PoliticsM N Amaleswara raoeditor@indiaherald.comhttps://www.indiaherald.com/ImageStore/images/politics/politics_analysis/tdp3ea2f114-d018-4472-bd25-d40131ccef96-415x250-IndiaHerald.jpghttps://www.indiaherald.com/ImageStore/images/politics/politics_analysis/tdp3ea2f114-d018-4472-bd25-d40131ccef96-415x250-IndiaHerald.jpgఏపీలో రాజకీయ పరిణామాలు నిదానంగా మారుతున్నాయి....గత ఎన్నికల్లో వైసీపీ హవా సాగిన నియోజకవర్గాల్లో ఇప్పుడుప్పుడే మార్పు కనిపిస్తోంది. ఇప్పటికే పలు నియోజకవర్గాల్లో టీడీపీకి పట్టు పెరుగుతుంది. అలాగే వైసీపీ ఎమ్మెల్యేలపై కూడా బాగానే పెరుగుతుంది. ఈ క్రమంలోనే కృష్ణా జిల్లాలోని అవనిగడ్డ నియోజకవర్గంలో కూడా రాజకీయం మారుతున్నట్లు తెలుస్తోంది. tdp{#}ghantasala;Avanigadda;Mandali Buddha Prasad;Chakram;Krishna River;Simhadri;Hanu Raghavapudi;Janasena;YCP;CBN;TDP;Jaganదివిసీమలో సీన్ మారింది...సైకిల్‌పై వారసుడు...?దివిసీమలో సీన్ మారింది...సైకిల్‌పై వారసుడు...?tdp{#}ghantasala;Avanigadda;Mandali Buddha Prasad;Chakram;Krishna River;Simhadri;Hanu Raghavapudi;Janasena;YCP;CBN;TDP;JaganWed, 24 Nov 2021 02:30:00 GMTఏపీలో రాజకీయ పరిణామాలు నిదానంగా మారుతున్నాయి....గత ఎన్నికల్లో వైసీపీ హవా సాగిన నియోజకవర్గాల్లో ఇప్పుడుప్పుడే మార్పు కనిపిస్తోంది. ఇప్పటికే పలు నియోజకవర్గాల్లో టీడీపీకి పట్టు పెరుగుతుంది. అలాగే వైసీపీ ఎమ్మెల్యేలపై కూడా బాగానే పెరుగుతుంది. ఈ క్రమంలోనే కృష్ణా జిల్లాలోని అవనిగడ్డ నియోజకవర్గంలో కూడా రాజకీయం మారుతున్నట్లు తెలుస్తోంది.
 
గత ఎన్నికల్లో అవనిగడ్డలో తొలిసారి వైసీపీ జెండా ఎగిరింది...వైసీపీ తరుపున సింహాద్రి రమేష్ బాబు ఎమ్మెల్యేగా గెలిచారు...ఇక ఎన్నికలై రెండున్నర ఏళ్ళు అవుతుంది..ఈ రెండున్నర ఏళ్లలో అవనిగడ్డలో చాలా మార్పులు కనిపిస్తున్నాయి. అభివృద్ధి తక్కువ సమస్యలు ఎక్కువగా ఉన్నాయి...పథకాలు కూడా వైసీపీని సేవ్ చేసే పరిస్తితి కనిపించడం లేదు.

ఇటీవల పరిషత్ ఎన్నికల్లో కొన్ని చోట్ల వైసీపీకి షాక్ తగిలింది. కీలకమైన మోపిదేవి, చల్లపల్లి మండలాల్లో టీడీపీ హవా నడిచింది. అటు ఘంటసాల మండలంలో కూడా టీడీపీ పట్టు సాధిస్తుంది. ఇలా నిదానంగా నియోజకవర్గంలో రాజకీయం మారుతూ వెళుతుంది. నెక్స్ట్ ఎన్నికల్లోపు రాజకీయం ఇంకా మారేలా కనిపిస్తోంది. ఈ సారి టీడీపీ తరుపున మండలి బుద్ధప్రసాద్ వారసుడు వెంకట్రామ్ రంగంలోకి దిగేలా కనిపిస్తున్నారు. అనేక ఏళ్లుగా కాంగ్రెస్‌లో చక్రం తిప్పిన బుద్ధప్రసాద్...2014 ఎన్నికల ముందు టీడీపీలోకి వచ్చి..ఆ ఎన్నికల్లో విజయం సాధించి...అసెంబ్లీ డిప్యూటీ స్పీకర్‌గా పనిచేసిన విషయం తెలిసిందే. ఇక 2019 ఎన్నికల్లో ఈయన జగన్ గాలిలో ఓడిపోయారు. ఈ సారి ఎన్నికల్లో బుద్ధప్రసాద్ బదులు వెంకట్రామ్ బరిలో దిగుతారని ప్రచారం జరుగుతుంది.

అదే సమయంలో వచ్చే ఎన్నికల్లో టీడీపీకి జనసేన సపోర్ట్ చేసే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయని ప్రచారం వస్తుంది. అదే జరిగితే...అవనిగడ్డ బరిలో వైసీపీ గెలుపు చాలా కష్టమవుతుంది. ఎందుకంటే గత ఎన్నికల్లో అవనిగడ్డలో జనసేన బాగానే ఓట్లు తెచ్చుకుంది. ఒకవేళ అప్పుడే టీడీపీతో కలిస్తే వైసీపీ గెలుపు సాధ్యమయ్యేది కాదు...ఈ సారి కూడా అదే పరిస్తితి రిపీట్ అయ్యేలా ఉంది. మొత్తానికైతే దివిసీమలో ఈ సారి పోలిటికల్ సీన్ మారేలా ఉంది.



పశ్చిమలో ఆ ముగ్గురు కమ్మ నేతల లీడ్?

టాలీవుడ్ సీనియర్ హీరోలకు ఏమైంది... ?

కొత్త గ్రహాలను కనుగొన్న నాసా.. ఎన్ని అంటే?

ఈఎస్ఐ స్కాం..! రూ.144 కోట్లు అటాచ్ చేసిన ఈడీ

సీమలో జల విలయం... తక్షణ సాయమేదీ... ?

మరింత తగ్గనున్న చమురు ధరలు...!

ద్రావిడ్ వల్ల టెస్ట్ జట్టు చాలా ప్రయోజనం : పుజారా

సలహాదారులు ఇంత వీక్ గా ఉన్నారా...?

జగన్‌కు సొంత జిల్లా సర్పంచులు షాక్...!



సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - M N Amaleswara rao]]>