BusinessChandrasekhar Reddyeditor@indiaherald.comhttps://www.indiaherald.com/ImageStore/images/business/technology_videos/tatachips-e08cb79a-f384-4810-b6be-fec9359bb264-415x250-IndiaHerald.jpghttps://www.indiaherald.com/ImageStore/images/business/technology_videos/tatachips-e08cb79a-f384-4810-b6be-fec9359bb264-415x250-IndiaHerald.jpgకరోనా సమయంలో ఎగుమతులు లేదా దిగుమతులు ఆగిపోవడం చూశాం. అసలు ఆయా దేశాలలో లాక్ డౌన్ కారణంగా దాదాపు అన్ని రంగాలు ఉత్పత్తి కూడా ఆపేశాయి. దీనితో చాలా రంగాలలో అతి ముఖ్యంగా వాడే చిప్(సెమీ కండక్టర్) అందుబాటులో లేకుండా పోయింది. ఇప్పటి పరిస్థితులలో అన్ని వస్తువులను సాంకేతికతతో మేళవించి తయారుచేస్తున్నారు. అందువలన ఈ చిప్ అవసరం బాగా ఉంటుంది. కానీ అవి తయారు చేస్తున్నదే కొన్ని దేశాలు(తైవాన్, కొరియా, చైనా..) మాత్రమే. అవి కూడా కరోనా సమయంలో అవసరం అయిన వారికి సరఫరా చేసే స్థితిలో లేనందున అనంతర ఉత్పత్తి బాగా క్షించిందtatachips;{#}contract;India;Coronavirusటాటా : చిప్ ఉత్పత్తికి.. సిద్ధం..!టాటా : చిప్ ఉత్పత్తికి.. సిద్ధం..!tatachips;{#}contract;India;CoronavirusSat, 27 Nov 2021 21:49:47 GMTకరోనా సమయంలో ఎగుమతులు లేదా దిగుమతులు ఆగిపోవడం చూశాం. అసలు ఆయా దేశాలలో లాక్ డౌన్ కారణంగా దాదాపు అన్ని రంగాలు ఉత్పత్తి కూడా ఆపేశాయి. దీనితో చాలా రంగాలలో అతి ముఖ్యంగా వాడే చిప్(సెమీ కండక్టర్) అందుబాటులో లేకుండా పోయింది. ఇప్పటి పరిస్థితులలో అన్ని వస్తువులను సాంకేతికతతో మేళవించి తయారుచేస్తున్నారు. అందువలన ఈ చిప్ అవసరం బాగా ఉంటుంది. కానీ అవి తయారు చేస్తున్నదే కొన్ని దేశాలు(తైవాన్, కొరియా, చైనా..) మాత్రమే. అవి కూడా కరోనా సమయంలో అవసరం అయిన వారికి సరఫరా చేసే స్థితిలో లేనందున అనంతర ఉత్పత్తి బాగా క్షించింది. దీనితో ఆయా దేశాలలోని కొన్ని సంస్థలు తమ ఉత్పత్తులను నిలుపుదల చేసిన పరిస్థితి కూడా చూశాం.  

ఇలాంటి పరిస్థితులలో ఎవరికి వారు చిప్ తయారీ చేసుకోవడం ఉత్తమం అనుకున్నప్పటికీ దానికి కావాల్సిన వనరులు అన్ని దేశాలలో అందుబాటులో లేవు. కనీసం కొన్ని వనరులైన ఇతర దేశాల నుండి దిగుమతి చేసుకోక తప్పదు. అందుకే తైవాన్ తో భారత్ చిప్ ఉత్పత్తి కేంద్రం ఏర్పాటుకు ఒప్పందం కుదుర్చుకుంది. దానిని తట్టుకోలేని చైనా ఏకంగా తైవాన్, భారత్ పైకి యుద్ధానికే ఉరకలు వేస్తుంది. అందుకే ఈ తలనొప్పి అంతా ఎందుకు అని సొంత సాంకేతికత తో ప్రయత్నం చేయాలని దేశీయ సంస్థలతో చర్చలు జరుపడం మొదలు పెట్టింది. చిప్ ఉత్పత్తికి ముందుకు వచ్చిన సంస్థలకు 70-80 శాతం సబ్సిడీ కూడా ప్రకటించింది భారతప్రభుత్వం. దీనితో తాజాగా టాటా సంస్థ అందుకు ముందుకు వచ్చింది.  

టాటా మొదటి నుండి ఆయా దేశాలతో కలిసి వివిధ ఉత్పత్తులను ఎలాగూ చేస్తుంది కాబట్టి, చిప్ ల కోసం కూడా ఆయా దేశాల సమన్వయంతో ఉత్పత్తికి పూనుకునే అవకాశాలు ఆ సంస్థకు ఎక్కువగా ఉన్నాయి. అందుకే బహుశా టాటా ఈ ఒప్పందానికి ముందుకు వచ్చి ఉండొచ్చు. అంటే వనరులు ఎక్కడి నుండి వచ్చినప్పటికీ, త్వరలో స్వదేశీ చిప్ సాంకేతికత అందుబాటులోకి రానుంది. ఇదే జరిగితే భారత్ స్వయంగా వాటిని వాడుకోవడమే కాదు, ఇతర దేశాలకు కూడా ఎగుమతి కూడా చేయగలదు. ఆ స్థాయికి ఈ చిప్ అవసరం ఉంది, కాబట్టి ఇది ఒక మంచి పరిణామం.



చలికి వణికిపోతున్న మహిళ.. కానిస్టేబుల్ ఔదార్యం

ప్రపంచ ఆరోగ్య సంస్థ హెచ్చరిక..! జాగ్రత్త పడకపోతే..!

ఎక్కువగా దాహం వేస్తుందా ? ఈ జబ్బు ఉందేమో జాగ్రత్త !

కొత్త వేరియంట్‌పై తెలంగాణ అప్ర‌మ‌త్తం..!

ఢిల్లీ తమ కెప్టెన్ ను రిటైన్ చేసుకోవడం లేదా...?

గుడ్ న్యూస్ చెప్పిన సీఎం.. త్వరలోనే?

బిజెపి ఆంతర్యం ఏమిటబ్బా !?

అరేబియాలో ప్రమాదం.. ఢీకొన్న విదేశీ కార్గో షిప్‌లు..!

అసమర్ధ సీఎం జగన్: దేవినేని



సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - Chandrasekhar Reddy]]>