MoviesNAGARJUNA NAKKAeditor@indiaherald.comhttps://www.indiaherald.com/ImageStore/images/movies/movies_gossips/top-stars-in-new-route-excitement-in-o-range958cf0ae-8908-4b83-9e8d-6c26ccd57b41-415x250-IndiaHerald.jpghttps://www.indiaherald.com/ImageStore/images/movies/movies_gossips/top-stars-in-new-route-excitement-in-o-range958cf0ae-8908-4b83-9e8d-6c26ccd57b41-415x250-IndiaHerald.jpgకొత్త కాంబినేషన్స్‌లో ఒక ఎగ్జయిట్ మెంట్ ఉంటుంది. ఆ డైరెక్టర్‌ ఈ హీరోని ఎలా ప్రజెంట్‌ చేస్తాడు. ఎలాంటి కథలతో వస్తారు అని ఆడియన్స్‌లో ఒక బజ్‌ క్రియేట్‌ అవుతుంది. ఈ హైప్‌తోనే టాలీవుడ్‌ టాప్‌ స్టార్లు కొత్త కాంబినేషన్స్‌లో సినిమాలు చేస్తున్నారు. అనౌన్స్‌మెంట్‌తోనే బజ్‌ పెంచుతున్నారు. Top stars in New Route Excitement in O Range{#}surender reddy;Vemuri Radhakrishna;Bank;Venu Sreeram;ram pothineni;Indian;Hindi;Success;CBN;Darsakudu;Director;Cinemaన్యూ రూట్ లో టాప్ స్టార్ లు.. ఎగ్జయిట్ మెంట్ ఓ రేంజ్ లో..!న్యూ రూట్ లో టాప్ స్టార్ లు.. ఎగ్జయిట్ మెంట్ ఓ రేంజ్ లో..!Top stars in New Route Excitement in O Range{#}surender reddy;Vemuri Radhakrishna;Bank;Venu Sreeram;ram pothineni;Indian;Hindi;Success;CBN;Darsakudu;Director;CinemaWed, 24 Nov 2021 18:30:00 GMTపవన్ కళ్యాణ్‌ సెకండ్‌ ఇన్నింగ్స్‌లో ఎక్కువగా కొత్త కాంబినేషన్స్‌లోనే సినిమాలు చేస్తున్నాడు. వేణుశ్రీరామ్ దర్శకత్వంలో 'వకీల్‌సాబ్'తో రీఎంట్రీ ఇచ్చిన పవన్, క్రిష్‌తో పీరియాడికల్ డ్రామా చేస్తున్నాడు. మొఘలాయిల కాలం నాటి కథతో 'హరి హర వీర మల్లు' అనే సినిమా చేస్తున్నాడు. సాగర్‌.కె.చంద్ర దర్శకత్వంలో 'భీమ్లానాయక్' చేశాడు. అలాగే సురేందర్ రెడ్డి దర్శకత్వంలో ఒక సినిమాకి కమిట్ అయ్యాడు పవన్.

మహేశ్ బాబు సూపర్‌ హిట్ ఇచ్చిన డైరెక్టర్స్‌తో మళ్లీ మళ్లీ సినిమాలు చేస్తుంటాడు. ఇక ఇప్పుడు తొలిసారి పరశురామ్‌తో ఒక సినిమా చేస్తున్నాడు. బ్యాంక్ స్కామ్స్‌ బ్యాక్‌డ్రాప్‌లో 'సర్కారు వారి పాట' పాడుతున్నాడు మహేశ్. ఇక ఇప్పటికే వచ్చిన 'సర్కారు వారి పాట' టీజర్స్‌కి మంచి రెస్పాన్స్ వచ్చింది. ప్రభాస్‌ పాన్ ఇండియన్‌ హీరోగా మారాక డైరెక్టర్స్‌ని ఎక్కువగా రిపీట్ చేయడం లేదు. కొత్త కాంబినేషన్స్‌తోనే సినిమాలు చేస్తున్నాడు. రాధాకృష్ణ కుమార్ దర్శకత్వంలో 'రాధేశ్యామ్', ప్రశాంత్‌ నీల్‌తో 'సలార్', ఓం రౌత్‌తో 'ఆదిపురుష్' సినిమాలు చేస్తున్నాడు. అలాగే నాగ్‌ అశ్విన్‌ దర్శకత్వంలో 'ప్రాజెక్ట్ కె' అనే సైన్స్ ఫిక్షన్ డ్రామా మొదలుపెట్టాడు.

ఒక్కో డైరెక్టర్‌కి ఒక్కో స్టైల్ ఉంటుంది. అలాగే హీరోలకి ఒక ఇమేజ్ ఉంటుంది. ఇక ఈ ఇమేజ్‌ని మరింత పెంచే దర్శకుడు దొరికితే అభిమానులు పండగ చేసుకుంటారు. టాప్ స్టార్స్‌కి కూడా యూనిక్‌గా ప్రజెంట్‌ చేస్తే మేకర్స్ దొరికితే రీఫ్రెషింగ్‌గా ఫీలవుతుంటారు. అందుకే కొత్త కాంబినేషన్స్‌ని ప్రిఫర్ చేస్తున్నారు టాప్ స్టార్లు. జూ.ఎన్టీఆర్ ఏ డైరెక్టర్‌ ఫామ్‌లో ఉంటే ఆ డైరెక్టర్‌ని ప్రిఫర్‌ చేస్తాడనే టాక్ ఉంది. కొన్నిసార్లు ఇలాంటి సక్సెస్ ఫుల్‌ డైరెక్టర్‌ కాంబోతో బోల్తాకూడా పడ్డాడు. అయితే బాక్సాఫీస్‌ దగ్గర ఎక్కువగా సక్సెస్‌ మంత్రమే పనిచేస్తుంది కాబట్టి, ఇప్పుడు 'కెజిఎఫ్'తో అదరగొట్టిన ప్రశాంత్‌ నీల్‌తో ఒక సినిమాకి సైన్ చేశాడు. రామ్ చరణ్‌ 'ట్రిపుల్ ఆర్'తో పాన్‌ ఇండియన్ హీరో ఇమేజ్ వస్తుందని భారీ హోప్స్ పెట్టుకున్నాడు. అప్పట్లో 'జంజీర్‌'తో హిందీ మార్కెట్‌లో హడావిడి చెయ్యాలనుకున్నా వర్కవుట్‌ కాలేదు. దీంతో 'ట్రిపుల్ ఆర్'పైనే ఆశలు పెట్టుకున్నాడు. ఇక ఈ మూవీతో వచ్చే ఇమేజ్‌ని మరింత పెంచుకోవడానికి శంకర్‌ డైరెక్షన్‌లో ఒక పాన్‌ ఇండియన్ మూవీ మొదలుపెట్టాడు.








32 మంది బీజేపీ కార్పొరేటర్లపై కేసు నమోదు

ఏ ఒక్క రైతుకు అన్యాయం జరగదు: మంత్రి పెద్దిరెడ్డి

జగన్ దెబ్బకు సినిమా ఇండస్ట్రీ విలవిల..!

రాయ‌ల చెరువు వ‌ద్ద చంద్ర‌బాబు ప‌ర్య‌ట‌న

జగన్ నిర్ణయంపై బిజెపి ఓవర్ యాక్షన్ చేస్తుందా...?

ఓసారి మీరే ఆలోచించుకోండి.. చంద్రబాబు కీలక వ్యాఖ్యలు?

ఇక‌పై ఆన్‌లైన్‌లోనే సినిమా టికెట్ల విక్ర‌యం

రెండు కీలక బిల్లులకు అసెంబ్లీ ఆమోదం....!

భారత్ మరో ముందడుగు.. తైవాన్ తో కలిసి?



సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - NAGARJUNA NAKKA]]>