MoviesSeetha Sailajaeditor@indiaherald.comhttps://www.indiaherald.com/ImageStore/images/movies/movies_latestnews/alluarjun-pushpaabcf6973-27df-4c2d-b02a-43eac34e8c39-415x250-IndiaHerald.jpghttps://www.indiaherald.com/ImageStore/images/movies/movies_latestnews/alluarjun-pushpaabcf6973-27df-4c2d-b02a-43eac34e8c39-415x250-IndiaHerald.jpgకరోనా సెకండ్ వేవ్ ముగిసిన తరువాత విడుదలైన సినిమాలు అన్నీ మీడియం రేంజ్ చిన్నతరహా సినిమాలు మాత్రమే ఇప్పటి వరకు ఒక్క భారీ సినిమా కూడ విడుదల కాకపోవడంతో రికార్డులు క్రియేట్ చేసెన సినిమా అంటూ ఎక్కడా హడావిడి కనిపించలేదు. దీనితో వచ్చేనెలలో విడుదల కాబోతున్న ‘పుష్ప’ మూవీ ఫలితం పైనే భారీ సినిమాల భవిష్యత్ ఆధారపడి ఉంటుంది అన్న అంచనాలు వస్తున్నాయి.ఈమూవీని 180 కోట్ల బడ్జెట్ తో నిర్మాణం చేయడమే కాకుండా పాన్ ఇండియా మూవీగా 5 భాషలలో విడుదల చేస్తున్నారు. ఈసినిమాతో తనకు నేషనల్ స్టార్ ఇమేజ్ వస్తుందని అల్లు అర్జున్ alluarjun pushpa{#}Allu Arjun;sukumar;Kanna Lakshminarayana;Audience;Industry;Mass;India;Cinemaపుష్ప పై సరికొత్త సందేహాలు !పుష్ప పై సరికొత్త సందేహాలు !alluarjun pushpa{#}Allu Arjun;sukumar;Kanna Lakshminarayana;Audience;Industry;Mass;India;CinemaFri, 26 Nov 2021 08:00:00 GMTకరోనా సెకండ్ వేవ్ ముగిసిన తరువాత విడుదలైన సినిమాలు అన్నీ మీడియం రేంజ్ చిన్నతరహా సినిమాలు మాత్రమే ఇప్పటి వరకు ఒక్క భారీ సినిమా కూడ విడుదల కాకపోవడంతో రికార్డులు క్రియేట్ చేసెన సినిమా అంటూ ఎక్కడా హడావిడి కనిపించలేదు. దీనితో వచ్చేనెలలో విడుదల కాబోతున్న ‘పుష్ప’ మూవీ ఫలితం పైనే భారీ సినిమాల భవిష్యత్ ఆధారపడి ఉంటుంది అన్న అంచనాలు వస్తున్నాయి.


ఈమూవీని 180 కోట్ల బడ్జెట్ తో నిర్మాణం చేయడమే కాకుండా పాన్ ఇండియా మూవీగా 5 భాషలలో విడుదల చేస్తున్నారు. ఈసినిమాతో తనకు నేషనల్ స్టార్ ఇమేజ్ వస్తుందని అల్లు అర్జున్ చాల ఆశలు పెట్టుకున్నాడు. అయితే ఈమూవీకి ఎంతవరకు ఫ్యామిలీ ప్రేక్షకులు వస్తారు అన్న సరికొత్త సందేహాలను ఇండస్ట్రీలోని కొందరు లేటెస్ట్ గా తెరపైకి తీసుకు వస్తున్నారు.


గతంలో సుకుమార్ తీసిన ‘ఆర్య’ ‘ఆర్య 2’ ‘100% లవ్’ ‘నాన్నకు ప్రేమతో’ ‘రంగస్థలం’ మూవీలు అన్నింటికీ ఫ్యామిలీ ప్రేక్షకులు విపరీతంగా వచ్చారు. దీనితో ఈ సినిమాలు అన్నీ సూపర్ హిట్ గా నిలిచాయి. వాస్తవానికి ‘రంగస్థలం’ మూవీ సబ్జెక్ట్ చాలవరకు రగ్డ్ వ్యవహారంలో నడిచినప్పటికీ ఆమూవీకి ఫ్యామిలీ ప్రేక్షకులు విపరీతంగా రావడంతో ఆమూవీ కలక్షన్స్ రికార్డులను క్రియేట్ చేసింది.


ఇప్పుడు విడుదల కాబోతున్న ‘పుష్ప’ మూవీలోని ‘శ్రీవల్లి’ ‘సామీ’ పాటలు లైవ్ లీగా ఉన్నప్పటికీ ఇదే సినిమాకు సంబంధించిన ‘కాస్కో కాస్కో మేక’ ‘బిడ్డా ఇది నా అడ్డా’ పాటలు మాసీగా ఉంటూ గతంలో సుకుమార్ తీసిన ‘రంగస్థలం’ మూవీకన్నా కన్నా రగ్డ్ లుక్ లో కనిపిస్తున్న పరిస్థితులలో ఈపాటలకు సంబంధించిన కలర్ టోన్ కానీ గెటప్ లు కానీ బాగా రఫ్ గా  కనిపిస్తున్న పరిస్థితులలో చివరకు ఈమూవీ మాస్ మూవీగా మారిపోయే అవకాశం ఉందా అంటూ ఆసక్తికర కామెంట్స్ ఇండస్ట్రీ వర్గాలలో వినిపిస్తున్నాయి. ఇప్పుడు ఈ కామెంట్స్ ఈమూవీ బయ్యర్ల వరకు వెళ్ళడంతో వారంతా టెన్షన్ పడుతున్నట్లు టాక్..






ముంబయి 26/11: ఆ పాపం కాంగ్రెస్ పార్టీదే..!

ఢిల్లీలో కేంద్రంతో తెలంగాణ మంత్రుల భేటీ షురూ

దేవినేని ఉమాలో ఈ కొత్త హుషారుకు కార‌ణ‌మేంటి..!

వైసీపీ నేత‌ల‌కు భ‌ద్ర‌త పెంపు వెనుక వ్యూహం ఏంటి..?

ప్రభుదేవా తో అనసూయ..!

ఏపీ స్పీక‌ర్ సంచ‌ల‌న నిర్ణ‌యం..!

ఫ్యాన్ ఆంధ్రా : ఉద్యోగికి తీపి క‌బురు ! అన్న‌యిచ్చినాడో!

గోదావ‌రి వైసీపీ ఎమ్మెల్యేల్లో గుబులు రేగుతోందా ?

అసెంబ్లీలో జరిగిన ఘటనపై తొలిసారి స్పందించిన భువ‌నేశ్వ‌రి



సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - Seetha Sailaja]]>