PoliticsM N Amaleswara raoeditor@indiaherald.comhttps://www.indiaherald.com/ImageStore/images/politics/politics_analysis/ganta121ee86e-902e-4399-90cc-a02ea9a184d3-415x250-IndiaHerald.jpghttps://www.indiaherald.com/ImageStore/images/politics/politics_analysis/ganta121ee86e-902e-4399-90cc-a02ea9a184d3-415x250-IndiaHerald.jpgఅసలు ఏపీ రాజకీయాల్లో ప్రస్తుతానికి అర్ధంకాని రాజకీయాలు ఎవరైనా చేస్తున్నారంటే అది గంటా శ్రీనివాసరావు మాత్రమే. అసలు ఈయన ఎలాంటి రాజకీయం చేస్తున్నారో ఎవరికి క్లారిటీ రావడం లేదు. రాజకీయంగా చూస్తే విశాఖలో ఈయన బలమైన నేత. పార్టీలు, నియోజకవర్గాలు మారినా సరే ఈయన్ని ప్రజలు ఆదరిస్తూనే ఉన్నారు. ఇంతవరకు ఓటమి మాత్రం రాలేదు. సరే ఓటమి రాలేదని చెప్పి నిలకడైన రాజకీయం చేస్తున్నారా? అంటే అది లేదు. అసలు 2019 ఎన్నికల తర్వాత నుంచి గంటా రాజకీయ స్టెప్ ఏంటి అనేది తెలియడం లేదు. ganta{#}GANTA SRINIVASA RAO;Vishakapatnam;politics;Party;Andhra Pradesh;Hanu Raghavapudi;TDP;CBNచంద్రన్న కోసం గంటా..కంటిన్యూ చేస్తున్నారా?చంద్రన్న కోసం గంటా..కంటిన్యూ చేస్తున్నారా?ganta{#}GANTA SRINIVASA RAO;Vishakapatnam;politics;Party;Andhra Pradesh;Hanu Raghavapudi;TDP;CBNFri, 03 Dec 2021 02:00:00 GMTఅసలు ఏపీ రాజకీయాల్లో ప్రస్తుతానికి అర్ధంకాని రాజకీయాలు ఎవరైనా చేస్తున్నారంటే అది గంటా శ్రీనివాసరావు మాత్రమే. అసలు ఈయన ఎలాంటి రాజకీయం చేస్తున్నారో ఎవరికి క్లారిటీ రావడం లేదు. రాజకీయంగా చూస్తే విశాఖలో ఈయన బలమైన నేత. పార్టీలు, నియోజకవర్గాలు మారినా సరే ఈయన్ని ప్రజలు ఆదరిస్తూనే ఉన్నారు. ఇంతవరకు ఓటమి మాత్రం రాలేదు. సరే ఓటమి రాలేదని చెప్పి నిలకడైన రాజకీయం చేస్తున్నారా? అంటే అది లేదు. అసలు 2019 ఎన్నికల తర్వాత నుంచి గంటా రాజకీయ స్టెప్ ఏంటి అనేది తెలియడం లేదు.

ఉండటానికి టీడీపీలో ఉన్నారు...పైగా విశాఖ నార్త్ ఎమ్మెల్యేగా ఉన్నారు...సరే టీడీపీ ప్రతిపక్షంలో ఉంది కాబట్టి...మిగతా నాయకుల మాదిరిగా...వైసీపీపై పోరాడుతున్నారా? అంటే అది లేదు. సరే టీడీపీలో కనబడటం లేదు కాబట్టి...అలా అని వైసీపీలోకి వెళ్ళారా? అంటే అది లేదు. వైసీపీలోకి వెళ్లిపోతారా? అంటే అది డౌటే...సరే పార్టీ మారలేదు కాబట్టి...టీడీపీలోనైనా పనిచేస్తారా? అంటే అది లేదు.

అసలు గంటా రాజకీయం మాత్రం ఖచ్చితంగా అర్ధం కావడం లేదు. పూర్తిగా రాజకీయంగా మాత్రం యాక్టివ్‌గా ఉండటం లేదు. అందుకే ఈయన్ని టీడీపీ శ్రేణులు కూడా పట్టించుకోవడం మానేశాయి. తమ లెక్కలో నుంచి తీసేశాయి. సరే గంటా...టీడీపీ నేత కాదా? అంటే కాదని చెప్పలేని పరిస్తితి. తాజాగా గంటా పుట్టిన రోజు సందర్భంగా చంద్రబాబుతో సహ ఇతర నేతలు శుభాకాంక్షలు చెప్పారు.

మళ్ళీ దీనికి గంటా కూడా మంచిగా రిప్లై ఇచ్చారు...చంద్రబాబుకు ధన్యవాదాలు అన్న అంటూ రిప్లై ఇచ్చారు. అంటే ఇక్కడ ఏం అర్ధం చేసుకోవాలో తెలియకుండా ఉంది. పైగా మొన్నటివరకు సోషల్ మీడియాలో ఏమన్నా పోస్టులు పెడితే...ఆ పోస్టుల్లో కేవలం తన ఫోటో మాత్రమే ఉంచుకునేవారు...కానీ ఇటీవల చంద్రబాబు ఫోటో కూడా పెట్టుకుంటున్నారు. దీని బట్టి చూస్తుంటే గంటా మళ్ళీ టీడీపీలోనే కంటిన్యూ అయ్యేలా ఉన్నారు. ఏదేమైనా గంటా రాజకీయాన్ని నమ్మడానికి లేదనే చెప్పాలి.  



చంద్రన్న కోసం గంటా..కంటిన్యూ చేస్తున్నారా?

అఖండ : ఆ మ్యూజిక్ ఏంటి తమన్?

అఖండ : శ్రీకాంత్ పాత్ర మునిగిపోయిందా?

అఖండ: డీసెంట్ పెర్ఫార్మన్స్ తో ఆకట్టుకున్న 'పూర్ణ'...

బోయపాటి ఇక మారడా..?

బిగ్ బాస్ 5: మళ్ళీ సేమ్ సీన్ రిపీట్... దుప్పట్లో 'షన్ను - సిరి'... ?

మన ఊపిరితిత్తులకు కరోనా సోకకుండా ఉండాలంటే..?

బాలయ్య రెండు గెటప్స్ అదిరినా.. పస లేదు..!!

అఖండ: 'శ్రీకాంత్' పాత్ర మెప్పించిందా?



సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - M N Amaleswara rao]]>