PoliticsPodili Ravindranatheditor@indiaherald.comhttps://www.indiaherald.com/ImageStore/images/politics/politics_latestnews/jagan-expresses-his-opinion-on-visakha-710c9cee-e421-47e7-8bdb-3f96adaa36ac-415x250-IndiaHerald.jpghttps://www.indiaherald.com/ImageStore/images/politics/politics_latestnews/jagan-expresses-his-opinion-on-visakha-710c9cee-e421-47e7-8bdb-3f96adaa36ac-415x250-IndiaHerald.jpgవైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధినేత వైఎస్ జగన్ మోహన్ రెడ్డి ఆలోచన ఏమిటో ప్రస్తుతం ఎవరికీ అర్థం కావటం లేదు. రాష్ట్రంలో అధికారంలోకి వచ్చిన నాటి నుంచి తనదైన శైలిలో దూకుడు నిర్ణయాలతో అందరినీ ఆశ్చర్యానికి గురి చేస్తున్నారు వైఎస్ జగన్. అధికారంలోకి వచ్చిన వెంటనే ఆక్రమణల తొలగింపు పేరుతో కరకట్టపైన చంద్రబాబు ఇంటి సమీపంలో నిర్మించిన ప్రజా వేదికను కూల్చి వేశారు. ఆ తర్వాత ఎన్ని విమర్శలు వచ్చినా కూడా ఏ మాత్రం వెనుకడుగు వేయలేదు. అసెంబ్లీలో ప్రతిపక్షానికి ఊపిరి కూడా ఆడనివ్వలేదు. అనూహ్యంగా టీడీపీకి చెందిన నాలుగు ఎమjagan{#}Dookudu;Guntur;local language;Vishakapatnam;Reddy;Congress;Amaravati;YCP;Rayalaseema;Jagan;CBN;TDP;Telugu Desam Partyజగన్ 2.0: జగన్ ప్లాన్ ఏమిటో మరి...!జగన్ 2.0: జగన్ ప్లాన్ ఏమిటో మరి...!jagan{#}Dookudu;Guntur;local language;Vishakapatnam;Reddy;Congress;Amaravati;YCP;Rayalaseema;Jagan;CBN;TDP;Telugu Desam PartyTue, 23 Nov 2021 07:24:33 GMTవైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధినేత వైఎస్ జగన్ మోహన్ రెడ్డి ఆలోచన ఏమిటో ప్రస్తుతం ఎవరికీ అర్థం కావటం లేదు. రాష్ట్రంలో అధికారంలోకి వచ్చిన నాటి నుంచి తనదైన శైలిలో దూకుడు నిర్ణయాలతో అందరినీ ఆశ్చర్యానికి గురి చేస్తున్నారు వైఎస్ జగన్. అధికారంలోకి వచ్చిన వెంటనే ఆక్రమణల తొలగింపు పేరుతో కరకట్టపైన చంద్రబాబు ఇంటి సమీపంలో నిర్మించిన ప్రజా వేదికను కూల్చి వేశారు. ఆ తర్వాత ఎన్ని విమర్శలు వచ్చినా కూడా ఏ మాత్రం వెనుకడుగు వేయలేదు. అసెంబ్లీలో ప్రతిపక్షానికి ఊపిరి కూడా ఆడనివ్వలేదు. అనూహ్యంగా టీడీపీకి చెందిన నాలుగు ఎమ్మెల్యేలను తమ పార్టీకి మద్దతు ఇచ్చేలా జగన్ పావులు కదిపారు. నేను రెడీ అంటే... టీడీపీ ఖాళీ అవుతుందని ప్రతిపక్ష నేతకు వార్నింగ్ కూడా ఇచ్చారు. ఇక స్థానిక సంస్థల ఎన్నికలకు వెళ్లే ముందు అనూహ్య నిర్ణయం తీసుకున్నారు. రాష్ట్రంలో అధికారంలోకి వచ్చిన తర్వాత ఏడాది కాలంలోనే ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీల్లో దాదాపు 90 శాతం అమలు చేశామని గర్వంగా చెప్పారు.

అదే ఊపుతో అసెంబ్లీలో కీలక ప్రకటన చేశారు. రాష్ట్రంలో అభివృద్ధి వికేంద్రీకరణ జరగాలంటే.. అన్ని ప్రాంతాలు అభివృద్ధి చెందాలన్నారు. అందుకోసం రాష్ట్రానికి మూడు రాజధానులు ఉండాలన్నారు. పరిపాలన రాజధానిగా విశాఖ నగరాన్ని ఎంపిక చేశారు. అసెంబ్లీలో ప్రతిపక్షం లేని సమయంలో మూడు రాజధానుల ఏర్పాటు ప్రకటన చేశారు. ఆ తర్వాత జరిగిన ఎన్నికల్లో అన్ని ప్రాంతాల్లో విజయం సాధించారు. ఇంకా చెప్పాలంటే... తన నిర్ణయం సరైందే అని ప్రజలు తీర్పు ఇచ్చారంటూ గర్వంగా చెప్పుకున్నారు. అమరావతి రాజధాని అంటూ తెలుగుదేశం పార్టీ ఆందోళనలు చేసినా కూడా...  చివరికి విజయవాడ, గుంటూరు కార్పొరేషన్‌లను కూడా వైసీపీ గెలుచుకుంది. అటు ఉత్తరాంధ్ర, ఇటు రాయలసీమ ప్రాంతాల్లో కూడా వైసీపీ జెండా ఎగిరింది. అయితే ఓ వైపు న్యాయస్థానాల్లో కేసుల విచారణ కొనసాగుతున్న సమయంలో... అనూహ్య ప్రకటన చేశారు వైఎస్ జగన్. 3 రాజధానుల ఏర్పాటు బిల్లును ప్రస్తుతానికి రద్దు చేస్తున్నామన్నారు. సమగ్రంగా రూపొందించి  మళ్లీ బిల్లు ప్రవేశపెడతామని ప్రకటించారు. ఈ ప్రకటన చేసిన సమయలో కూడా అసెంబ్లీలో ప్రతిపక్ష తెలుగుదేశం పార్టీ నేతలు సభలో లేరు.



యానీ మాస్టార్ 11 వారాలకు రెమ్యూనరేషన్ తీసుకుందో తెలుసా..??

మెగాస్టార్ స్కోర్ ఎంత అంటే... ?

కేతువు ఎఫెక్ట్ పడొద్దు అంటే...

జగన్ 2.0: రివర్స్ గేర్ కారణాలు ఆ మూడే...!

ప్రకటన కాదు... చర్చించాల్సిందే...!

మెగా హీరోలకు తలనొప్పిగా మారిన వరుణ్ తేజ్!!

జగన్ 2.0 : కాంపర్ మైజ్ కాదు... జస్ట్ అడ్జస్ట్ మెంట్ అంతే

డైలమాలో ఏపీ ప్రజలు... ఏ పార్టీకి పట్టం కడతారో?

జగన్ 2.0: హైకోర్టు దూకుడు... ప్రభుత్వానికి బ్రేకులు....!



సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - Podili Ravindranath]]>