PoliticsM N Amaleswara raoeditor@indiaherald.comhttps://www.indiaherald.com/ImageStore/images/politics/politics_analysis/tdp06f1ee9c-96d7-4056-9510-e941aa33fd8c-415x250-IndiaHerald.jpghttps://www.indiaherald.com/ImageStore/images/politics/politics_analysis/tdp06f1ee9c-96d7-4056-9510-e941aa33fd8c-415x250-IndiaHerald.jpgప్రకాశం జిల్లాలో తెలుగుదేశం పార్టీకి అసలు కలిసిరాని నియోజకవర్గం ఏదైనా ఉందంటే అది మార్కాపురం అని గట్టిగా చెప్పొచ్చు. ఎందుకంటే ఈ నియోజకవర్గంలో టీడీపీకి ఏ మాత్రం పట్టు లేదు. ఇక్కడి ప్రజలు ఎక్కువ టీడీపీ వైపు మొగ్గు చూపారు. మొదట నుంచి మార్కాపురం కాంగ్రెస్ పార్టీకి కంచుకోటగా ఉంటూ వచ్చింది. కాంగ్రెస్ తర్వాత ఇక్కడ వైసీపీ హవా కొనసాగుతుంది. అసలు టీడీపీకి మాత్రం పెద్దగా చాన్స్ మాత్రం దొరకడం లేదు. tdp{#}Telugu Desam Party;Jagan;TDP;Markapauram;NTR;Hanu Raghavapudi;Congress;Akkineni Nagarjuna;Party;YCPమార్కాపురంలో టీడీపీకి ఆ అదృష్టం లేదా?మార్కాపురంలో టీడీపీకి ఆ అదృష్టం లేదా?tdp{#}Telugu Desam Party;Jagan;TDP;Markapauram;NTR;Hanu Raghavapudi;Congress;Akkineni Nagarjuna;Party;YCPTue, 30 Nov 2021 01:00:00 GMTప్రకాశం జిల్లాలో తెలుగుదేశం పార్టీకి అసలు కలిసిరాని నియోజకవర్గం ఏదైనా ఉందంటే అది మార్కాపురం అని గట్టిగా చెప్పొచ్చు. ఎందుకంటే ఈ నియోజకవర్గంలో టీడీపీకి ఏ మాత్రం పట్టు లేదు. ఇక్కడి ప్రజలు ఎక్కువ టీడీపీ వైపు మొగ్గు చూపారు. మొదట నుంచి మార్కాపురం కాంగ్రెస్ పార్టీకి కంచుకోటగా ఉంటూ వచ్చింది. కాంగ్రెస్ తర్వాత ఇక్కడ వైసీపీ హవా కొనసాగుతుంది. అసలు టీడీపీకి మాత్రం పెద్దగా చాన్స్ మాత్రం దొరకడం లేదు.

పార్టీ పెట్టిన మొదట్లో అంటే ఎన్టీఆర్ హవా ఉన్న 1983, 1985 ఎన్నికల్లో సైతం ఇక్కడ టీడీపీ గెలవలేదు. ఆ తర్వాత 1989, 1994, 1999, 2004 ఎన్నికల్లో కూడా పార్టీ గెలవలేదు. కేవలం 2009 ఎన్నికల్లో మాత్రమే టీడీపీ ఇక్కడ గెలిచింది. ఏదో అదృష్టం కొద్ది ఆ ఎన్నికల్లో విజయం సాధించింది. ఇక 2014, 2019 ఎన్నికల్లో మళ్ళీ ఆ అదృష్టం కలిసిరాలేదు. రెండు సార్లు వైసీపీ గెలుస్తూ వచ్చింది.

ప్రస్తుతం ఇక్కడ వైసీపీ ఎమ్మెల్యేగా కె నాగార్జున రెడ్డి పనిచేస్తున్నారు. నియోజకవర్గంలో వైసీపీ అభిమానులు ఎక్కువగా ఉండటంతో నాగార్జునకు తిరుగులేకుండా పోతుంది. పైగా జగన్ ఇమేజ్ బాగా ప్లస్ అవుతుంది. పథకాలు ఇంకా ప్లస్. కానీ ఎమ్మెల్యేగా నాగార్జునకు మంచి మార్కులు ఏమి పడటం లేదు. ఇక్కడ సమస్యలు కూడా ఎక్కువే. కానీ జగన్ ఇమేజ్ వల్ల మాత్రం ఆ లోటు ఏమి కనబడటం లేదు.

అయితే ఇక్కడ టీడీపీ తరుపున కందుల నారాయణరెడ్డి పనిచేస్తున్నారు. వరుసపెట్టి ఎన్ని ఓటములు వచ్చినా సరే పార్టీని వీడకుండా, పార్టీ కోసం కష్టపడుతున్నారు. ఈ సారి ఎన్నికల్లో అయినా మార్కాపురంలో టీడీపీ జెండా ఎగరవేయాలని కందుల చూస్తున్నారు. కాకపోతే ఇక్కడ వైసీపీ హవా ఎక్కువ కాబట్టి...కందులకు గెలిచే అవకాశాలు తక్కువ ఉన్నాయి. కానీ ఎన్నికల సమయంలో ఏదైనా మార్పులు జరిగితే కందులకు చాన్స్ ఉంటుంది. చూడాలి మరి మార్కాపురంలో టీడీపీకి ఈ సారైనా అదృష్టం కలిసొస్తుందేమో?



ఆ మంత్రులు డేంజర్ జోన్‌లో ఉన్నారా?

ప‌శ్చిమ రాజ‌కీయాల్లో ' అశోక ' చ‌క్ర‌వ‌ర్తే...!

యాంకర్ రవి విషయంలో ఏం జరిగిందో చెప్పాలి : బిజెపి ఎమ్మెల్యే

ప్రతిష్టాత్మక ఎన్నిక... ఊహించని పరిణామాలు...!

సిఎస్కె తర్వాత కెప్టెన్ అతనేనట?

ఈ హీరోయిన్ టాలీవుడ్ కి వరమా...?

బిగ్ బాస్ 5:శ్రీరామ్ తో స్నేహం చాలా ప్రమాదం...?

ఫ్యాన్ ఆంధ్రా : నెల్లూరు పెద్దారెడ్డి మ‌రో పీజేఆర్ ?

రెక్కలు లెక్కలు : పరుగు సీఎంది..పదవి సీనియర్లది!



సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - M N Amaleswara rao]]>