PoliticsChandrasekhar Reddyeditor@indiaherald.comhttps://www.indiaherald.com/ImageStore/images/politics/politics_latestnews/yogi-adithyanath64e3c188-c692-4619-a22b-3bcab02d36a8-415x250-IndiaHerald.jpghttps://www.indiaherald.com/ImageStore/images/politics/politics_latestnews/yogi-adithyanath64e3c188-c692-4619-a22b-3bcab02d36a8-415x250-IndiaHerald.jpgఉత్తరప్రదేశ్ ముఖ్యమంత్రిగా ఉన్న యోగి ఆదిత్యనాధ్ మరో నిర్ణయానికి తెరలేపారు. ఇటీవలే భారీగా రోడ్లవ్యవస్థపై నిర్ణయం తీసుకున్న ఆయన తాజాగా మరో భారీ కట్టడానికి గ్రీన్ సిగ్నల్ ఇచ్చేశారు. భారీ ప్రాజెక్టులు ఏర్పాటుకు కారణాలు తెలియనప్పటికీ, అవన్నీ పెద్దగా పనికి వచ్చేవి కాదనేది విశ్లేషకుల మాటలు. ప్రపంచంలోనే అతిపెద్ద విగ్రహం ఏర్పాటు చేసిన మోడీ మొండితనం నుండి సీఎం యోగి కి కూడా కాస్త అబ్బినట్టే ఉంది. అందుకే ఇటీవల ఈ తరహా నిర్ణయాలతో అందరిని ఆశ్చర్యపరుస్తున్నారు. ఏది ఏమైనా అనవసర పెట్టుబడులు అనే అంశం మాత్రం బాగా అnoidafilmcityup;{#}yogi;Ramoji Film City;Pakistan;CMవృధా వినియోగానికి.. సీఎం యోగి ప్రయత్నాలు..!వృధా వినియోగానికి.. సీఎం యోగి ప్రయత్నాలు..!noidafilmcityup;{#}yogi;Ramoji Film City;Pakistan;CMThu, 25 Nov 2021 15:17:57 GMTఉత్తరప్రదేశ్ ముఖ్యమంత్రిగా ఉన్న యోగి ఆదిత్యనాధ్ మరో నిర్ణయానికి తెరలేపారు. ఇటీవలే భారీగా రోడ్లవ్యవస్థపై నిర్ణయం తీసుకున్న ఆయన తాజాగా మరో భారీ కట్టడానికి గ్రీన్ సిగ్నల్ ఇచ్చేశారు. భారీ ప్రాజెక్టులు ఏర్పాటుకు కారణాలు తెలియనప్పటికీ, అవన్నీ పెద్దగా పనికి వచ్చేవి కాదనేది విశ్లేషకుల మాటలు. ప్రపంచంలోనే అతిపెద్ద విగ్రహం ఏర్పాటు చేసిన మోడీ మొండితనం నుండి సీఎం యోగి కి కూడా కాస్త అబ్బినట్టే ఉంది. అందుకే ఇటీవల ఈ తరహా నిర్ణయాలతో అందరిని ఆశ్చర్యపరుస్తున్నారు. ఏది ఏమైనా అనవసర పెట్టుబడులు అనే అంశం మాత్రం బాగా అర్ధం అవుతుంది. ఆ మధ్య అసలు వ్యాపారం జరిగే అవకాశాలు లేని చోట పాక్ ఒక భారీ వాణిజ్య కేంద్రాన్ని ఏర్పాటు చేసినట్టుగానే ప్రస్తుత సీఎం యోగి నిర్ణయం ఉండబోతుందని విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు.

భారతదేశంలో ఏ మూలన చూసినా అనేక కళల సమ్మేళనం కనిపించక మానదు. అలాంటి దేశంలో కళ కు సంబంధిత ఏ వ్యవస్థ ఏర్పాటు చేసినప్పటికీ దానికి గౌరవం ఇనుమడింపజేసినట్టే అవుతుంది. అయితే ఒకేసారి భారీగా ఖర్చుపెట్టినంత మాత్రాన కళలను గౌరవించినట్టు కాదు, అవసరం బట్టి ఆయా ప్రాంతాలలో ఆయా వ్యవస్థలను ఏర్పాటు చేయడం అక్కడ ఉన్న వారికి అలాగే వాటిని ఆస్వాదించే ప్రేక్షకులకు మేలు చేసే విషయం. కానీ అంతా ఒక్క చోటే పెట్టేసి, అక్కడే అందరు వచ్చి వారివారి ప్రదర్శనలు ఇచ్చుకోండి అనేట్టుగా ఏర్పాట్లు ఉంటె అది అభివృద్ధిని ఒక్క చోట కేంద్రీకరించినట్టు అవుతుంది. అక్కడకు ఆయా వర్గాలు వస్తారు, కళలను ప్రదర్శించుకుంటూ పొట్టపోసుకుంటారు, అంతవరకు బాగానే ఉంటుంది. మరి అక్కడకు వారందరు సొంత ప్రాంతాలను వదిలేసి వచ్చి ఉండాల్సి రావడం అనే విషయం గురించి కూడా ఆలోచిస్తే బాగుంటుంది అనేది విశ్లేషకుల మాట.

తాజాగా యూపీ సీఎం యోగి ఆదిత్యనాధ్ 1000ఎకరాలలో 2400కోట్లతో నోయిడాలో ఫిలిం సిటీ ఏర్పాటు చేస్తున్నట్టు తెలిపారు. అంత భారీ ప్రాజెక్ట్ చేయడం అక్కడ అవసరమేనా అనేది మాత్రం ఆయన స్పష్టం చేయలేదు. ప్రస్తుతం అక్కడ చాలా సమస్యలు ఉండొచ్చు, వాటిపై మనసు కేంద్రీకరించి ఆయా పరిష్కారాలు చేసి ఉంటె బాగుండేది. ప్రస్తుతం ఈ ఫిలిం సిటీ తెలంగాణాలో ఉన్న రామోజీ ఫిలిం సిటీ కంటే భారీగా చేయాలన్నది వాళ్ళ ఆలోచన అట. అసలు మొదలు పెట్టినప్పుడు రామోజీ ఫిలిం సిటీ కే అంత ఆదరణ లేదు. మరి దీనికి ఎంత ఉంటుందో వేచి చూడాల్సి ఉంది. 2024కల్లా ఇది అందుబాటులోకి వస్తుందట. కళాకారులకు మేలు జరిగితే అంతే చాలు.



'RRR' ట్రైలర్, వరుస ఈవెంట్స్ గురించి హింట్స్ ఇచ్చిన రాజమౌళి..!!

బాలాకోట్ పై.. ఇంకా సందేహాలేనా..!

సంగీత ప్రపంచంలో దూసుకుపోతున్న మిక్కీ జే మేయర్

తైవాన్ పై.. చైనా వ్యూహం..!

జూనియర్ ఎన్టీఆర్ చెబితే మేము వినడం ఏమిటి..?

దృశ్యం సీక్వెల్ ఓకే.. F2 సీక్వెల్ ఏం చేస్తుందో!!

టిక్కెట్ కావాలా... బాబోరి కండీష‌న్లు ఇవే...!

టీడీపీలో కాపు నేత‌ల అడ్ర‌స్ ఎక్క‌డ‌...!

ప‌బ్లిక్ ఫోక‌స్ : స్టాలిన్ పై ఏపీ ప్ర‌జ‌లు ప్ర‌శంస‌లు?



సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - Chandrasekhar Reddy]]>