MoviesVUYYURU SUBHASHeditor@indiaherald.comhttps://www.indiaherald.com/ImageStore/images/movies/movies_latestnews/rjyvzztresdexsqrtyjkchvxc12345-415x250-IndiaHerald.jpghttps://www.indiaherald.com/ImageStore/images/movies/movies_latestnews/rjyvzztresdexsqrtyjkchvxc12345-415x250-IndiaHerald.jpgఏపీలో వరద బాధితులకు తెలుగు సినిమా హీరోలు సాయం ప్ర‌క‌టిస్తున్నారు. కొద్ది రోజుల క్రింద‌ట వైసీపీ కి చెందిన నెల్లూరు జిల్లా కోవూరు ఎమ్మెల్యే న‌ల్ల‌పురెడ్డి ప్ర‌స‌న్న కుమార్ రెడ్డి ఏపీ లో వ‌ర‌ద‌లు వ‌చ్చి ప్ర‌జ‌లు విల‌విల్లాడుతుంటే అస‌లు సినిమా హీరోలు ప‌ట్టించు కోవ‌డం లేద‌ని ఫైర్ అయ్యారు. గ‌తంలో ఎన్టీఆర్ - ఏఎన్నార్ ప్ర‌జ‌ల‌కు ఇబ్బందులు వ‌చ్చిన‌ప్పుడు జోలె ప‌ట్టి మ‌రీ విరాళాలు పోగు చేసి నాడు ప్ర‌జ‌ల‌ను ఆదుకున్నార‌ని వారిని మెచ్చుకున్నారు. ఇప్ప‌టి హీరోలు ఏపీ ప్ర‌జ‌ల అభిమానాల‌తో స్టార్ హీరోలు అయ్యి వాCharan{#}Kumaar;nidhi;MLA;Ram Charan Teja;YCP;Chiranjeevi;ram pothineni;NTR;Nellore;Andhra Pradesh;Telugu;Cinema;Heroఏపీ వ‌ర‌ద బాధితుల‌కు రామ్‌చ‌ర‌ణ్ భారీ సాయంఏపీ వ‌ర‌ద బాధితుల‌కు రామ్‌చ‌ర‌ణ్ భారీ సాయంCharan{#}Kumaar;nidhi;MLA;Ram Charan Teja;YCP;Chiranjeevi;ram pothineni;NTR;Nellore;Andhra Pradesh;Telugu;Cinema;HeroWed, 01 Dec 2021 18:45:34 GMTఏపీలో వరద బాధితులకు తెలుగు సినిమా హీరోలు సాయం ప్ర‌క‌టిస్తున్నారు. కొద్ది రోజుల క్రింద‌ట వైసీపీ కి చెందిన నెల్లూరు జిల్లా కోవూరు ఎమ్మెల్యే న‌ల్ల‌పురెడ్డి ప్ర‌స‌న్న కుమార్ రెడ్డి ఏపీ లో వ‌ర‌ద‌లు వ‌చ్చి ప్ర‌జ‌లు విల‌విల్లాడుతుంటే అస‌లు సినిమా హీరోలు ప‌ట్టించు కోవ‌డం లేద‌ని ఫైర్ అయ్యారు. గ‌తంలో ఎన్టీఆర్  - ఏఎన్నార్ ప్ర‌జ‌ల‌కు ఇబ్బందులు వ‌చ్చిన‌ప్పుడు జోలె ప‌ట్టి మ‌రీ విరాళాలు పోగు చేసి నాడు ప్ర‌జ‌ల‌ను ఆదుకున్నార‌ని వారిని మెచ్చుకున్నారు.

ఇప్ప‌టి హీరోలు ఏపీ ప్ర‌జ‌ల అభిమానాల‌తో స్టార్ హీరోలు అయ్యి వారిని ప‌ట్టించు కోవ‌డం లేద‌ని ఫైర్ అయ్యారు. అయితే ఇప్పుడిప్పుడే స్టార్ హీరోలు స్పందిస్తూ త‌మ వంతుగా విరాళాలు ఇస్తున్నారు. ఈ రోజు యంగ్ టైగ‌ర్ ఎన్టీఆర్ త‌న వంతుగా వ‌ర‌ద బాధితుల కోసం రు. 25 ల‌క్ష‌లు ఇస్తున్న‌ట్టు ప్ర‌క‌టించారు. ఇక మెగాస్టార్ చిరంజీ వితో పాటు ఆయ‌న త‌న‌యుడు రామ్ చ‌ర‌ణ్ సైతం ఈ రోజు త‌మ వంతుగా విరాళాలు ప్ర‌క‌టించారు.

ముందుగా చిరంజీవి త‌న వంతుగా రు. 25 ల‌క్ష‌ల విరాళం ప్ర‌క‌టించారు. ఆ త‌ర్వాత ఆయ‌న త‌న‌యుడు రామ్ చ‌ర‌ణ్ సైతం చిరంజీవి బాటలోనే ప‌య‌నించారు. చిరంజీవి, రామ్ చరణ్ ల నుండి మొత్తం ఏపీ ప్రభుత్వ సహాయ నిధి కి మొత్తం 50 లక్షల రూపాయలు విరాళం ప్ర‌క‌టించిన ట్టు అయ్యింది. ఏదేమైనా ఏ విప‌త్తు వ‌చ్చినా కూడా ఆదుకునే విష‌యంలో తాము ముందు ఉంటామ‌ని మ‌రో సారి మెగా ఫ్యామి లీ ఫ్రూవ్ చేసుకుంది.

ఇక రామ్ చ‌ర‌ణ్ కంటే ముందే చిరంజీవి స్పందించారు. ఆయ‌న త‌న వంతుగా వ‌ర‌ద బాధితులను ఆదుకునేందుకు తనవంతు సాయంగా 25 లక్షల రూపాయలను ఇచ్చారు. ఆ త‌ర్వాత చెర్రీ కూడా స్పందించారు. మ‌రి వీరి బాట‌లోనే మిగిలిన హీరో లు కూడా స్పందిస్తారేమో ?  చూడాలి.



రాజశేఖర్ కెరీర్ లో మైలు రాయిగా నిలిచినా.. ఆ సినిమాకు 21ఏళ్ళు...!

'పుష్ప' ప్రీ రిలీజ్ కి నో గెస్ట్స్.. కారణం..?

కంగనా సోషల్ పోస్ట్‌లకు సెన్సార్‌... సుప్రీం కోర్టులో పిటిషన్

ఓటీఎస్‌పై జగన్ క్లారిటీ....!

మళ్ళీ ఒక్కటి కానున్న 'రవి - శ్రీముఖి'... ?

తల్లులకు జగన్ ఫైనల్ వార్నింగ్...!

ఆ రైతులకు.. సాయం కుదరదు..!

వరి అస్త్రం.. ఇద్దరి నడుమ నలుగుతున్న రైతు..!

యష్‌ రాజ్‌ ఫిలిమ్స్‌ తో భారీ ఒప్పందం కుదుర్చుకున్న సమంత..!



సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - VUYYURU SUBHASH]]>