PoliticsM N Amaleswara raoeditor@indiaherald.comhttps://www.indiaherald.com/ImageStore/images/politics/politics_analysis/tdpa23545ae-fab8-49af-8167-b9dbafc40bc7-415x250-IndiaHerald.jpghttps://www.indiaherald.com/ImageStore/images/politics/politics_analysis/tdpa23545ae-fab8-49af-8167-b9dbafc40bc7-415x250-IndiaHerald.jpgఏపీలో రాజకీయ సమీకరణాలు మారుతున్నాయి.. అధికార వైసీపీకి బలం ఉన్నా సరే అందుకు తగ్గట్టుగానే టీడీపీ కూడా పుంజుకున్నట్లు కనిపిస్తోంది. కొన్ని నియోజకవర్గాల్లో అనూహ్య మార్పులు చోటు చేసుకుంటున్నాయి. టీడీపీకి కాస్త అనుకూల వాతావరణం వస్తుంది. అయితే ఇలా పలుచోట్ల టీడీపీకి పాజిటివ్ ఉంది. కాకపోతే నాయకులే పాజిటివ్‌గా లేరు. టీడీపీకి ఏవైతే అనుకూలంగా ఉన్నాయో ఆ ప్రాంతాల్లో..ఆ పార్టీకి సరైన నాయకత్వం లేకపోవడం పెద్ద మైనస్ అవుతుంది. tdp{#}Guntur;Hanu Raghavapudi;MP;Bapatla;Parliment;Party;YCP;CBN;TDPగెలిచే సీట్లని లైట్ తీసుకున్న టీడీపీ...?గెలిచే సీట్లని లైట్ తీసుకున్న టీడీపీ...?tdp{#}Guntur;Hanu Raghavapudi;MP;Bapatla;Parliment;Party;YCP;CBN;TDPTue, 23 Nov 2021 01:00:00 GMTఏపీలో రాజకీయ సమీకరణాలు మారుతున్నాయి.. అధికార వైసీపీకి బలం ఉన్నా సరే అందుకు తగ్గట్టుగానే టీడీపీ కూడా పుంజుకున్నట్లు కనిపిస్తోంది. కొన్ని నియోజకవర్గాల్లో అనూహ్య మార్పులు చోటు చేసుకుంటున్నాయి. టీడీపీకి కాస్త అనుకూల వాతావరణం వస్తుంది. అయితే ఇలా పలుచోట్ల టీడీపీకి పాజిటివ్ ఉంది. కాకపోతే నాయకులే పాజిటివ్‌గా లేరు. టీడీపీకి ఏవైతే అనుకూలంగా ఉన్నాయో ఆ ప్రాంతాల్లో..ఆ పార్టీకి సరైన నాయకత్వం లేకపోవడం పెద్ద మైనస్ అవుతుంది.

పలు చోట్ల పార్టీ తరుపున  పనిచేసే నాయకులు అడ్రెస్ లేరు.  మరి కొన్ని చోట్ల నాయకులని పెట్టాల్సిన అవసరముంది. కానీ చంద్రబాబు ఈ అంశాలపై పెద్దగా ఫోకస్ చేస్తున్నట్లు కనిపించడం లేదు. ముఖ్యంగా కొన్ని పార్లమెంట్ సీట్లని గాలికొదిలేశారు. గెలిచే సీట్లని కూడా పట్టించుకోవడం లేదు. అసలు గుంటూరు జిల్లాలోని బాపట్ల పార్లమెంట్ స్థానం టీడీపీకి చాలా అనుకూలంగా ఉంది.

అక్కడ వైసీపీపై వ్యతిరేకత పెరుగుతుందని పలు సర్వేలు చెబుతున్నాయి. గత ఎన్నికల్లోనే ఈ సీటుని వైసీపీ చాలా తక్కువ మెజారిటీతో గెలిచింది. ఇప్పుడు ఇంకా వ్యతిరేకత పెరగడంతో బాపట్లలో వైసీపీకి అంత అనుకూలమైన వాతావరణం లేదు. ఇక్కడ టీడీపీకి పాజిటివ్ ఉంది..కానీ నాయకుడు మాత్రం లేడు. మాజీ ఎంపీ మాల్యాద్రి ఏమైపోయారో ఎవరికి తెలియదు. 2014 ఎన్నికల్లో ఈయనే టీడీపీ తరుపున ఎంపీగా గెలిచారు. 2019 ఎన్నికల్లో ఈయనే నిలబడి ఓడిపోయారు.

అసలు ఈయనకు సీటు ఇవ్వొద్దని బాపట్ల టీడీపీ శ్రేణులు కోరాయి. అయినా సరే బాబు, ఆయనకు సీటు ఇచ్చారు. కానీ జనంలో వ్యతిరేకత ఉండటంతో మాల్యాద్రి ఓడిపోయారు. ఓడిపోయాక అడ్రెస్ లేకుండా వెళ్ళిపోయారు. ఇప్పుడు మంచి అవకాశం ఉన్నా సరే...పార్లమెంట్ స్థానానికి వచ్చి పనిచేయడం లేదు. అటు ఒంగోలు పార్లమెంట్ స్థానంలో టీడీపీకి పాజిటివ్ ఉంది. కానీ అక్కడ పార్టీకి నాయకుడే లేడు. అంటే గెలిచే అవకాశాలు ఉన్న సీట్లలో టీడీపీ బాగా లైట్ తీసుకుంటున్నట్లు కనిపిస్తోంది.



గెలిచే సీట్లని లైట్ తీసుకున్న టీడీపీ...?

మెగాస్టార్ స్కోర్ ఎంత అంటే... ?

కేతువు ఎఫెక్ట్ పడొద్దు అంటే...

జగన్ 2.0: రివర్స్ గేర్ కారణాలు ఆ మూడే...!

ప్రకటన కాదు... చర్చించాల్సిందే...!

మెగా హీరోలకు తలనొప్పిగా మారిన వరుణ్ తేజ్!!

జగన్ 2.0 : కాంపర్ మైజ్ కాదు... జస్ట్ అడ్జస్ట్ మెంట్ అంతే

డైలమాలో ఏపీ ప్రజలు... ఏ పార్టీకి పట్టం కడతారో?

జగన్ 2.0: హైకోర్టు దూకుడు... ప్రభుత్వానికి బ్రేకులు....!



సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - M N Amaleswara rao]]>