MoviesDivyaeditor@indiaherald.comhttps://www.indiaherald.com/ImageStore/images/movies/movies_latestnews/ap-cinema-poliltics2f2d92b6-8d71-4128-884e-1879bf07162e-415x250-IndiaHerald.jpghttps://www.indiaherald.com/ImageStore/images/movies/movies_latestnews/ap-cinema-poliltics2f2d92b6-8d71-4128-884e-1879bf07162e-415x250-IndiaHerald.jpgసినీ ఇండస్ట్రీలో ఒక సినిమాను తెరకెక్కించాలంటే దర్శకులు నిజ జీవితంలో జరిగే సంఘటనలు కూడా ఉదాహరణగా తీసుకొని, తమ ఆలోచనలకు పదును పెట్టి సినిమాలను తెరకెక్కిస్తున్నారు. ముఖ్యంగా సమాజంలో జరిగే ఎన్నో విషయాలను ఆదర్శంగా తీసుకుని సినిమాల రూపంలో తెరకెక్కించడమే కాకుండా రాజకీయాలంటే ఎలా ఉంటాయో కూడా ప్రజలకు చూపించే లాగా చాలా అద్భుతంగా తెరకెక్కిస్తున్నారు. ఉదాహరణకు ఇప్పటికీ ఎంతో మంది స్టార్ హీరోలు రాజకీయ నేపథ్యంలో సినిమాలను తెరకెక్కించిన విషయం తెలిసిందే. కొన్ని సినిమాలలో రాజకీయాలను చాలా మంచిగా చూపిస్తే.. మరి కొన్AP-Cinema-Poliltics{#}krishna;ravi anchor;sandeep;vennela;Cinema;Director;Heroine;INTERNATIONAL;Indian;Prasthanam;Chitramఅసలు రాజకీయమంటే ఎలా ఉంటుందో చూపించిన మూవీ..!!అసలు రాజకీయమంటే ఎలా ఉంటుందో చూపించిన మూవీ..!!AP-Cinema-Poliltics{#}krishna;ravi anchor;sandeep;vennela;Cinema;Director;Heroine;INTERNATIONAL;Indian;Prasthanam;ChitramFri, 03 Dec 2021 10:00:00 GMTసినీ ఇండస్ట్రీలో ఒక సినిమాను తెరకెక్కించాలంటే దర్శకులు నిజ జీవితంలో జరిగే సంఘటనలు కూడా ఉదాహరణగా తీసుకొని, తమ ఆలోచనలకు పదును పెట్టి సినిమాలను తెరకెక్కిస్తున్నారు. ముఖ్యంగా సమాజంలో జరిగే ఎన్నో విషయాలను ఆదర్శంగా తీసుకుని సినిమాల రూపంలో తెరకెక్కించడమే కాకుండా రాజకీయాలంటే ఎలా ఉంటాయో కూడా ప్రజలకు చూపించే లాగా చాలా అద్భుతంగా తెరకెక్కిస్తున్నారు. ఉదాహరణకు ఇప్పటికీ ఎంతో మంది స్టార్ హీరోలు రాజకీయ నేపథ్యంలో సినిమాలను తెరకెక్కించిన విషయం తెలిసిందే. కొన్ని సినిమాలలో రాజకీయాలను చాలా మంచిగా చూపిస్తే.. మరి కొన్ని సినిమాలలో ఖచ్చితంగా రాజకీయాలంటే ఇంత నీచంగా ఉంటాయి అంటూ చూపిస్తూ ఉంటారు. అలాంటి సినిమాలలో శర్వానంద్ హీరోగా నటించిన ప్రస్థానం సినిమా కూడా ఒకటి..



ఈ సినిమాలో రాజకీయ పొత్తులు ఎలా ఉంటాయో.. పక్కవాడిని నాశనం చేస్తేనే రాజకీయాలలో ఎదుగుతాము అనే విషయాలను చాలా చక్కగా చూపించారు. ముఖ్యంగా రాజకీయ నాయకులు ఏం చేసినా చెల్లుతుంది.. అనే ఒక ఆలోచనతో.. తమ పుత్రులు తప్పు చేస్తే , ఆ తప్పును కప్పి పుచ్చడానికి ఈ బడాబాబులు మరో తప్పులు చేస్తూ నిజాయితీపరులైన యువత ను నాశనం చేసే కాన్సెప్టుతో ఈ సినిమాను తెరకెక్కించడం జరిగింది.. ప్రముఖ క్రియేటివ్ డైరెక్టర్ దేవా కట్ట దర్శకత్వంలో వల్లభనేని రవి ,విజయ్ కృష్ణ నిర్మాణ సారథ్యంలో తెరకెక్కిన చిత్రం ప్రస్థానం.

ఈ సినిమాలో రూబీ పరిహార్ హీరోయిన్ గా నటించింది. సాయికుమార్, జయప్రకాష్ రెడ్డి, సందీప్ కిషన్, వెన్నెల కిషోర్, బలిరెడ్డి పృథ్వీరాజ్ వంటి తదితరులు కీలక పాత్ర పోషించడం గమనార్హం. 2010వ సంవత్సరంలో విడుదలైన ఈ రాజకీయ కథాచిత్రం పదవి అనే పేరుతో తమిళంలో డబ్బింగ్ కూడా చేశారు. ఇకపోతే గోవాలో జరిగిన భారతీయ అంతర్జాతీయ చలనచిత్రోత్సవంలో ఇండియన్ పనోరమా విభాగంలో జరిగిన ప్రదర్శనకు గాను ఈ సినిమా ఎంపిక కావడం గమనార్హం. ఇక ఎంతో మంది యువతకు స్ఫూర్తిదాయకంగా మిగిలిన ఈ చిత్రం రాజకీయాలంటే ఎలా ఉంటాయో చక్కగా చూపించారు.



65 ఏళ్ల వ‌య‌సులో ఒక్క‌టైన జంట..!

బాలీవుడ్ డిమాండ్స్ కు కన్ఫ్యూజ్ అవుతున్న రాజమౌళి !

చంద్ర‌బాబు ఇంత డిఫెన్స్‌లో ప‌డిపోయారా...!

గ్యాస్ లీకేజీ దుర్ఘటనపై.. వెబ్ సిరీస్.. హీరో ఎవరంటే?

ఉత్తరాంధ్రకు పెనుగండం.. ఏ రేంజ్‌లో అంటే..?

అఖండ : ఆ మ్యూజిక్ ఏంటి తమన్?

అఖండ : శ్రీకాంత్ పాత్ర మునిగిపోయిందా?

అఖండ: డీసెంట్ పెర్ఫార్మన్స్ తో ఆకట్టుకున్న 'పూర్ణ'...

బోయపాటి ఇక మారడా..?



సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - Divya]]>