PoliticsPodili Ravindranatheditor@indiaherald.comhttps://www.indiaherald.com/ImageStore/images/politics/politics_latestnews/padayatrae275c5a5-9bd7-4976-aee7-84e67f331440-415x250-IndiaHerald.jpghttps://www.indiaherald.com/ImageStore/images/politics/politics_latestnews/padayatrae275c5a5-9bd7-4976-aee7-84e67f331440-415x250-IndiaHerald.jpgఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో అత్యంత వివాదాస్పద శాఖ ఏదీ అంటే... ప్రస్తుతం ఎవరైనా ఠక్కున చెప్పే సమాధానం పోలీసు శాఖ మాత్రమే. 2019 సార్వత్రిక ఎన్నికల్లో బంపర్ మెజారిటీతో విజయం సాధించింది. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ. ముఖ్యమంత్రిగా వైఎస్ జగన్ మోహన్ రెడ్డి పదవీ బాధ్యతలు చేపట్టిన తర్వాత... ప్రధానంగా ప్రతిపక్ష నేతలనే పోలీసులు టార్గెట్ చేశారనే విమర్శలు వెల్లువెత్తాయి. సందర్భం ఏదైనా సరే... తెలుగుదేశం పార్టీ నేతలది మాత్రమే తప్పు అనేలా పోలీసుల తీరు ఉందని ప్రతిపక్షాల నేతలు ఆరోపించారు కూడా. అధికార పార్టీ నేతలు చెప్పPadayatra{#}Amaravati;Prakasam;Reddy;Yatra;Maha;High court;Varsham;Hanu Raghavapudi;Jagan;Capital;police;Telugu Desam Party;Y. S. Rajasekhara Reddy;court;Nellore;Partyపోలీసు ఆంక్షలు... రోడ్లపై భోజనాలు....!పోలీసు ఆంక్షలు... రోడ్లపై భోజనాలు....!Padayatra{#}Amaravati;Prakasam;Reddy;Yatra;Maha;High court;Varsham;Hanu Raghavapudi;Jagan;Capital;police;Telugu Desam Party;Y. S. Rajasekhara Reddy;court;Nellore;PartyWed, 01 Dec 2021 20:36:12 GMTఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో అత్యంత వివాదాస్పద శాఖ ఏదీ అంటే... ప్రస్తుతం ఎవరైనా ఠక్కున చెప్పే సమాధానం పోలీసు శాఖ మాత్రమే. 2019 సార్వత్రిక ఎన్నికల్లో బంపర్ మెజారిటీతో విజయం సాధించింది. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ. ముఖ్యమంత్రిగా వైఎస్ జగన్ మోహన్ రెడ్డి పదవీ బాధ్యతలు చేపట్టిన తర్వాత... ప్రధానంగా ప్రతిపక్ష నేతలనే పోలీసులు టార్గెట్ చేశారనే విమర్శలు వెల్లువెత్తాయి. సందర్భం ఏదైనా సరే... తెలుగుదేశం పార్టీ నేతలది మాత్రమే తప్పు అనేలా పోలీసుల తీరు ఉందని ప్రతిపక్షాల నేతలు ఆరోపించారు కూడా. అధికార పార్టీ నేతలు చెప్పినట్లుగా పోలీసులు వ్యవహరిస్తున్నారని కూడా పోలీసుల తీరును తప్పుబట్టారు విపక్షాల నేతలు. గతంలో ఎన్నడూ లేని విధంగా ఎస్సీలపైనే అట్రాసిటీ కేసులు నమోదు చేయడంపై అటు హైకోర్టు కూడా తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసింది. ఇక పోలీసుల తీరు కారణంగా రాష్ట్ర డీజీపీ స్వయంగా హైకోర్టు హాజరయ్యారు కూడా. అయినా సరే కొన్ని సందర్భాల్లో పోలీసుల తీరు మాత్రం మారలేదనే విమర్శలు ఇప్పటికీ వినిపిస్తున్నాయి.

అమరావతి మాత్రమే రాష్ట్ర రాజధాని అంటూ నిరసనలు చేస్తున్నారు అమరావతి ప్రాంత రైతులు. ఇప్పటికే 700 రోజులు పైగా ఆందోళనలు చేస్తున్న రైతులు... సేవ్ అమరావతి పేరుతో న్యాయస్థానం టూ దేవస్థానం అంటూ మహా పాదయాత్ర చేపట్టారు రైతులు. ఆ పాదయాత్ర ఇప్పటికే గుంటూరు, ప్రకాశం జిల్లాలు దాటి నెల్లూరు జిల్లాలో కొనసాగుతోంది. మొదట్లో పాదయాత్రకు అనుమతి లేదన్నారు పోలీసులు. చివరికి హైకోర్టు ఉత్తర్వులతో యాత్ర ప్రారంభించారు. అయినా నిబంధనలు ఉల్లంఘిస్తున్నారంటూ పోలీసులు పలు చోట్ల ఆటంకం కలిగించారు కూడా. ఇక యాత్రలో పాల్గొన్న వారి ఫోటోలు తీయడం ద్వారా రైతుల ఆగ్రహానికి కూడా గురయ్యారు. ఇప్పుడు తాజాగా నెల్లూరు జిల్లాలో రైతుల పాదయాత్రకు అడ్డంకులు పెట్టారనే ఆరోపణలు వెల్లువెత్తాయి. పాదయాత్ర చేస్తున్న తమకు భోజనం వండుకునేందుకు కూడా షెడ్లు లేకుండా చేశారనే రైతులు ఆరోపిస్తున్నారు. దీంతో చేసేది లేక వర్షం పడుతున్నా.. నడిరోడ్డుపైనే భోజనం చేశామని రైతులు వాపోతున్నారు.





పెట్రోల్ మరియు డీజిల్ జిఎస్టి పరిధిలోకి వస్తాయా?

'పుష్ప' ప్రీ రిలీజ్ కి నో గెస్ట్స్.. కారణం..?

కంగనా సోషల్ పోస్ట్‌లకు సెన్సార్‌... సుప్రీం కోర్టులో పిటిషన్

ఓటీఎస్‌పై జగన్ క్లారిటీ....!

మళ్ళీ ఒక్కటి కానున్న 'రవి - శ్రీముఖి'... ?

తల్లులకు జగన్ ఫైనల్ వార్నింగ్...!

ఆ రైతులకు.. సాయం కుదరదు..!

వరి అస్త్రం.. ఇద్దరి నడుమ నలుగుతున్న రైతు..!

యష్‌ రాజ్‌ ఫిలిమ్స్‌ తో భారీ ఒప్పందం కుదుర్చుకున్న సమంత..!



సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - Podili Ravindranath]]>