PoliticsGullapally Rajesheditor@indiaherald.comhttps://www.indiaherald.com/ImageStore/images/politics/politics_analysis/kodali-nani2afcd696-a2dd-4dfd-8efe-1156dbbfcf88-415x250-IndiaHerald.jpghttps://www.indiaherald.com/ImageStore/images/politics/politics_analysis/kodali-nani2afcd696-a2dd-4dfd-8efe-1156dbbfcf88-415x250-IndiaHerald.jpg2019లో మంత్రి పదవి వచ్చిన తర్వాత మంత్రి కొడాలి నాని చేసే విమర్శల విషయంలో కొంత మంది వైసీపీలోకి కూడా అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారని తెలుగుదేశం పార్టీ నాయకులు పదే పదే ప్రచారం చేస్తూ ఉంటారు. ఇది ఎంతవరకు నిజం ఏంటనేది తెలియక పోయినా సరే మంత్రి కొడాలి నాని వ్యాఖ్యల విషయంలో చాలా వరకు వైసిపి కార్యకర్తలు ఆగ్రహంతో ఉన్నారని అనవసరంగా చంద్రబాబు నాయుడు ని వ్యక్తిగతంగా విమర్శించడం ద్వారా పార్టీ ప్రజల్లో చులకన అవకాశం ఉంటుందని చాలా మంది వైసీపీ కార్యకర్తలు ఆవేదన వ్యక్తం చేస్తున్నట్లు కూడా తెలుగుదేశం పార్టీ ప్రచారంkodali nani{#}paritala ravindra;Ananthapuram;Kollu Ravindra;Nani;Kodali Nani;Nijam;CBN;YCP;Government;Telugu Desam Party;media;Minister;Partyకొడాలి నాని ఆ కామెంట్స్ తో ఇబ్బంది పడతారా...?కొడాలి నాని ఆ కామెంట్స్ తో ఇబ్బంది పడతారా...?kodali nani{#}paritala ravindra;Ananthapuram;Kollu Ravindra;Nani;Kodali Nani;Nijam;CBN;YCP;Government;Telugu Desam Party;media;Minister;PartyThu, 25 Nov 2021 19:00:00 GMT2019లో మంత్రి పదవి వచ్చిన తర్వాత మంత్రి కొడాలి నాని చేసే విమర్శల విషయంలో కొంత మంది వైసీపీలోకి కూడా అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారని తెలుగుదేశం పార్టీ నాయకులు పదే పదే ప్రచారం చేస్తూ ఉంటారు. ఇది ఎంతవరకు నిజం ఏంటనేది తెలియక పోయినా సరే మంత్రి కొడాలి నాని వ్యాఖ్యల విషయంలో చాలా వరకు వైసిపి కార్యకర్తలు ఆగ్రహంతో ఉన్నారని అనవసరంగా చంద్రబాబు నాయుడు ని వ్యక్తిగతంగా విమర్శించడం ద్వారా పార్టీ ప్రజల్లో చులకన అవకాశం ఉంటుందని చాలా మంది వైసీపీ కార్యకర్తలు ఆవేదన వ్యక్తం చేస్తున్నట్లు కూడా తెలుగుదేశం పార్టీ ప్రచారం చేస్తూ ఉంటుంది.

తెలుగుదేశం పార్టీలో ఉన్న కొంతమంది కీలక నాయకులను టార్గెట్ చేసే విషయంలో కొడాలి నాని ఉపయోగించే భాష పై చాలా వరకు కూడా తెలుగుదేశం పార్టీ అభ్యంతరాలు వ్యక్తం చేస్తూ వచ్చింది. ఇక తాజాగా ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో మంత్రి కొడాలి నాని పరిటాల రవీంద్ర గురించి చేసిన వ్యాఖ్యల విషయంలో తెలుగుదేశం పార్టీ నాయకులతోపాటు గా వైసీపీలో ఉన్న కొంతమంది కూడా ఆగ్రహంగా ఉన్నారని కామెంట్స్ వినబడుతున్నాయి.

ప్రధానంగా అనంతపురం జిల్లాలో ఉన్న కొంతమంది పరిటాల అభిమానులు కొడాలి నాని వ్యాఖ్యలతో సీరియస్ గా ఉన్నారని అనవసరంగా కొడాలి నాని కొరివితో తలగొక్కున్నారు అని అంటున్నారు. రాజకీయంగా కొన్ని కొన్ని సున్నిత అంశాల్లో జోక్యం చేసుకోకుండా ఉండాల్సిన తరుణంలో కొడాలి నాని చేసిన వ్యాఖ్యల పట్ల ఇప్పుడు ఏ విధంగా స్పందిస్తారు ఏంటనేది చూడాలి. ఇక కొడాలి నాని వ్యాఖ్యలు చేసిన తర్వాత రాష్ట్ర ప్రభుత్వం ఆయనకు భారీగా భద్రత పెంచడం కాన్వాయ్ లో ఓ వాహనాన్ని కేటాయించటం పట్ల భిన్నాభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. మరి భవిష్యత్తులో కొడాలి నాని ఇదేవిధంగా మాట్లాడతారా అనవసరంగా లేనిపోని సమస్యలు తెచ్చుకుంటారా అనేది చూడాలి.



రామ్ చరణ్ ఆ కన్ఫ్యూజన్ లో ఉన్నాడట!!

కొడాలి నాని ఆ కామెంట్స్ తో ఇబ్బంది పడతారా...?

టమాటాపై కీలక నిర్ణయం తీసుకున్న స్టాలిన్..!

తెలంగాణ తోవ : తెర వెనుక తతంగంలో హీరో ఎవరు?

ఈ చిత్రాలు మ్యూజికల్ గా హిట్... కానీ

పెన్సిల్ పోయిందని పోలీస్ స్టేష‌న్‌లో విద్యార్థుల ఫిర్యాదు

భర్తకు విడాకులు.. కుక్కతో పెళ్లి.. చివరికి?

రేవంత్ కు నమ్మకస్తులు లేరా...?

త్వ‌ర‌లో వైద్య‌రంగంలో పోస్టులు భ‌ర్తీ : సీఎం జ‌గ‌న్



సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - Gullapally Rajesh]]>