PoliticsVUYYURU SUBHASHeditor@indiaherald.comhttps://www.indiaherald.com/ImageStore/images/politics/politics_latestnews/jagan2f16c778-c406-4aa7-be51-8fdccf6760f9-415x250-IndiaHerald.jpghttps://www.indiaherald.com/ImageStore/images/politics/politics_latestnews/jagan2f16c778-c406-4aa7-be51-8fdccf6760f9-415x250-IndiaHerald.jpgఏపీ సీఎం .. వైసీపీ అధినేత జ‌గ‌న్ తీసుకున్న నిర్ణ‌యం .. రాష్ట్ర రాజ‌కీయాల్లో పెను సంచ‌ల‌నం రేపుతోంది.. వాస్తవానికి.. మూడు రాజ‌ధానుల బిల్లును వెన‌క్కి తీసుకుంటున్న‌ట్టు ప్ర‌భుత్వ వ‌ర్గాల నుంచి నిర్ణ‌యం వెలువ‌డిన త‌ర్వాత‌.. త‌మ డిమాండ్లు నెగ్గాయ‌ని.. జ‌గ‌న్ వెన‌క్కి మ‌ళ్లార‌ని.. ఓ వ‌ర్గం నాయ‌కులు ప్రచారం చేసుకున్నారు. అయితే.. అనూహ్యంగా తాను వెన‌క్కి త‌గ్గ‌డం లేద‌ని.. మ‌ళ్లీ ప్ర‌జ‌ల్లోకే వెళ్తున్నాన‌ని.. అసెంబ్లీ సాక్షిగా సీఎం జ‌గ‌న్ ప్ర‌క‌టించారు. మూడు రాజ‌ధానుల బిల్లును ప్ర‌స్తుతానికి వెన‌క్కి తీJagan mohan reddy{#}Assembly;CM;YCP;Ministerజ‌గ‌న్ నిర్ణ‌యంతో రాజ‌కీయాల్లో పెను అల‌జ‌డి.. రీజ‌నిదేనా?జ‌గ‌న్ నిర్ణ‌యంతో రాజ‌కీయాల్లో పెను అల‌జ‌డి.. రీజ‌నిదేనా?Jagan mohan reddy{#}Assembly;CM;YCP;MinisterTue, 23 Nov 2021 14:25:00 GMTఏపీ సీఎం .. వైసీపీ అధినేత జ‌గ‌న్ తీసుకున్న నిర్ణ‌యం .. రాష్ట్ర రాజ‌కీయాల్లో పెను సంచ‌ల‌నం రేపుతోంది.. వాస్తవానికి.. మూడు రాజ‌ధానుల బిల్లును వెన‌క్కి తీసుకుంటున్న‌ట్టు ప్ర‌భుత్వ వ‌ర్గాల నుంచి నిర్ణ‌యం వెలువ‌డిన త‌ర్వాత‌.. త‌మ డిమాండ్లు నెగ్గాయ‌ని.. జ‌గ‌న్ వెన‌క్కి మ‌ళ్లార‌ని..  ఓ వ‌ర్గం నాయ‌కులు ప్రచారం చేసుకున్నారు. అయితే.. అనూహ్యంగా తాను వెన‌క్కి త‌గ్గ‌డం లేద‌ని.. మ‌ళ్లీ ప్ర‌జ‌ల్లోకే వెళ్తున్నాన‌ని.. అసెంబ్లీ సాక్షిగా సీఎం జ‌గ‌న్ ప్ర‌క‌టించారు. మూడు రాజ‌ధానుల బిల్లును ప్ర‌స్తుతానికి వెన‌క్కి తీసుకుంటున్నామ‌ని.. అయితే.. స‌మ‌గ్ర‌మైన బిల్లును త్వ‌ర‌లోనే ప్ర‌వేశ పెడ‌తామ‌ని జ‌గ‌న్ ప్ర‌క‌టించారు.

అంతేకాదు.. ప్ర‌స్తుతం మూడు రాజ‌ధానులకు సంబంధించి తాము రూపొందించిన బిల్లులో కొన్ని టెక్నిక‌ల్ స‌మ‌స్య‌లు వ‌చ్చాయ‌ని ఆయ‌న అంగీక‌రించారు. ఈ నేప‌థ్యంలో నూత‌న బిల్లుల‌ను స‌మ‌గ్రంగా రూపొంది స్తామ‌న్నారు. అయితే.. అదేస‌మ‌యంలో ప్ర‌జ‌ల అభిప్రాయాలు తీసుకుంటామ‌ని చెప్పారు. వాస్త‌వానికి తాము వికేంద్రీక‌ర‌ణ బిల్లుల‌ను రూపొందించే క్ర‌మంలో అన్ని వ‌ర్గాల నుంచి స‌మాచారం సేక‌రించామ‌ని.. క‌మిటీ కూడా వేసి అధ్య‌య‌నం చేశామ‌ని.. మంత్రి వ‌ర్గ ఉప‌సంఘం కూడా దీనిపై స‌మీక్షించి నిర్ణ‌యం తీసుకున్న త‌ర్వాతే.. మూడుకు జై కొట్టి.. ప్ర‌క‌ట‌న చేశామ‌ని.. వివ‌రించారు.

అయిన‌ప్ప‌టికీ.  కొన్ని పార్టీలు ప్ర‌జ‌ల్లో విషయాన్ని ప‌క్క‌దారి ప‌ట్టించేలా వ్య‌వ‌హ‌రించాయ‌ని సీఎం జ‌గ‌న్ చెప్పారు. ఈ నేప‌థ్యంలో నూత‌నంగా రూపొందించే బిల్లుల విష‌యంలో ఖ‌చ్చితంగా ప్ర‌జ‌ల అబిప్రాయాన్ని మ‌రోసారి తీసుకుంటామ‌న్నారు. ఇప్పుడు ఈ ప్ర‌క‌ట‌న‌లే.. రాజకీయ వ‌ర్గాల్లోసంచ‌ల‌నం రేపుతున్నాయి. ఎందుకంటే.. ప్ర‌స్తుతం జ‌రిగిన అన్ని ఎన్నిక‌ల్లోనూ ప్ర‌జ‌లు వైసీపీవైపే ఉన్నారు. ఈ నేప‌థ్యంలో వైసీపీ తీసుకునే నిర్ణ‌యాల‌కు వారు ఖ‌చ్చితంగా జై కొడ‌తార‌ని.. తాము చెబుతున్న‌ది ప్ర‌జ‌లు వినిపించుకునే ప‌రిస్థితి లేద‌ని ఆయా పార్టీలు అంచ‌నా వేస్తున్నాయి.

ఎందుకంటే.. మీ ప్రాంతాన్ని అభివృద్ది చేయ‌డానికే మేంనిర్ణ‌యం తీసుకున్నామ‌ని వైసీపీ నేత‌లు చెబితే.. ఎవ‌రు మాత్రం కాదంటారు. అదేస‌మ‌యంలో వ‌ద్ద‌ని పార్టీలు చెబితే.. ఎవ‌రు వింటారు?  ఇదే ఇప్పుడు రాజకీయ పార్టీల‌కు సంక‌టంగా మారింది. జ‌గ‌న్ మ‌ళ్లీ త‌మ‌ను అడ్డంగా బుక్ చేశారే! అనే వాద‌న ఆయా పార్టీల్లో వినిపిస్తుండ‌డం గ‌మ‌నార్హం.



కులాలవారీగా బీసీ జనగణన.. ఏపీ అసెంబ్లీలో తీర్మాణం

తెరుచుకోనున్న వరాహస్వామి ఆలయం తలపులు

నన్నే కాదు.. అతన్ని కూడా జట్టులోకి తీసుకోరు : అశ్విన్

మూడు రాజ‌ధానుల‌తో ముంద‌స్తు ఎన్నిక‌ల‌కు జ‌గ‌న్ రెఢీ..!

కొండ‌ప‌ల్లి చైర్మ‌న్ ఎన్నిక‌పై హై కోర్టు ఆగ్ర‌హం

జీహెచ్ఎంసీ కార్యాల‌యం వ‌ద్ద బీజేపీ కార్పొరేట‌ర్ల నిర‌స‌న

టీడీపీకి నాని కంటే వంశీయే గట్టి టార్గెట్ అయ్యాడా ?

స్థానిక సంస్థ‌ల ఎమ్మెల్సీ ఎన్నికల బరిలో కాంగ్రెస్‌..!

జ‌గ‌న్ చేసిన పెద్ద త‌ప్పు ఇదేనా..?



సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - VUYYURU SUBHASH]]>