Politicspraveeneditor@indiaherald.comhttps://www.indiaherald.com/ImageStore/images/politics/politics_latestnews/tamata6acbefde-92b4-4b63-9d43-f6ed1fead93b-415x250-IndiaHerald.jpghttps://www.indiaherald.com/ImageStore/images/politics/politics_latestnews/tamata6acbefde-92b4-4b63-9d43-f6ed1fead93b-415x250-IndiaHerald.jpgమొన్నటి వరకు భారీగా పెరిగిపోయిన ఉల్లి ధరలు సామాన్యులను ఎంతలా బెంబేలెత్తించాయో ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు. భారీగా పెరిగిపోయిన ఉల్లి ధరలు సామాన్యుడికి ఎంతగానో భారంగానే మారిపోయాయి. కొన్ని రోజుల పాటు వంటల్లో ఉల్లి లేకుండానే వండుకోవడం లాంటివి కూడా చేశారు. అంతకంతకూ పెరిగి పోయిన ఉల్లి ధరలు మాత్రం సామాన్యులకు కన్నీళ్ళు తెప్పించాయ్. అయితే ఇక ఇప్పుడు ఉల్లి ధరలు కాస్త తగ్గుముఖం పట్టినప్పటికీ అటు టమాట ధరలు మాత్రం సామాన్యులను కన్నీళ్లు పెట్టిస్తున్నాయి అని చెప్పాలి. ఇక ప్రస్తుతం చూస్తూ చూస్తూండగాTamata{#}Mohammed Rafi;mandalam;Santosham;Petrol;Kurnoolబాబోయ్.. టమాటా పంట వేసి.. ఎన్ని లక్షలు సంపాదించాడో తెలుసా?బాబోయ్.. టమాటా పంట వేసి.. ఎన్ని లక్షలు సంపాదించాడో తెలుసా?Tamata{#}Mohammed Rafi;mandalam;Santosham;Petrol;KurnoolThu, 25 Nov 2021 13:00:00 GMTమొన్నటి వరకు భారీగా పెరిగిపోయిన ఉల్లి ధరలు సామాన్యులను ఎంతలా బెంబేలెత్తించాయో ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు. భారీగా పెరిగిపోయిన ఉల్లి ధరలు సామాన్యుడికి ఎంతగానో భారంగానే మారిపోయాయి.  కొన్ని రోజుల పాటు వంటల్లో ఉల్లి లేకుండానే వండుకోవడం లాంటివి కూడా చేశారు. అంతకంతకూ పెరిగి పోయిన ఉల్లి ధరలు మాత్రం సామాన్యులకు కన్నీళ్ళు తెప్పించాయ్. అయితే ఇక ఇప్పుడు  ఉల్లి ధరలు కాస్త తగ్గుముఖం పట్టినప్పటికీ అటు టమాట ధరలు మాత్రం సామాన్యులను కన్నీళ్లు పెట్టిస్తున్నాయి అని చెప్పాలి.



 ఇక ప్రస్తుతం చూస్తూ చూస్తూండగానే టమాట ధరలు ఒక రేంజిలో పెరిగిపోయాయి. సామాన్యుడికి ప్రస్తుతం టమాటా ధర అందనంత దూరంలో ఉంది అని చెప్పడంలో అతిశయోక్తి లేదు. మొన్నటి వరకు పెట్రోల్ ధరలు సెంచరీ కొట్టగా ఇక ఇప్పుడు టమాట ధరలు కూడా సెంచరీ కొట్టి ఇంకా పరుగులు పెడుతూనే ఉన్నాయి.. భారీ వర్షాల కారణంగా టమాట పంట భారీగా నష్టం వాటిల్లడంతో ప్రస్తుతం మార్కెట్లో టమాటా కొరత ఏర్పడింది. ఈ క్రమంలోనే రోజురోజుకీ డిమాండ్ పెరిగిపోవడం టమాటా కొరత ఏర్పడడంతో టమాట  రేట్లు కూడా భారీగా పెరిగిపోయాయి.


 ప్రస్తుతం కిలో టమాట ధర 100 నుంచి 150 రూపాయల వరకు పలుకుతోంది. దీంతో టమోటా పంట వేసిన రైతులందరికీ కూడా లాభాల పంట పండుతుంది అని చెప్పడంలో అతిశయోక్తి లేదు. అయితే ఇక్కడ టమాటా పంట వేసిన రైతులు ఊహించని విధంగా అదృష్టం వరించింది  అనుకోని విధంగా టమాటా కొరత ఏర్పడటం ఒక్కసారిగా ధరలు పెరిగిపోవడంతో ఆ రైతుకి లాభాల పంట పండింది. కర్నూలు జిల్లా కోడుమూరు మండలం పాలకుర్తి కి చెందిన రైతు మహమ్మద్ రఫీ తన కుటుంబానికి ఉన్న వంద ఎకరాలకు గాను 40 ఎకరాల్లో ఏకంగా టమాటా పంట సాగు చేశాడు. ఇంతలోనే టమాట ధర ఒక్కసారిగా పెరిగి పోయి 150 రూపాయల వరకు టమాట ధర పలుకుతుంది. దీంతో అతనికి ఊహించని లాభాలు వచ్చాయి అంటూ సదరు రైతు తెలిపారు. ఇప్పటివరకు టమాటా పంట ద్వారా 80 లక్షల వరకు సంపాదించినట్లు చెప్పుకొచ్చాడు. రానున్న రోజుల్లో ఆదాయం మరింత పెరిగే అవకాశం ఉంది అంటూ ఆ రైతు సంతోషం వ్యక్తం చేస్తున్నాడు.



టాలీవుడ్ లో కాజల్ క్రేజ్ తగ్గలేదా...?

సింగర్ హరిణి తండ్రి అనుమానస్పద మృతి..!

చంద్రబాబుకి.. ఆ రోజు గుర్తు రాలేదా : రోజా

తెలంగాణ స్పీకర్ పోచారం శ్రీనివాసరెడ్డికి కరోనా..!

కొండపల్లి @ వన్ మెన్ ఆర్మీ..!

ఎన్టీఆర్ పై వర్ల రామయ్య సంచలన వ్యాఖ్యలు

ఆదాయం కోసం జగన్ సర్కార్ కీలక ఉత్తర్వులు....!

కేసీఆర్ పై ష‌ర్మిల సంచ‌ల‌న ట్వీట్‌..!

బాబోరి రేవంత్ : ఏజెంట్ కేసీఆర్?



సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - praveen]]>