MoviesChakravarthi Kalyaneditor@indiaherald.comhttps://www.indiaherald.com/ImageStore/images/movies/movies_latestnews/movies955f50ea-9210-4284-84d7-413cd9e5030d-415x250-IndiaHerald.jpghttps://www.indiaherald.com/ImageStore/images/movies/movies_latestnews/movies955f50ea-9210-4284-84d7-413cd9e5030d-415x250-IndiaHerald.jpgఈ భూమి మీద ఎన్నో వివక్షలు ఉన్నాయి. కుల వివక్ష, మత వివక్ష, వర్ణ ఇలాంటివి ఎన్నో.. అయితే ఇవి సాధారణంగా కొన్ని వర్గాలకు పరిమితం అవుతుంటాయి. కానీ.. అన్ని వర్గాల్లోని వారు ఎదుర్కొనే మరో వివక్ష లింగ వివక్ష.. అది ఏ కులమైనా.. ఏ మతమైనా.. ఏ దేశమైనా.. ఏ వర్ణమైనా ఈ లింగ వివక్ష మాత్రం అన్నిచోట్లా కనిపిస్తోంది. ఈ లింగ వివక్షకు పేద, ధనిక బేధం లేదు.. ఈ రంగం, ఆ రంగం అని పరిమితి కూడా లేదు. తాజాగా సినీ రంగంలోని ఓ మాజీ హీరోయిన్.. ఇటీవల ఓ ఇంటర్వ్యూలో చెప్పిన మాటలు వింటే.. ఇంకా మనం ఆధునిక కాలంలోనే ఉన్నామా అనిపించక MOVIES{#}Annayya;TECHNOLOGY;Samsung;Apple;Huawei;Nokia;LG;HTC;Motorola;Redmi;Dell;HP;Asus;Acer;Sony;marriage;Girl;Husband;Manam;Yevaru;Heroineమగబిడ్డ కోసం.. ఒకనాటి హీరోయిన్ కష్టాలు..?మగబిడ్డ కోసం.. ఒకనాటి హీరోయిన్ కష్టాలు..?MOVIES{#}Annayya;TECHNOLOGY;Samsung;Apple;Huawei;Nokia;LG;HTC;Motorola;Redmi;Dell;HP;Asus;Acer;Sony;marriage;Girl;Husband;Manam;Yevaru;HeroineFri, 03 Dec 2021 23:14:24 GMTఈ భూమి మీద ఎన్నో వివక్షలు ఉన్నాయి. కుల వివక్ష, మత వివక్ష, వర్ణ ఇలాంటివి ఎన్నో.. అయితే ఇవి సాధారణంగా కొన్ని వర్గాలకు పరిమితం అవుతుంటాయి. కానీ.. అన్ని వర్గాల్లోని వారు ఎదుర్కొనే మరో వివక్ష లింగ వివక్ష.. అది ఏ కులమైనా.. ఏ మతమైనా.. ఏ దేశమైనా.. ఏ వర్ణమైనా ఈ లింగ వివక్ష మాత్రం అన్నిచోట్లా కనిపిస్తోంది. ఈ లింగ వివక్షకు పేద, ధనిక బేధం లేదు.. ఈ రంగం, ఆ రంగం అని పరిమితి కూడా లేదు.


తాజాగా సినీ రంగంలోని ఓ మాజీ హీరోయిన్.. ఇటీవల ఓ ఇంటర్వ్యూలో చెప్పిన మాటలు వింటే.. ఇంకా మనం ఆధునిక కాలంలోనే ఉన్నామా అనిపించక మానదు. నలుగురు ఆడపిల్లలను కన్న నాటి తరం హీరోయిన్ ముచ్చర్ల అరుణ ఓ ఇంటర్వ్యూలో తన స్వీయ అనుభవాలు పంచుకున్నారు.  మచ్చర్ల అరుణ అచ్చ తెలుగమ్మాయి. ఆమె ఓ ఉత్తరాది వ్యక్తిని ప్రేమించి పెళ్లి చేసుకున్నారు. ఆమెకు నలుగురు ఆడపిల్లలు పిట్టారు. ఉత్తరాది అయినా, దక్షిణాది అయినా ఆడపిల్లల మీద వివక్ష మాత్రం ఉంటుందంటున్నారు ముచ్చర్ల అరుణ.


ఒక మహిళ కడుపుతో ఉన్నప్పుడు ఆమె చుట్టూ ఉన్న వారు మొదట్లో వరు పుట్టినా ఫర్లేదు అని చెబుతుంటారట. కానీ చాలా మందికి అబ్బాయే పుట్టాలని మనసులో ఉంటుందట. అబ్బే మాకు ఎవరు పుట్టినా పర్లేదు అనే వారిలో 90 శాతం మందికి అబ్బాయి పుట్టాలనే ఉంటుందని ముచ్చర్ల అరుణ చెబుతున్నారు. ఆమెకు మొదటిసారి ఆడపిల్ల పుట్టినప్పుడు వాళ్ల అత్తగారు బాగా ఫీలయ్యారట. మా వంశం కొనసాగేందుకు నీకో మగబిడ్డ కావాలి కదా అన్నారట.


అత్తగారింట్లో వాళ్ల కోసం మగబిడ్డ కావాలని నాలుగు సార్లు సిజేరియన్ ఆపరేషన్లు చేయించుకున్నారట ముచ్చర్ల అరుణ. కానీ.. ముచ్చర్ల అరుణకు అబ్బాయి పుట్టలేదు. అలా అబ్బాయిని కనకపోవడం తన తప్పా అని ఆమె ప్రశ్నిస్తున్నారు. అంతే కాదు.. ఇప్పటికీ వాళ్ల   ఇంట్లో ఏదైనా పూజ జరిగితే ఆమె భర్త పక్కన వాళ్ల అన్నయ్య కొడుకే కూర్చుంటాడట. ఆమె కూతుళ్లు దూరంగా నిలబడి చూస్తుంటారట. ఏం.. ఆడపిల్లలూ మరీ పూజలకూ పనికిరానివారా? అని ప్రశ్నిస్తున్నారామె. 2021 వచ్చినా.. టెక్నాలజీ పెరిగినా.. ఆడపిల్లల మీద ఇంకా వివక్ష ఎందుకుందో అని బాధపడుతున్నారు ముచ్చర్ల అరుణ.. నిజమే కదా.





కేటీఆర్ సార్‌.. హైదరాబాద్‌ నడిబొడ్డున చెట్ల కింద చదువులు..?

రాజ్యసభలో వైసీపీ ప్రవేటు బిల్లులు...!

షణ్ముఖ్ కి షాక్.. వేరే కంటెస్టెంట్ కి ఓటు వేసిన దీప్తి?

పుష్ప ట్రైలర్ టీజ్ సిద్ధం .... ఫ్యాన్స్ కి పండగే ..... ??

పాక్ లో చైనా కొత్త ప్లాన్.. వామ్మో ఇంత పెద్ద కుట్రా?

రేసులోకి కొత్త ప్రధాని అభ్యర్థి.. ఎవరో తెలుసా?

రష్యా కు.. నాటో హెచ్చరిక..!

టాలీవుడ్ లో మొదలైన సరికొత్త సాంప్రదాయం..!!

పంట కొన‌క‌ రైతుల‌ను కాటికి పంపుతున్నారు : వైఎస్ ష‌ర్మిల‌



సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - Chakravarthi Kalyan]]>