TVVAMSIeditor@indiaherald.comhttps://www.indiaherald.com/ImageStore/images/tv/122/telugu-bigg-bos-season-52a96f98b-1644-4208-adcb-d2f8cb6312bb-415x250-IndiaHerald.jpghttps://www.indiaherald.com/ImageStore/images/tv/122/telugu-bigg-bos-season-52a96f98b-1644-4208-adcb-d2f8cb6312bb-415x250-IndiaHerald.jpgబిగ్ బాస్ సీజన్ ఫైవ్ దాదాపు చివరి దశకు చేరుకుంది. సోషల్ మీడియాలో సీజన్ ఫైవ్ విన్నర్ ఎవరన్న అంశంపై పెద్ద ఎత్తున చర్చ జరుగుతోంది. కొన్ని సర్వేల ప్రకారం సన్నీ, షన్ను ల మధ్య ట్రోఫీ ఊగిసలాడుతుండగా చివరికి ట్రోఫీ మాత్రం సన్నికే దక్కుతుందని మెజారిటీ ప్రేక్షకులు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు.TELUGU-BIGG-BOSS-SEASON-5{#}maanas;siri;sree raam;Winner;kajal aggarwal;priyanka;Episode;Audience;Bigboss;GEUMబిగ్ బాస్ 5: సన్నీకి దెబ్బేసిన ప్రాణ స్నేహితుడు...?బిగ్ బాస్ 5: సన్నీకి దెబ్బేసిన ప్రాణ స్నేహితుడు...?TELUGU-BIGG-BOSS-SEASON-5{#}maanas;siri;sree raam;Winner;kajal aggarwal;priyanka;Episode;Audience;Bigboss;GEUMFri, 03 Dec 2021 22:00:00 GMTబిగ్ బాస్ సీజన్ ఫైవ్ దాదాపు చివరి దశకు చేరుకుంది. సోషల్ మీడియాలో సీజన్ ఫైవ్ విన్నర్ ఎవరన్న అంశంపై పెద్ద ఎత్తున చర్చ జరుగుతోంది. కొన్ని సర్వేల ప్రకారం సన్నీ, షన్ను ల మధ్య ట్రోఫీ ఊగిసలాడుతుండగా చివరికి ట్రోఫీ మాత్రం సన్నికే దక్కుతుందని మెజారిటీ ప్రేక్షకులు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు. వీరిద్దరి మధ్య విన్నర్ ఎవరన్న విషయాన్ని అడిగినపుడు సన్ని, షన్ను ఇద్దరూ మంచి గేమర్సే కానీ...షన్ను ఎక్కువగా సిరి కోసం ఆడుతుండడం అంతా చూశాము. అది కాక తాను ఎక్కువ ఎంగేజ్ అవుతున్న సమయంలో సన్ని మాత్రం ఎపుడు తన గేమ్ పై ఫోకస్ పెట్టి ఆడుతాడు. ఈ లెక్కనే అతడేగా విన్నర్ కావాలి అంటూ అభిమానులు సన్నీకి మద్దతు తెలుపుతున్నారు.

ఈ విషయం అటుంచితే నిన్నటి ఎపిసోడ్ లో టాస్క్ సమయంలో సన్నికి మస్కా కొట్టాడు మానస్. సీజన్ ఫైవ్ మొదలయ్యింది మొదలు మానస్, ప్రియాంక సింగ్, కాజల్, సన్ని ఒక జట్టుగా కలిసి ఉంటున్నారు. అయితే మానస్ మీద కోపంతో పింకీ శ్రీ రామ్ గ్రూప్ వైపుకి జంప్ చేసిన విషయం తెలిసిందే. కాగా ఫినాలేకి డైరెక్ట్ ఎంట్రీ నిన్న బిగ్ బాస్ ఇచ్చిన టాస్క్ లో అందరూ పార్టిసిపేట్ చేశారు. బిగ్ బాస్ ఇచ్చిన టైం ను వారు సెకెన్ల ప్రకారం కౌంట్ చేసుకుని ముగిశాక బెల్ కొట్టాలి. అయితే సన్నీ మరియు కాజల్ లు ఆడుతున్నప్పుడు బయట ఉన్న మానస్ వారికీ హెల్ప్ చేయడానికి తాను కూడా కౌంట్ చేశాడు.

సన్నీ పూర్తిగా మానస్ కౌంటింగ్ మీదనే ఆధారపడ్డాడు. తన ప్రకారం కౌంటింగ్ పూర్తయినా మానస్ ఇచ్చే సిగ్నల్ కోసం వెయిట్ చేశాడు. చివరకు మానస్ ఓకే అన్నాక.. బెల్ కొట్టాడు. తీరా బిగ్ బాస్ రిజల్ట్స్ ప్రకటించేసరికి అందరూ షాక్ అయ్యారు. తక్కువ సమయంలో కౌంటింగ్ అంచనా వేసిన మానస్ మొదటి స్థానం చేజిక్కించుకున్నాడు. ఇక మానస్ పై నమ్మకం పెట్టుకున్న సన్నీ చివరి స్థానానికి పరిమితమయ్యాడు. దీనిని బట్టి మానస్ ఫ్రెండ్షిప్ ను అడ్డు పెట్టుకుని గేమ్ ఆడాడు అని అర్థమైపోయింది. కానీ సన్నీనే ఇంకా తెలుసుకోలేకపోతున్నాడు...


కేటీఆర్ సార్‌.. హైదరాబాద్‌ నడిబొడ్డున చెట్ల కింద చదువులు..?

రాజ్యసభలో వైసీపీ ప్రవేటు బిల్లులు...!

షణ్ముఖ్ కి షాక్.. వేరే కంటెస్టెంట్ కి ఓటు వేసిన దీప్తి?

పుష్ప ట్రైలర్ టీజ్ సిద్ధం .... ఫ్యాన్స్ కి పండగే ..... ??

పాక్ లో చైనా కొత్త ప్లాన్.. వామ్మో ఇంత పెద్ద కుట్రా?

రేసులోకి కొత్త ప్రధాని అభ్యర్థి.. ఎవరో తెలుసా?

రష్యా కు.. నాటో హెచ్చరిక..!

టాలీవుడ్ లో మొదలైన సరికొత్త సాంప్రదాయం..!!

పంట కొన‌క‌ రైతుల‌ను కాటికి పంపుతున్నారు : వైఎస్ ష‌ర్మిల‌



సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - VAMSI]]>