PoliticsNAGARJUNA NAKKAeditor@indiaherald.comhttps://www.indiaherald.com/ImageStore/images/politics/politics_latestnews/there-is-a-huge-reduction-in-the-price-of-tomatoesae5dc7a6-6dec-4d86-8ff1-11c0f823d455-415x250-IndiaHerald.jpghttps://www.indiaherald.com/ImageStore/images/politics/politics_latestnews/there-is-a-huge-reduction-in-the-price-of-tomatoesae5dc7a6-6dec-4d86-8ff1-11c0f823d455-415x250-IndiaHerald.jpgఏపీలో వరదలు బీభత్సం సృష్టిస్తున్నాయి. లక్షలాది ఎకరాల్లో పంట నీట మునిగింది. రైతులు లబోదిబో మంటున్నారు. ఇలాంటి పరిస్థితుల్లో కూరాగాయల ధరలు భగ్గుమంటున్నాయి. ముఖ్యంగా మదనపల్లి మార్కెట్ లో కిలో టమాటా సెంచరీ దాటేసింది. అయితే ఇతర రాష్ట్రాల నుంచి టమాట దిగుబడి రావడంతో రేట్లు కొంతమేర తగ్గాయి. కానీ ఇతర జిల్లాల్లో మాత్రం టమాట ధరలకు రెక్కలొచ్చాయి. There is a huge reduction in the price of tomatoes{#}Maharashtra;Mohammed Rafi;Kurnool;Santosham;mandalam;Ananthapuram;vegetable market;Chittoor;Telangana Chief Minister;CM;Districtఅక్కడ భారీగా తగ్గిన టమాట ధర..!అక్కడ భారీగా తగ్గిన టమాట ధర..!There is a huge reduction in the price of tomatoes{#}Maharashtra;Mohammed Rafi;Kurnool;Santosham;mandalam;Ananthapuram;vegetable market;Chittoor;Telangana Chief Minister;CM;DistrictThu, 25 Nov 2021 18:33:38 GMTఏపీలోని కొన్ని జిల్లాల్లో వర్షాలు, వరదలకు కూరగాయల ధరలకు రెక్కలొచ్చాయి. ముఖ్యంగా చిత్తూరులోని మదనపల్లి, అనంతపురం జిల్లాల్లో టమాట పంట పూర్తిగా దెబ్బతింది. పంటలు నీట మునగడంతో పాటు.. దిగుబడి పడిపోవడంతో టమాట ధర భారీగా పెరిగింది. ఏపీలో వరదల ప్రభావం తెలంగాణలోని టమాట ధరపైనా పడింది. పలు జిల్లాల్లో కిలో టమాట ధర 100రూపాయల కంటే ఎక్కువగా ఉంది. ఉల్లిపాయ, సొరకాయ, బెండకాయ లాంటి కూరగాయల ధరలు భారీగా పెరిగాయి.

ఆసియా ఖండంలోనే అతిపెద్ద టమాట మార్కెట్ అయిన చిత్తూరు జిల్లా మదనపల్లెలో టమాట రేట్లు భారీగా తగ్గాయి. ఈ రోజు 10కేజీల టమాట ధర 450రూపాయల వరకు పలికింది. అంటే కేజీకి దాదాపు 50రూపాయలుగా ఉంది. మధ్యప్రదేశ్, మహారాష్ట్ర లాంటి రాష్ట్రాల నుంచి టమాట దిగుమతులు పెరగడంతో రేట్లు పెరిగిపోయాయని మార్కెట్ వర్గాలు తెలిపాయి. రానున్న రోజుల్లో మరింత తగ్గుతాయని చెప్పారు. అయితే గత 15రోజులుగా కేజీ టమాట 100రూపాయలకు పైగా పలికింది.

మరోవైవు ఊహకందని విధంగా పెరిగిన టమాట ధరల నియంత్రణకు కర్నూలు ప్రభుత్వం చర్యలు చేపట్టింది. రాష్ట్రంలో సహకార శాఖ పరిధిలోని దుకాణాల్లో కేజీ టమాట 76రూపాయలకే అమ్మాలని ముఖ్యమంత్రి స్టాలిన్ ఆదేశాలు జారీ చేశారు. సీఎం ఆదేశాలతో చెన్నైలో 40, ఇతర ప్రాంతాల్లోని మరో 65దుకాణాల్లో విక్రయాలు సాగుతున్నాయి. అయితే రాష్ట్రంలోని ఇతర మార్కెట్ లో కేజీ టమాట ధర 120 రూపాయల నుంచి 150రూపాయల వరకు పలుకుతోంది.

టామట రేట్లు భారీగా పెరగడంతో ఓ రైతు జాక్ పాట్ కొట్టేశాడు. కర్నూల జిల్లా కోడుమూరు మండలం ప్యాలకుర్తికి చెందిన రైతు మహమ్మద్ రఫీ తన కుటుంబానికి ఉన్న 100ఎకరాలకు గాను 40ఎకరాల్లో టమాట పంట సాగు చేశారు. కేజీ టమాట ధర 100రూపాయల నుంచి 130రూపాయల వరకు పలకడంతో మంచి లాభం వచ్చిందని తెలిపారు. ఇప్పటి వరకు 80లక్షలకు పైగా రాబడి వచ్చినట్టు తెలుస్తోంది. రానన్న రోజుల్లో మరింత ఆదాయం పెరుగుతుందని రఫీ సంతోషం వ్యక్తం చేశారు.



అలా అదరగొడుతున్న గోపిచంద్ హీరోయిన్..!

కొడాలి నాని ఆ కామెంట్స్ తో ఇబ్బంది పడతారా...?

టమాటాపై కీలక నిర్ణయం తీసుకున్న స్టాలిన్..!

తెలంగాణ తోవ : తెర వెనుక తతంగంలో హీరో ఎవరు?

ఈ చిత్రాలు మ్యూజికల్ గా హిట్... కానీ

పెన్సిల్ పోయిందని పోలీస్ స్టేష‌న్‌లో విద్యార్థుల ఫిర్యాదు

భర్తకు విడాకులు.. కుక్కతో పెళ్లి.. చివరికి?

రేవంత్ కు నమ్మకస్తులు లేరా...?

త్వ‌ర‌లో వైద్య‌రంగంలో పోస్టులు భ‌ర్తీ : సీఎం జ‌గ‌న్



సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - NAGARJUNA NAKKA]]>