MoviesSeetha Sailajaeditor@indiaherald.comhttps://www.indiaherald.com/ImageStore/undefinedhttps://www.indiaherald.com/ImageStore/undefinedఅల్లు అర్జున్ సుకుమార్ కాంబినేషన్ లో రాబోతున్న ‘పుష్ప’ రికార్డులు క్రియేట్ చేస్తుందని బన్ని అభిమానులు ఆశలు పెట్టుకుంటున్నారు. ఈ మూవీలో రష్మిక ‘శ్రీవల్లి’ అనే గిరిజన యువతి పాత్రలో నటిస్తున్న విషయం తెలిసిందే. ఇప్పటికే రష్మిక పాత్రకు సంబంధించిన లుక్ ట్రెండింగ్ గా మారింది.డీ గ్లామర్ పాత్రలో కనిపిస్తున్న రష్మిక లుక్ కు సంబంధించిన ఫోటోలు ట్రెండింగ్ గా మారాయి. ‘శ్రీవల్లి’ అంటూ సాగే పాట సోషల్ మీడియాలో ప్రస్తుతం ట్రెండింగ్ గా మారింది. రష్మిక శ్రీవల్లి పాత్ర లుక్ కోసం చాల ఎక్కువగా శ్రమించడమే కాpushpa{#}anoushka;Makeup;Bunny;Pooja Hegde;Arjun;Samantha;sukumar;Chittoor;Heroine;rashmika mandanna;Cinemaశ్రీవల్లి కష్టాలను బయటపెట్టిన రష్మిక !శ్రీవల్లి కష్టాలను బయటపెట్టిన రష్మిక !pushpa{#}anoushka;Makeup;Bunny;Pooja Hegde;Arjun;Samantha;sukumar;Chittoor;Heroine;rashmika mandanna;CinemaTue, 23 Nov 2021 11:00:00 GMTఅల్లు అర్జున్ సుకుమార్  కాంబినేషన్ లో రాబోతున్న ‘పుష్ప’ రికార్డులు  క్రియేట్ చేస్తుందని బన్ని అభిమానులు ఆశలు పెట్టుకుంటున్నారు.  ఈ మూవీలో రష్మిక ‘శ్రీవల్లి’ అనే  గిరిజన యువతి పాత్రలో  నటిస్తున్న  విషయం తెలిసిందే. ఇప్పటికే రష్మిక పాత్రకు సంబంధించిన లుక్  ట్రెండింగ్ గా మారింది.


డీ గ్లామర్ పాత్రలో కనిపిస్తున్న రష్మిక లుక్ కు సంబంధించిన ఫోటోలు ట్రెండింగ్ గా మారాయి. ‘శ్రీవల్లి’ అంటూ సాగే పాట సోషల్ మీడియాలో ప్రస్తుతం ట్రెండింగ్ గా మారింది. రష్మిక శ్రీవల్లి పాత్ర  లుక్ కోసం చాల ఎక్కువగా శ్రమించడమే కాకుండా గంటల తరబడి ఆమె మేకప్ చేసుకోవలసిన పరిస్థితి ఏర్పడింది. ప్రతిరోజు షూటింగ్ అయిపోయాక మళ్లీ ఆ మేకప్ ను తొలగించుకోవడం కోసం ఎంతో కష్టపడవలసి వచ్చిందట.


లేటెస్ట్ గా రష్మిక  ఇన్ స్టా గ్రామ్ లో తన చేతిని ఫోటో తీసి పోస్ట్ చేసింది. మోచేతి నుంచి మణికట్టు వరకూ బాగా నల్లగా మేకప్ వేసుకుంది. దీనితో రష్మిక కెరీర్ లో ఈ పాత్ర ఛాలెంజింగ్ గా మిగిలిపోతుందని అంటున్నారు. ‘బాహుబలి’ లోని దేవసేన పాత్ర అనుష్క కు ‘రంగస్థలం’ లోని రామలక్ష్మి పాత్ర సమంత కు అవార్డులు తెచ్చిపెట్టిన విధంగా శ్రీవల్లి పాత్ర రష్మిక కు అవార్డులు తెచ్చిపెట్టడం ఖాయం అని అంటున్నారు.


ఈమూవీలో చిత్తూరు యాసలో రష్మిక డైలాగ్స్ చెప్పుకోవలసిన పరిస్థితులలో ఆ యాసను నేర్చుకోవడానికి ఈమె రోజుకు రెండు గంటలు కష్టపడింది అంటే సుకుమార్ సినిమాలలో నటించడం ఎంత కష్టమో అర్థం అవుతుంది. అనుకున్న విధంగా ఈమూవీ సక్సస్ అయితే జాతీయ స్థాయిలో రష్మిక ఇమేజ్ ఒక వెలుగు వెలగడం ఖాయం అంటున్నారు. ఇప్పటికే పూజా హెగ్డే కు గట్టి పోటీ ఇస్తున్న రష్మిక ఈమూవీ తరువాత టాప్ హీరోయిన్ గా దక్షిణాది సినిమా రంగాన్ని శాసించే అవకాశం ఉండటంతో పూజా రష్మికల మధ్య పోటీ ఆశక్తిదాయకంగా మారింది..  





ఢిల్లీ కాలుష్యం.. పాకిస్తాన్ హస్తం ఉందా..!

పోరాటానికి సిద్ధమైన కార్మిక సంఘాలు.. ప్రణాళిక ఇదేనా..!

తాలిబ‌న్ మాట : టీవీల్లో అవి చూపించ‌రాద‌ట‌..!

నాగ చైతన్య ఆస్తి విలువ అన్ని కోట్లా..?

అనుభవించు రాజా.. కరోనా తర్వాత మారిన సీన్ ?

జనంలోకి బాబు.. జగన్.. జర జాగ్రత్త..?

జగన్ 2.O: పవన్ ని గురిచూసి దెబ్బకొట్టిన సీఎం

జగన్ 2.0: సలహాదారులు ఏమయ్యారో...!

మెగాస్టార్ స్కోర్ ఎంత అంటే... ?



సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - Seetha Sailaja]]>