MoviesP.Nishanth Kumareditor@indiaherald.comhttps://www.indiaherald.com/ImageStore/images/movies/movies_latestnews/mahesh-babu70d2e1e1-2063-4edd-b3bd-84448fe69063-415x250-IndiaHerald.jpghttps://www.indiaherald.com/ImageStore/images/movies/movies_latestnews/mahesh-babu70d2e1e1-2063-4edd-b3bd-84448fe69063-415x250-IndiaHerald.jpgమాటల మాంత్రికుడు త్రివిక్రమ్ తన తదుపరి సినిమా మహేష్ బాబు తో చేయబోతున్న విషయం తెలిసిందే. మహేష్ కెరీర్లో 28వ సినిమాగా రాబోతున్న ఈ సినిమా ను త్రివిక్రమ్ తనదైన స్టైల్లో తెరకెక్కించబోతున్నాడు. గతంలో వీరిద్దరి కాంబినేషన్ లో అతడు ఖలేజా అనే సినిమాలు చేయగా ఆ సినిమా లు ప్రేక్షకులను విపరీతంగా ఆకట్టుకున్నాయి. బుల్లితెరపై ఈ రెండు సినిమాలు వస్తున్నాయంటే చాలు ఇప్పటికీ టీవీలకు అతుక్కుని మరి ప్రేక్షకులు ఈ చిత్రాన్ని వీక్షిస్తారు.mahesh babu{#}parasuram;Athadu;Nayak;marriage;kalyan;Rajani kanth;trivikram srinivas;Pooja Hegde;News;Samantha;mahesh babu;Heroine;CBN;Audience;Cinemaమహేష్ విషయం లో త్రివిక్రమ్ ఆలోచన కరెక్టేనా!!మహేష్ విషయం లో త్రివిక్రమ్ ఆలోచన కరెక్టేనా!!mahesh babu{#}parasuram;Athadu;Nayak;marriage;kalyan;Rajani kanth;trivikram srinivas;Pooja Hegde;News;Samantha;mahesh babu;Heroine;CBN;Audience;CinemaThu, 25 Nov 2021 22:00:00 GMTమాటల మాంత్రికుడు త్రివిక్రమ్ తన తదుపరి సినిమా మహేష్ బాబు తో చేయబోతున్న విషయం తెలిసిందే. మహేష్ కెరీర్లో 28వ సినిమాగా రాబోతున్న ఈ సినిమా ను త్రివిక్రమ్ తనదైన స్టైల్లో తెరకెక్కించబోతున్నాడు. గతంలో వీరిద్దరి కాంబినేషన్ లో అతడు ఖలేజా అనే సినిమాలు చేయగా ఆ సినిమా లు ప్రేక్షకులను విపరీతంగా ఆకట్టుకున్నాయి. బుల్లితెరపై ఈ రెండు సినిమాలు వస్తున్నాయంటే చాలు ఇప్పటికీ టీవీలకు అతుక్కుని మరి ప్రేక్షకులు ఈ చిత్రాన్ని వీక్షిస్తారు.

ఏదేమైనా మహేష్ బాబుతో త్రివిక్రమ్ సినిమా అనగానే ఈ ఇద్దరి అభిమానులు కూడా ఒక్కసారిగా సంతోషించారు. ఇక పవన్ కళ్యాణ్ సినిమా భీమ్లా నాయక్ కు సంబంధించిన పనుల్లో బిజీగా ఉన్న త్రివిక్రమ్ త్వరలోనే మహేష్ చిత్రానికి సంబంధించిన పనులను మొదలు పెట్టనున్నాడు. మరో వైపు మహేష్ బాబు కూడా పరశురామ్ దర్శకత్వంలోనీ సినిమా పనుల్లో బిజీగా ఉన్నాడు. సంక్రాంతికి ఈ సినిమా విడుదల కాబోతుందని వార్తలు వస్తుండగా ఇంకొందరు ఈ చిత్రాన్ని వేసవి కి షిఫ్ట్ చేశారని చెబుతున్నారు.

ఏదేమైనా ఆ చిత్రాన్ని పూర్తి చేసిన వెంటనే త్రివిక్రమ్ తో చేతులు కలిపబోతున్నాడట మహేష్. ఇటు పవన్ ఇక సినిమాను పూర్తి చేసిన వెంటనే త్రివిక్రమ్ మహేష్ సినిమా షూటింగ్ చేస్తున్నాడు. ఈలోపు ప్రీ ప్రొడక్షన్ పనులు చేయనున్నాడు. ముందుగా హీరోయిన్ ను ఎంపిక చేసే పనిలో పడ్డాడు. ఈ నేపథ్యంలోనే పూజా హెగ్డే ను హీరోయిన్ గా ఎంపిక చేయగా ఆమె డేట్స్ అడ్జస్ట్ కాకపోవడంతో ఈ ఛాన్స్ సమంత కు ఇచ్చినట్లు వార్తలు వినిపిస్తున్నాయి. పెళ్లి తర్వాత పెద్ద సినిమాలకు పూర్తిగా దూరమైన ఈ హీరోయిన్ ను మళ్లీ హీరోయిన్ గా ఎంపిక చేయడం ఎంతవరకు కరెక్ట్ అనేది కొంతమంది సూపర్ స్టార్ అభిమానులకు ప్రశ్న.  గతంలో ఈ హీరోయిన్ తో కలిసి పలు సినిమాలు చేసిన త్రివిక్రమ్ ఆమెను మళ్లీ హీరోయిన్ గా నిలబెట్టే ప్రయత్నం చేస్తున్నట్లు కనిపిస్తోంది. 



జనవరి పోటీకి రెడీ అయిన మరో హీరో..!

కొడాలి నాని ఆ కామెంట్స్ తో ఇబ్బంది పడతారా...?

టమాటాపై కీలక నిర్ణయం తీసుకున్న స్టాలిన్..!

తెలంగాణ తోవ : తెర వెనుక తతంగంలో హీరో ఎవరు?

ఈ చిత్రాలు మ్యూజికల్ గా హిట్... కానీ

పెన్సిల్ పోయిందని పోలీస్ స్టేష‌న్‌లో విద్యార్థుల ఫిర్యాదు

భర్తకు విడాకులు.. కుక్కతో పెళ్లి.. చివరికి?

రేవంత్ కు నమ్మకస్తులు లేరా...?

త్వ‌ర‌లో వైద్య‌రంగంలో పోస్టులు భ‌ర్తీ : సీఎం జ‌గ‌న్



సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - P.Nishanth Kumar]]>