MoviesP.Nishanth Kumareditor@indiaherald.comhttps://www.indiaherald.com/ImageStore/images/movies/movies_latestnews/akhandaa72750b2-3f48-4811-9c97-8e364569a90e-415x250-IndiaHerald.jpghttps://www.indiaherald.com/ImageStore/images/movies/movies_latestnews/akhandaa72750b2-3f48-4811-9c97-8e364569a90e-415x250-IndiaHerald.jpgనందమూరి బాలకృష్ణ, బోయపాటి శ్రీను కాంబినేషన్ లో తెరకెక్కుతున్న చిత్రం అఖండ. ఎన్నో అంచనాల మధ్య రూపొందిన ఈ చిత్రం డిసెంబర్ 3వ తేదీన ప్రేక్షకుల ముందుకు రాబోతున్న విషయం తెలిసిందే. ఈ చిత్రానికి సంబంధించిన ప్రీ రిలీజ్ ఈవెంట్ హైదరాబాద్ లో ఎంతో ఘనంగా జరిగింది. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా రాజమౌళి మరియు ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ రాగా ఆయన ఈ కార్యక్రమానికి ముఖ్య అతిధి గా రావడం ఒక్కసారిగా టాలీవుడ్ లో అందరికీ రిఫ్రెష్ ఫీలింగ్ నీ ఇచ్చిందని చెప్పాలి.akhanda{#}war;Allu Arjun;Balakrishna;boyapati srinu;Tollywood;Event;Rajamouli;media;Hero;Athidhi;Chitram;Cinemaఅఖండ ఈవెంట్ వారిలో మార్పు తీసుకొచ్చిందా!!అఖండ ఈవెంట్ వారిలో మార్పు తీసుకొచ్చిందా!!akhanda{#}war;Allu Arjun;Balakrishna;boyapati srinu;Tollywood;Event;Rajamouli;media;Hero;Athidhi;Chitram;CinemaSun, 28 Nov 2021 23:00:00 GMT
నందమూరి బాలకృష్ణ, బోయపాటి శ్రీను కాంబినేషన్ లో తెరకెక్కుతున్న చిత్రం అఖండ. ఎన్నో అంచనాల మధ్య రూపొందిన ఈ చిత్రం డిసెంబర్ 3వ తేదీన ప్రేక్షకుల ముందుకు రాబోతున్న విషయం తెలిసిందే. ఈ చిత్రానికి సంబంధించిన ప్రీ రిలీజ్ ఈవెంట్ హైదరాబాద్ లో ఎంతో ఘనంగా జరిగింది. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా రాజమౌళి మరియు ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ రాగా ఆయన ఈ కార్యక్రమానికి ముఖ్య అతిధి గా రావడం ఒక్కసారిగా టాలీవుడ్ లో అందరికీ రిఫ్రెష్ ఫీలింగ్ నీ ఇచ్చిందని చెప్పాలి.

టాలీవుడ్ లో ఎక్కడా లేని విధంగా ఫ్యాన్ వార్స్ ఎక్కువగా జరుగుతూ ఉంటాయి. ముఖ్యంగా సోషల్ మీడియా డెవలప్ అయిన దగ్గర నుంచి ఆన్ లైన్ లో యుద్ధాలు ఇద్దరు హీరోల అభిమానుల మధ్య జరుగుతూ ఉంటాయి.  కానీ ఎవరూ ఊహించని విధంగా ఒక నందమూరి హీరో ఫంక్షన్ కు మెగా హీరో రావడం అందరినీ ఎంతగానో ఆశ్చర్యపరిచింది. ఫ్యాన్ వార్ కారణంగా వీరి మధ్య కూడా అభిప్రాయభేదాలు ఉన్నాయ్ అని అందరూ అనుకున్నారు. కానీ తమ మధ్య ఎలాంటి అభ్యంతరాలు అభిప్రాయభేదాలు విభేదాలు లేవని అల్లుఅర్జున్ ఈ ఫంక్షన్ కి వచ్చి నిరూపించాడు. 

అంతకు ముందు నందమూరి బాలకృష్ణ మెగా వారు నిర్వహిస్తున్న ఆహా యాప్ కు సంబంధించిన ఓ టాక్ షోలో బాలకృష్ణ పాల్గొనగా ఇప్పుడు దానికి బదులుగా అల్లు అర్జున్సినిమా ఫంక్షన్ కు విచ్చేసి ఒక్కసారిగా అందరినీ ఆశ్చర్య పరిచాడు. మరి ఇప్పటికైనా హీరోల అభిమానులు మారతారా అని కొంతమంది టాలీవుడ్ లో చర్చలు జరుపుతున్నారు.  ఇటీవల కాలంలో ఒక హీరో మరొక హీరో వచ్చే కార్యక్రమాలకు హాజరై తమ మధ్య స్నేహబంధాన్ని చాటి చెబుతుండగా వారిలాగా ఉండకుండా ఈ అభిమానులు ఎందుకు కొట్టుకుంటున్నారు అనేది వారి వాదన. గతంలో ఈ అభిమానులు ప్రాణాలు కోల్పోయిన వారు చాలా మంది ఉన్నారు. ఇప్పుడైనా ఇలాంటి సంఘటనలు జరగకుండా ఉంటాయని అందరూ భావిస్తున్నారు. 



మళ్లీ దిల్లీలో ఉద్యమం.. 4 లక్షల ట్రాక్టర్లతో భారీ ర్యాలీ..?



సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - P.Nishanth Kumar]]>