PoliticsChandrasekhar Reddyeditor@indiaherald.comhttps://www.indiaherald.com/ImageStore/images/politics/politics_latestnews/democracyinindia-12e0d7da-3dea-4758-9ba9-c19c296cd680-415x250-IndiaHerald.jpghttps://www.indiaherald.com/ImageStore/images/politics/politics_latestnews/democracyinindia-12e0d7da-3dea-4758-9ba9-c19c296cd680-415x250-IndiaHerald.jpgప్రపంచం పోకడ మారుతుంది. గతంలో హిట్లర్ మాదిరి ఇప్పుడు కూడా అధికారం కోసమే బ్రతుకుతున్న వారి సంఖ్య రానురాను పెరిగిపోతుంది. వీటన్నిటికీ తోడుగా ఉండనే ఉన్నాయి రాజకీయాలు. కేవలం అధికారం కోసమే తప్ప కనీస విలువలు కూడా పాటించలేని స్థితిలో నేడు అనేక దేశాలలో రాజకీయాలు ఉంటున్నాయి. ఇక అతిపెద్ద ప్రజాస్వామ్యం అని ప్రపంచం ముందు గొప్పలకు పోతున్న భారత్ లో కూడా అధికారం కోసం దేశాన్ని అమ్ముకునే వాళ్ళు నాడు బ్రిటిష్ కాలంలోనే కాదు, ఇప్పటికి ఉన్నారు అని చెప్పక తప్పడం లేదు. వీళ్లు కేవలం అధికారం కోసం తప్ప మరో ప్రయోజనం కోసం democracyinindia;{#}Thief;Donga;Okkadu;Bharateeyudu;Population;Service;India;politicsభారత్ : పేరుకే పెద్ద ప్రజాస్వామ్య వ్యవస్థ..!భారత్ : పేరుకే పెద్ద ప్రజాస్వామ్య వ్యవస్థ..!democracyinindia;{#}Thief;Donga;Okkadu;Bharateeyudu;Population;Service;India;politicsThu, 25 Nov 2021 15:56:33 GMTప్రపంచం పోకడ మారుతుంది. గతంలో హిట్లర్ మాదిరి ఇప్పుడు కూడా అధికారం కోసమే బ్రతుకుతున్న వారి సంఖ్య రానురాను పెరిగిపోతుంది. వీటన్నిటికీ తోడుగా ఉండనే ఉన్నాయి రాజకీయాలు. కేవలం అధికారం కోసమే తప్ప కనీస విలువలు కూడా పాటించలేని స్థితిలో నేడు అనేక దేశాలలో రాజకీయాలు ఉంటున్నాయి. ఇక అతిపెద్ద ప్రజాస్వామ్యం అని ప్రపంచం ముందు గొప్పలకు పోతున్న భారత్ లో కూడా అధికారం కోసం దేశాన్ని అమ్ముకునే వాళ్ళు నాడు బ్రిటిష్ కాలంలోనే కాదు, ఇప్పటికి ఉన్నారు అని చెప్పక తప్పడం లేదు. వీళ్లు కేవలం అధికారం కోసం తప్ప మరో ప్రయోజనం కోసం పనిచేయబోవడం లేదు. అదొక్కటి దక్కించుకోవడానికి దేశం అనే కనీస భక్తి కూడా లేకుండా దిగజారుడు రాజకీయాలు చేస్తున్నారు.

ఎంత శాంతమూర్తికైనా శత్రువు తప్పదన్నట్టుగా, దేశంలో ఇలాంటి విలువలు లేని వారి వలన భారత్ లాంటి దేశాలకు కూడా శత్రువులు పుట్టుకొస్తున్నారు. ఎంత తగ్గి జీవిస్తున్నప్పటికీ ఇంకా దేశద్రోహులను అడ్డుపెట్టుకొని కొన్ని వర్గాలు దేశంపై విరుచుకుపడుతూనే ఉన్నాయి. ప్రజాస్వామ్యం అంటే ప్రజల కు అంతిమ అధికారం ఉన్నదనే విషయం గుర్తుకు వస్తుంది. ఆ అధికారం ఎవరికి ఇవ్వాలి అనే దానిపై పౌరులు కూడా దృష్టి పెట్టలేనట్టుగా దేశద్రోహుల వ్యూహాలు ఉంటున్నాయి. ఎంతసేపు వీళ్ళ రాజకీయాలు తప్ప రేపటికి దేశం ఏమైపోతుంది, తరువాత తరాలు ఎంత కష్టపడాల్సి వస్తుంది అనే ఆలోచన వాళ్ళు చేయబోవడం లేదు. ఇలాంటి వాళ్ళందరిని తప్పించుకొని ఒక్కడు ప్రజాస్వామ్య విలువలతో ఉండటానికి ప్రయత్నిస్తున్నా అది కుదరటం లేదు.

ఇలా పేరుకు తప్ప అతిపెద్ద ప్రజాస్వామ్యంలో ప్రజలను పట్టించుకునే రాజకీయాలు ఎప్పుడో కనుమరుగయ్యాయి. కేవలం అధికారం కోసమే నేడు రాజకీయాలు తప్ప, ప్రజా సేవ కోసం కాదు అనేది స్పష్టం అవుతుంది. ఎక్కడో ఉన్న కొద్ది మంది నిజాయితీపరుల వంతు అసలు రాకముందే వాళ్ళు అధికారం కోల్పోతున్నారు. ఇలా ప్రజాస్వామ్యంలో అధికారం కోసం రాజకీయ వ్యూహాల మధ్య దేశం నలిగిపోతుంది. అందుకేనేమో బహుశా ఇన్నేళ్ళైనా అభివృద్ధి చెందుతూనే ఉంది. జనాభా ఉన్నప్పటికీ దేశాన్ని అభివృద్ధి చేయడానికి సరైన నాయకత్వం ఉంటె దశాబ్దం చాలనుకుంటాను. ఇందులో ప్రజల పాత్ర కూడా ఉండాలి, వాళ్ళు కూడా స్తబ్దుగా ఉండటం సమంజసం కాదు. ప్రజాస్వామ్యం అర్ధం తెలిసిన ఏ భారతీయుడు కూడా స్తబ్దుగా ఉండలేడు. ప్రజాస్వామ్యానికి వెన్నుముక ప్రజలే, వాళ్ళు నిరాశపడిపోతే దేశం కూడా నీరుగారిపోతుంది. అప్పుడే ఇలాంటి దొంగ నేతలు పుట్టుకొస్తారు.



సినిమా టికెట్ల విషయంపై..అక్కినేని సుప్రియ షాకింగ్ కామెంట్స్..!

త్వ‌ర‌లో వైద్య‌రంగంలో పోస్టులు భ‌ర్తీ : సీఎం జ‌గ‌న్

రేవంత్ ప్లాన్ ఎందుకు వర్కౌట్ అవ్వలేదు...?

రేపు వైసీపీ లోక్‌సభ, రాజ్యసభ ఎంపీలతో సీఎం జ‌గ‌న్‌ భేటీ

బాలాకోట్ పై.. ఇంకా సందేహాలేనా..!

సంగీత ప్రపంచంలో దూసుకుపోతున్న మిక్కీ జే మేయర్

తైవాన్ పై.. చైనా వ్యూహం..!

జూనియర్ ఎన్టీఆర్ చెబితే మేము వినడం ఏమిటి..?

దృశ్యం సీక్వెల్ ఓకే.. F2 సీక్వెల్ ఏం చేస్తుందో!!



సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - Chandrasekhar Reddy]]>