప్రయాణికులు వెళ్తున్న బస్సుపై విచక్షణా రహితంగా కాల్పులకు తెగబడ్డారు. ఈ ఘటనలో 32 మంది అక్కడికక్కడే చనిపోయారు. వీరందరూ సొంగో గ్రామానికి చెందిన వారు, మార్కెట్ కు బస్సులో వెళ్తున్న వీరిపై తీవ్రవాదులు హఠాత్తుగా కాల్పులు చేశారు. సాధారణంగా పని కోసం వీరు రోజు ఆ దారిలో ప్రయాణం చేస్తుంటారు. అది గమనించిన తీవ్రవాదులు బస్సును మార్గమధ్యంలో ఆపి ముందు డ్రైవర్ ను హతమార్చి, అనంతరం బస్సు టైర్ లలో గాలి తీసి మరి తుపాకులతో ప్రయాణిmaliafrica;{#}Mali;bus;Petrol;Driver;Terrorists;vegetable market;Islamic countries;Air;village;Governmentఆఫ్రికా : మాలి లో.. తీవ్రవాదుల ఘాతుకం..!ఆఫ్రికా : మాలి లో.. తీవ్రవాదుల ఘాతుకం..!maliafrica;{#}Mali;bus;Petrol;Driver;Terrorists;vegetable market;Islamic countries;Air;village;GovernmentSat, 04 Dec 2021 20:04:32 GMTతీవ్రవాదులు మరోసారి ఘాతుకానికి పాల్పడ్డారు. పశ్చిమ ఆఫ్రికా మాలి లోని బందియాగ్రా సమీపంలో ప్రయాణికులు వెళ్తున్న బస్సుపై విచక్షణా రహితంగా కాల్పులకు తెగబడ్డారు. ఈ ఘటనలో 32 మంది అక్కడికక్కడే చనిపోయారు. వీరందరూ సొంగో గ్రామానికి చెందిన వారు, మార్కెట్ కు బస్సులో వెళ్తున్న వీరిపై తీవ్రవాదులు హఠాత్తుగా కాల్పులు చేశారు. సాధారణంగా పని కోసం వీరు రోజు ఆ దారిలో ప్రయాణం చేస్తుంటారు. అది గమనించిన తీవ్రవాదులు బస్సును మార్గమధ్యంలో ఆపి ముందు డ్రైవర్ ను హతమార్చి, అనంతరం బస్సు టైర్ లలో గాలి తీసి మరి తుపాకులతో ప్రయాణికులపై విచక్షణ లేకుండా కాల్పులు జరిపారు. అనంతరం బస్సుపై పెట్రోల్ పోసి తగలబెట్టేశారు. అది కళ్లారా చుసిన పిదప అక్కడి నుండి తీవ్రవాదులు వెళ్లిపోయారు.

ఈ ఘటనలో 32మంది చనిపోయినట్టుగా అధికారులు వెల్లడించారు. బస్సులో ఉన్నవారు చాలా కొద్ది మంది తీవ్రగాయాలతో బయటపడ్డారు, వారి పరిస్థితి విషమంగానే ఉంది. మాలి లో గత కొన్ని నెలలుగా ఉగ్రవాదులు రెచ్చిపోతూనే ఉన్నారు. వాళ్ళు చేసే దాడులకు లెక్కాపత్రం లేకుండా ఉంది. ఆల్ ఖైదా, ఇస్లామిక్ స్టేట్ కు చెందిన ఉగ్రభూతాలు అక్కడ పెట్రేగిపోతున్నాయి. మాలి లో ప్రభుత్వం పై మిలిటరీ తిరుగుబాటు కూడా ఈ పరిస్థితికి ప్రధాన కారణంగా చెపుతున్నారు. కేవలం 16 నెలలలో ప్రభుత్వంపై రెండు సార్లు తిరుగుబాటు జరిగింది. అటువంటి బలహీన ప్రభుత్వం ఉండటంతో ఉగ్రభూతకు కూడా రెచ్చిపోతున్నాయి.

తాజాగా ఏర్పడిన ప్రభుత్వం ఈ ఘటనపై స్పందించాల్సి ఉంది. ఈ ప్రభుత్వం కూడా ఎన్నాళ్ళు ఉంటుంది తెలియదు. తాజా దాడిలో పనులకు వెళ్తున్న మహిళలు ఉన్న బస్సు కావడం చేత బాధితులు ఎక్కువగా మహిళలే ఉన్నారు. ఈ బస్సు సొంగో గ్రామం నుండి వారానికి రెండు సార్లు బండియాగరా లోని మార్కెట్ కు వెళ్తుంది, అది తెలుసుకొని తీవ్రవాదులు ఈ ఘాతుకానికి పాల్పడ్డారు. దేశంలో ప్రభుత్వం స్థిరంగా లేకపోవడం తో ఉగ్రభూతాలు యువతను లేదా నేరప్రవృత్తి ఉన్న వారిని తమలో చేర్చుకొని వాళ్ళ ద్వారా ఈ పనులు చూపిస్తున్నట్టు తెలుస్తుంది. ఈ వంకతో మరోదేశం తీవ్రవాదుల హస్తగతం కాకుండా ఉంటె అదే చాలు.



ఇండోనేషియాలో మ‌ళ్లీ భారీ భూకంపం..!

బాబు ఢిల్లీ టూర్ ఏమైంది...?

నేను ఉండలేను అంటున్న టీడీపీ ఎంపీ...?

బిగ్ బాస్ కంటెస్టెంట్ పై బీర్ బాటిల్ తో దాడి?

బీజేపీ : గట్టి నిర్ణయాలు.. సుస్థిర ప్రభుత్వాలవే..!

బాబు ఆ ఓట‌ర్లు టీడీపీకి ఎప్ప‌ట‌కి దూర‌మే.. చూస్తున్నావా..?

రోశ‌య్య సేవ‌లు మ‌రువ‌లేనివి : సీజేఐ

బ్రేకప్ తో డిప్రెషన్ లోకి వెళ్ళా : బాలీవుడ్ హీరోయిన్

ముంబై టెస్ట్ లో కివీస్ స్పిన్న‌ర్ మాయాజాలం



సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - Chandrasekhar Reddy]]>