PoliticsChandrasekhar Reddyeditor@indiaherald.comhttps://www.indiaherald.com/ImageStore/images/politics/politics_latestnews/taiwan-0075962b-308a-4ea6-afb2-110975e3478d-415x250-IndiaHerald.jpghttps://www.indiaherald.com/ImageStore/images/politics/politics_latestnews/taiwan-0075962b-308a-4ea6-afb2-110975e3478d-415x250-IndiaHerald.jpgతైవాన్ విషయంలో చైనా అమెరికాలు ఒకరికొకరు హెచ్చరికలు ఇస్తూవచ్చారు. అయితే చైనా తన యుద్ధ విమానాలతో తైవాన్ ను ఎప్పటికప్పుడు భయపెడుతూనే ఉంది. ఇదంతా ప్రారంభానికి ముందే తైవాన్ తనను కాపాడుకోవాల్సిన బాధ్యత ప్రపంచం మీద ఉందని చెప్పేసింది. ఆ తరహాలో నే తాజాగా అమెరికా సహా జపాన్, ఆస్ట్రేలియా, బ్రిటన్, జర్మనీ యుద్ధ నౌకలు ఇప్పుడు తైవాన్ చుట్టూ గస్తీ కాస్తున్నాయి. చైనా పొరపాటున అటు వస్తే, దానిని పలాయనం చిత్తగించేలా చేయడానికి అవన్నీ సిద్ధంగా ఉన్నాయి. ఈ దిశగా అమెరికా తన చర్యలలోకి దిగేసింది. ఇప్పటికే 50000 సైన్యం తైవtaiwan-china;{#}Germany;American Samoa;Army;war;INTERNATIONAL;Coronavirusతైవాన్ చుట్టూ చేరిన.. యుద్ధ నౌకలు..!తైవాన్ చుట్టూ చేరిన.. యుద్ధ నౌకలు..!taiwan-china;{#}Germany;American Samoa;Army;war;INTERNATIONAL;CoronavirusSat, 04 Dec 2021 21:23:06 GMTతైవాన్ విషయంలో చైనా అమెరికాలు ఒకరికొకరు హెచ్చరికలు ఇస్తూవచ్చారు. అయితే చైనా తన యుద్ధ విమానాలతో తైవాన్ ను ఎప్పటికప్పుడు భయపెడుతూనే ఉంది. ఇదంతా ప్రారంభానికి ముందే తైవాన్ తనను కాపాడుకోవాల్సిన బాధ్యత ప్రపంచం మీద ఉందని చెప్పేసింది. ఆ తరహాలో నే తాజాగా అమెరికా సహా జపాన్, ఆస్ట్రేలియా, బ్రిటన్, జర్మనీ యుద్ధ నౌకలు ఇప్పుడు తైవాన్ చుట్టూ గస్తీ కాస్తున్నాయి. చైనా పొరపాటున అటు వస్తే, దానిని పలాయనం చిత్తగించేలా చేయడానికి అవన్నీ సిద్ధంగా ఉన్నాయి. ఈ దిశగా అమెరికా తన చర్యలలోకి దిగేసింది. ఇప్పటికే 50000 సైన్యం తైవాన్ లో ఉన్నది, వీళ్లు తైవాన్ సేనకు తర్ఫీదు కూడా ఇస్తున్నారు.

ఇదంతా చూస్తున్న అంతర్జాతీయ ప్రపంచం పెద్ద యుద్ధానికే దారితీసేట్టుగా ఉన్నదనే ఉద్దేశ్యంతో చైనా-అమెరికా లతో శాంతి చర్చలకు ఉపక్రమిస్తున్నాయి. ప్రస్తుతం ఆ దిశగా ప్రయత్నిస్తున్నారు. చైనా మాత్రం ఇది మా అంతర్గత వ్యవహారం అంటూ పాత పాటె పడుతుంది. అమెరికా మాత్రం తైవాన్ జోలికి చైనా వస్తే ఊరుకునేది లేదని స్పష్టం చేస్తుంది. ఎవరి మోడీ వైఖరితో వాళ్ళు ఉన్నారు, దీనితో శాంతి చర్చల ద్వారా కాస్త ఆలస్యం అవవచ్చు గాక కానీ, జరిగేది యుద్ధానికే దారితీస్తుందని అర్ధం అవుతూనే ఉంది. అది ప్రారంభం అయితే ఇప్పటికే అక్కడ ఉన్న దేశాల సంఖ్య తెలిసింది కదా, అవే పాల్గొంటాయా ఇంకా మధ్యలో ఇంకొన్ని తైవాన్ కు మద్దతుగా వస్తాయా అనేది కూడా చూడాల్సి ఉంటుంది.

ఇదంతా చూస్తుంటే, మూడో ప్రపంచ యుద్ధ ప్రారంభం లాగానే ఉంది. ఒకవేళ ఇది ఆ దిశగా మళ్ళినా ఆశ్చర్యపోనవసరం లేదు. అనంతర ఫలితాలు చూస్తే, చైనా ఓడితే ఊరుకుంటుందా, అణు ఆయుధాలు ప్రయోగానికి సిద్ధం అవుతుంది. కాకపోయినా, ఇన్ని దేశాలు కలిసి ఒక్కదానిపై పడ్డాయనే సానుభూతి కూడా పొందే అవకాశాలు కూడా ఉన్నాయి. ఆ సానుభూతి కొత్త పుంతలు తొక్కే అవకాశాలు లేకపోలేదు. ఒకపక్క కరోనా కొత్త వేరియంట్ తో ప్రపంచం అతలాకుతలం అవుతున్నప్పటికీ, ఈ సమస్య వాళ్లకు ముఖ్యం కావడం విచిత్రం. చూడాలి మూడో ప్రపంచ యుద్ధం జరగాలి అని రాసిపెట్టి ఉంటె తప్పదు, దానిని కరోనా వచ్చి కాస్త ఆలస్యం చేస్తుంది కావచ్చు. లేదా ఓపికగా కాసేపు ఆలోచించుకోవాలని ఆ భగవంతుడు ఈ కరోనా ను సాకుగా పంపి ఉండొచ్చు. యుద్ధం కంటే కరోనా మేలే. ఇప్పటి పరిస్థితులలో యుద్ధం అంటే మళ్ళీ ఆర్థికపరిస్థితి విషమించే అవకాశాలు బాగా ఉన్నాయి. ఇప్పటికే బ్రతకలేక బ్రతికేస్తుంటే, మరోసారి ఆర్థిక పరిస్థితి చితికిపోతే ఇంకెలా ఉంటుందో ఊహించడానికే భయంగా ఉంది.



ఇండోనేషియాలో మ‌ళ్లీ భారీ భూకంపం..!

బాబు ఢిల్లీ టూర్ ఏమైంది...?

నేను ఉండలేను అంటున్న టీడీపీ ఎంపీ...?

బిగ్ బాస్ కంటెస్టెంట్ పై బీర్ బాటిల్ తో దాడి?

బీజేపీ : గట్టి నిర్ణయాలు.. సుస్థిర ప్రభుత్వాలవే..!

బాబు ఆ ఓట‌ర్లు టీడీపీకి ఎప్ప‌ట‌కి దూర‌మే.. చూస్తున్నావా..?

రోశ‌య్య సేవ‌లు మ‌రువ‌లేనివి : సీజేఐ

బ్రేకప్ తో డిప్రెషన్ లోకి వెళ్ళా : బాలీవుడ్ హీరోయిన్

ముంబై టెస్ట్ లో కివీస్ స్పిన్న‌ర్ మాయాజాలం



సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - Chandrasekhar Reddy]]>