PoliticsChandrasekhar Reddyeditor@indiaherald.comhttps://www.indiaherald.com/ImageStore/images/politics/politics_latestnews/stateboarderissues-ded35e62-71ae-46eb-9542-0ede021571a0-415x250-IndiaHerald.jpghttps://www.indiaherald.com/ImageStore/images/politics/politics_latestnews/stateboarderissues-ded35e62-71ae-46eb-9542-0ede021571a0-415x250-IndiaHerald.jpgదేశం స్వాతంత్రం అనంతరం కూడా ఎన్నో పరిణామాలకు గురి అయ్యింది. అంటే ఆయా పరిస్థితులను బట్టి కొన్ని రాష్ట్రాలు కొత్తగా ఏర్పాటు చేయాల్సి వచ్చింది. అది ప్రజా డిమాండ్ కాకపోయినా అలా తెరపైకి తెచ్చే రాజకీయనేతలు ఉన్నారు కాబట్టి అవన్నీ జరిగిపోయాయి. అంతవరకూ బాగానే ఉంది, మరి విభజన సమస్యలు లేని కొత్తగా ఏర్పాటు చేసిన రాష్ట్రాలు ఎన్ని ఉన్నాయి. ఒక్కసారి విభజన జరిగిన తరువాత దానిని గురించి సరిగ్గా పట్టించుకునే ఉద్దేశ్యం ఉంటె, ఆయా సమస్యలు అప్పుడే పరిష్కారం అయ్యేవి. కానీ విభజన అనేది ఒక రాజకీయం, అది కాస్త అయిపోయింది కాstateboarderissues;{#}Thief;Kshanam;Donga;politics;central governmentఎన్నో మాట్లాడతాం.. రాష్ట్రాల మధ్య సమస్యలను తీర్చుకోలేం..!ఎన్నో మాట్లాడతాం.. రాష్ట్రాల మధ్య సమస్యలను తీర్చుకోలేం..!stateboarderissues;{#}Thief;Kshanam;Donga;politics;central governmentSun, 28 Nov 2021 22:34:56 GMTదేశం స్వాతంత్రం అనంతరం కూడా ఎన్నో పరిణామాలకు గురి అయ్యింది. అంటే ఆయా పరిస్థితులను బట్టి కొన్ని రాష్ట్రాలు కొత్తగా ఏర్పాటు చేయాల్సి వచ్చింది. అది ప్రజా డిమాండ్ కాకపోయినా అలా తెరపైకి తెచ్చే రాజకీయనేతలు ఉన్నారు కాబట్టి అవన్నీ జరిగిపోయాయి. అంతవరకూ బాగానే ఉంది, మరి విభజన సమస్యలు లేని కొత్తగా ఏర్పాటు చేసిన రాష్ట్రాలు ఎన్ని ఉన్నాయి. ఒక్కసారి విభజన జరిగిన తరువాత దానిని గురించి సరిగ్గా పట్టించుకునే ఉద్దేశ్యం ఉంటె, ఆయా సమస్యలు అప్పుడే పరిష్కారం అయ్యేవి. కానీ విభజన అనేది ఒక రాజకీయం, అది కాస్త అయిపోయింది కాబట్టి మిగిలినవి పట్టవు నేతలకు. వీలైతే ఆయా సమస్యలను కూడా అడ్డుపెట్టుకొని కావాల్సినప్పుడల్లా రాజకీయాలు చేసుకోవచ్చు అనేది వాళ్ళ ఉద్దేశ్యం కావచ్చు.

ఇక ప్రజలు కూడా ఎప్పుడు రాజకీయనేతలు నమ్మి వాళ్ళు ఏదో ఒకటి చెప్పగానే నమ్మేసి, దానికి అనుగుణంగా అడుగులు వేస్తున్నారు తప్ప, అందులో విషయం గురించి క్షణం ఆగి ఆలోచించడం లేదు. దీనితో తాము ఏమి చెప్పిన నమ్మేస్తున్నారు ఈ పిచ్చి జనం అనుకుంటూ ఉన్నారు నేతలు. అందుకే వాళ్లకు కావాల్సినప్పుడల్లా వచ్చి ముచ్చట చెప్పి తమ పని కనిచ్చేసుకొని వెళ్లిపోతున్నారు. అందులో చివరికి నలిగిపోతున్నది మాత్రం ప్రజలే. అలా పూర్తిగా అడకత్తెరలో నలిగిన తరువాత కానీ ప్రజలు కూడా గ్రహించడం లేదు. ఇదే తప్పుడు నేతలకు బాగా అవకాశం అవుతుంది. దానితో ఇష్టానికి దొంగ రాజకీయాలు చేసి పబ్బం గడుపుకుంటున్నారు.

ఆయా రాష్ట్రాల విభజన జరిగినప్పుడు దానికి సంబందించిన ప్రక్రియ కూడా తక్షణమే పూర్తిచేయాల్సి ఉంది. అది సక్రమంగా ప్రజల కోరిక మేరకు జరిగినట్లయితే ఆ ప్రక్రియ సజావుగా జరిగేది. కానీ, అదంతా రాజకీయ ఎత్తుగడ మాత్రమే కనుక సమస్యలు అలాగే పేరుకుపోయి ఉన్నాయి. దశాబ్దాలు గడిచిపోయినా రాష్ట్రాల మధ్య సమస్యలు తీరానివి ఇంకా ఉన్నాయి అంటేనే నిర్లక్ష్యం ఎంతగా ఉందొ అర్ధం అవుతుంది. దాని గురించి మాట్లాడటానికి ఆయా ప్రభుత్వాలకు సమయం ఉండదు కానీ, లేనిపోని విషయాలపై చర్చించుకోవడానికి మాత్రం వెసులుబాటు బలే వెతుక్కుంటారు. ఇప్పటికైనా ఆయా సమస్యలు తీర్చగలరని కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల కు గుర్తుచేయండి మరి.



మళ్లీ దిల్లీలో ఉద్యమం.. 4 లక్షల ట్రాక్టర్లతో భారీ ర్యాలీ..?



సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - Chandrasekhar Reddy]]>