Online class: ఫేమస్ విద్యాసంస్థ, ఆన్ లైన్ క్లాసుల్లో పోర్న్ వీడియో ప్రత్యక్షం ?. ఐటీ హబ్ లో కలకలం!
బెంగళూరు: కరోనా వైరస్ (COVID-19) మహమ్మారి పుణ్యమా అంటూ విద్యార్థులకు ఆన్ లైన్ క్లాసులు మొదలైనాయి. 1వ తరగతి నుంచి పిల్లలకు ఆన్ లైన్ క్లాసులు చెబుతున్న విద్యాసంస్థలు పిల్లలకు మొబైల్ ఫోన్లు, ల్యాప్ టాప్ లు దగ్గరగా పరిచయం చేశారు. కరోనా వైరస్ మహమ్మారి శాంతించినా చాలా విద్యాసంస్థలు ఇప్పటికి ఆన్ లైన్ క్లాసులు చెబుతున్నారు. ఆన్ లైన్ క్లాసుల ముందు విద్యార్థులతో పాటు వారి తల్లిదండ్రులు, కుటుంబ సభ్యులు కుర్చుంటున్నారు.
ఐటీ హబ్ లో ప్రముఖ విద్యాసంస్థకు చెందిన విద్యార్థులు ఆన్ లైన్ క్లాసులకు హాజరై పాఠాలు వింటున్న సమయంలో ఒక్కసారిగా బూతు బొమ్మలు, పోర్న్ వీడియోలు ప్రత్యక్షం కావడం కలకలం రేపింది. విద్యార్థులతో పాటు వారి కుటుంబ సభ్యులు, ఉపాధ్యాయులు పోర్న్ వీడియోలు చూసి హడలిపోయి వెంటనే ఆన్ లైన్ క్లాసులు నిలిపివేశారు. పరువు పోతుందని ఆ విద్యాసంస్థ నిర్వహకులు ఈ విషయాన్ని రహస్యంగా దాచిపెట్టారు. అయితే కొందరు విద్యార్థుల కుటుంబ సభ్యులు చైల్డ్ రైట్స్ వెల్ఫేర్ సంస్థకు సమాచారం ఇవ్వడంతో ఈ విషయం వెలుగులోకి రావడం కలకలం రేపింది.

ఫేమస్ విద్యాసంస్థ
ఐటీ హబ్ బెంగళూరులోని హెణ్ణూరు మెయిన్ రోడ్డులోని లింగరాజపురంలో ఫేమస్ విద్యాసంస్థ ఉంది. రోనా వైరస్ పుణ్యమా అంటూ లింగరాజపురంలోని ఆ విద్యాసంస్థ నిర్వహకులు అక్కడ చదువుతున్న విద్యార్థులకు ఆన్ లైన్ క్లాసులు చెబుతున్నారు. ఆ స్కూల్ లో చదువుతున్న విద్యార్థులకు ఆన్ లైన్ క్లాసులు చెబుతున్న విద్యాసంస్థ నిర్వహకులు మొబైల్ ఫోన్లు, ల్యాప్ టాప్ ల్లో పిల్లలకు టచ్ లో ఉన్నారు.

లాగిన్ కోసం పాస్ వర్డ్ ఇచ్చిన యాజమాన్యం
విద్యాసంస్థల్లో చదువుతున్న విద్యార్థులు ఆన్ క్లాసులకు హాజరుకావడానికి ఆ విద్యాసంస్థ నిర్వహకులు ఐడీతో పాటు పాస్ వర్డ్ ఇచ్చారు. స్కూల్ యాజమాన్యం సూచించిన టైమ్ లో విద్యార్థులు ఆన్ లైన్ లో లాగిన్ అయ్యి ఆన్ లైన్ తరగతులకు హాజరౌతున్నారు. చాలా రోజులుగా విద్యార్థులు ఆన్ లైన్ క్లాసులకు హాజరౌతున్నారు.

ప్రభుత్వం అవకాశం ఇచ్చినా ఇంకా ఆన్ లైన్ క్లాసులు!
కర్ణాటక ప్రభుత్వం ఆన్ లైన్ తరగతులు కాకుండా విద్యార్థులు నేరుగా విద్యాసంస్థలకు వెళ్లి చదువుకోవడానికి అవకాశం ఇచ్చింది. బెంగళూరులోని చాలా విద్యాసంస్థలు విద్యార్థులు భౌతికంగా స్కూల్ కు హాజరై క్లాసుల్లో చదువుకోవడానికి అవకాశం ఇచ్చింది. అయితే లింగరాజపురంలోని ఆ స్కూల్ యాజమాన్యం ఇంకా ఎక్కువగా ఆన్ లైన్ క్లాసులు చెబుతున్నదని సమాచారం.

ఆ అమ్మాయి ఏం చేసిందంటే?
విద్యాసంస్థలో చదువుతున్న అమ్మాయి ఆన్ లైన్ క్లాసుకు హాజరుకావడానికి లాగిన్ అయ్యింది. అయితే టెక్నికల్ సమస్యలో ఆ అమ్మాయి లాగౌట్ అయ్యింది. కొంతసేపటి తరువాత ఆ అమ్మాయి మరోసారి ఆన్ లైన్ క్లాసుకు హాజరుకావాలని స్కూల్ యాజమాన్యం నుంచి ఓ మెసేజ్ వచ్చింది. తరువాత ఆ అమ్మాయి ఆన్ లైన్ క్లాసుకు హాజరుకావడానికి లాగిన్ అయ్యింది. అంతే ఆ అమ్మాయితో పాటు ఆమె కుటుంబ సభ్యులు బిత్తరపోయారు.

ఆన్ లైన్ క్లాసుల్లో పోర్న్ వీడియోలు ప్రత్యక్షం?
ఆన్ లైన్ క్లాసులు జరుగుతున్న సమయంలో ఒక్కసారిగా విద్యార్థులకు ఆన్ లైన్ లో పోర్న్ వీడియోలు, బూతు బోమ్మలు దర్శనం ఇచ్చాయి. ప్రముఖ విద్యాసంస్థకు చెందిన విద్యార్థులు ఆన్ లైన్ క్లాసులకు హాజరై పాఠాలు వింటున్న సమయంలో ఒక్కసారిగా బూతు బొమ్మలు, పోర్న్ వీడియోలు ప్రత్యక్షం కావడం కలకలం రేపింది.

పరువు పోతుందని దాచిపెట్టిన విద్యాసంస్థ?
విద్యార్థులతో పాటు వారి కుటుంబ సభ్యులు, ఉపాధ్యాయులు పోర్న్ వీడియోలు చూసి హడలిపోయి వెంటనే ఆన్ లైన్ క్లాసులు నిలిపివేశారు. పరువు పోతుందని ఆ విద్యాసంస్థ నిర్వహకులు ఈ విషయాన్ని రహస్యంగా దాచిపెట్టారు. అయితే కొందరు విద్యార్థుల కుటుంబ సభ్యులు చైల్డ్ రైట్స్ వెల్ఫేర్ సంస్థకు సమాచారం ఇవ్వడంతో ఈ విషయం వెలుగులోకి రావడం కలకలం రేపింది.

పాస్ వర్డ్ ఎవరికైనా ఇచ్చారా?
విద్యాసంస్థలో చదువుతున్న విద్యార్థులకు లాగిన్ లింక్ తో పాటు ప్రతిఒక్కరికి పాస్ వర్డ్ ఇచ్చారని తెలిసింది. అయితే ఎవరైనా విద్యార్థులు లాగిన్ ఐడీతో పాటు పాస్ వర్డ్ ఎవరికైనా షేర్ చేశారా ?, వాళ్లు ఏమైనా క్లాసులు జరిగే సమయంలో పోర్న్ వీడియో లింక్ ప్రత్యక్షం అవ్వడానికి ప్రయత్నించారా ? అనే విషయం తెలీదని విద్యాసంస్థ నిర్వహకులు అంటున్నారు. మా విద్యాసంస్థకు చెడ్డపేరు తీసుకురావడానికి ఎవరో కావాలని ఇలా చేసి ఉంటారని ఆ విద్యాసంస్థ నిర్వహకులు ఆరోపణలు చేస్తున్నారని తెలిసింది. ఇంకోసారి ఇలాంటి సంఘటనలు జరగకుండా చూస్తామని విద్యాసంస్థల నిర్వహకులు అంటున్నారు.