PoliticsChakravarthi Kalyaneditor@indiaherald.comhttps://www.indiaherald.com/ImageStore/images/politics/politics_latestnews/china-missings3bc0991e-91d8-4d87-955a-ca506100ff67-415x250-IndiaHerald.jpghttps://www.indiaherald.com/ImageStore/images/politics/politics_latestnews/china-missings3bc0991e-91d8-4d87-955a-ca506100ff67-415x250-IndiaHerald.jpgచైనా.. ప్రపంచ నెంబర్ వన్ కావాలని ప్రయత్నిస్తున్న దేశం.. చైనా దూకుడు ఇలాగే కొనసాగితే ఆ దేశం ప్రపంచ నెంబర్ వన్ కావడం పెద్ద కష్టం ఏమీ కాదు. కానీ.. ఓ కమ్యూనిస్టు దేశం.. ఇండియా, అమెరికా తరహాలో ప్రజాస్వామ్య దేశం కాదు. అక్కడ ఒకటే పార్టీ.. ఇటీవలే ఆ దేశాధ్యక్షుడు జింగ్ పింగ్.. తనను తాను శాశ్వత అధ్యక్షుడుగా ప్రకటించుకునేందుకు మార్గం సుగమం చేసుకున్నాడు. చైనాలో బలమైన నేతగా ఆవిర్భవించిన జింగ్ పింగ్.. నియంతృత్వ ధోరణితో వెళ్తున్నాడు. ఇదంతా ఒక ఎత్తు అయితే.. చైనాలో ప్రభుత్వానికి వ్యతిరేకంగా మాట్లాడిన ప్రముఖులంchina missings{#}Husband;producer;Producer;American Samoa;Dookudu;mediaచైనాలో కలకలం సృష్టిస్తున్న మిస్సింగ్స్ మిస్టరీ..?చైనాలో కలకలం సృష్టిస్తున్న మిస్సింగ్స్ మిస్టరీ..?china missings{#}Husband;producer;Producer;American Samoa;Dookudu;mediaTue, 23 Nov 2021 10:15:17 GMTచైనా.. ప్రపంచ నెంబర్ వన్ కావాలని ప్రయత్నిస్తున్న దేశం.. చైనా దూకుడు ఇలాగే కొనసాగితే ఆ దేశం ప్రపంచ నెంబర్ వన్ కావడం పెద్ద కష్టం ఏమీ కాదు. కానీ.. ఓ కమ్యూనిస్టు దేశం.. ఇండియా, అమెరికా తరహాలో ప్రజాస్వామ్య దేశం కాదు. అక్కడ ఒకటే పార్టీ.. ఇటీవలే ఆ దేశాధ్యక్షుడు జింగ్ పింగ్.. తనను తాను శాశ్వత అధ్యక్షుడుగా ప్రకటించుకునేందుకు మార్గం సుగమం చేసుకున్నాడు. చైనాలో బలమైన నేతగా ఆవిర్భవించిన జింగ్ పింగ్.. నియంతృత్వ ధోరణితో వెళ్తున్నాడు.


ఇదంతా ఒక ఎత్తు అయితే.. చైనాలో ప్రభుత్వానికి వ్యతిరేకంగా మాట్లాడిన ప్రముఖులంతా మాయం అవుతుండటం ఇప్పుడు కలకలం రేపుతోంది. చైనా ప్రభుత్వానికి వ్యతిరేకంగా మాట్లాడిన వారంతా.. మాయం అవుతున్నారు. అసలు వారి జాడ కనిపించడం లేదు. గత కొద్ది కాలంగా ఇలాంటి ప్రముఖుల మిస్సింగ్‌ మిస్టరీగా మారుతోంది.


కొన్నిరోజుల క్రితం చైనా ప్రభుత్వాన్ని వ్యతిరేకించిన ప్రముఖ ఆన్ లైన్ వ్యాపార దిగ్గజం ఆలీబాబా అధినేత జాక్‌ మా కనిపించకుండాపోయారు. ఆ తర్వాత మరికొందరు వ్యాపారవేత్తలు, కళాకారులు, సినీనటులు, ఉన్నతాధికారులు, మీడియా అధినేతల పరిస్థితీ అలాగే మారింది. తాజాగా ప్రముఖ టెన్నిస్‌ క్రీడాకారిణి పెంగ్‌ షువాయి కూడా కనిపించడం లేదు. ఇంటర్‌పోల్‌కు చీఫ్‌గా ఎన్నికైన చైనాకు చెందిన మెంగ్‌ హాంగ్వే కూడా కొన్నాళ్లుగా కనిపించడం లేదు. ఈయన 2016లో ప్రపంచ వ్యాప్తంగా పోలీసులకు సహకారం అందించే ‘ఇంటర్‌పోల్‌’ విభాగానికి చీఫ్‌ అయ్యారు.


అయితే అంతకుముందు హాంగ్వే చైనా ప్రజాభద్రతా విభాగానికి ఇంఛార్జిగా ఉన్నారు. ఆయన 2018 నుంచి కనిపించడం లేదు. ఇంటర్‌పోల్‌ కు చీఫ్‌గా ఉన్న హాంగ్వే చైనాకు బయలుదేరినట్లు తన కుటుంబ సభ్యులకు చెప్పారు. ఆ తర్వాత నుంచి ఆచూకీ లేదు. ఈ మధ్య మీడియా ముందుకు వచ్చిన గ్రేస్‌ మెంగ్‌ తన భర్త ఆచూకీ ఇప్పటికీ లభించలేదని రోదించారు. కళాకారుడు, చిత్ర నిర్మాత అయ్‌ వీవీ,  ప్రముఖ పాప్‌ సింగర్‌ ఝావో, హాంకాంగ్‌ వేదికగా ప్రచురణలు చేసే గువై మిన్‌హాయ్‌.. ఇలా కొందరు ప్రముఖులు ఏళ్ల తరబడి చైనాలో కనిపించడం లేదు.





టాలీవుడ్ కు కొత్త హీరోయిన్ల ప్రవాహం...!

పోరాటానికి సిద్ధమైన కార్మిక సంఘాలు.. ప్రణాళిక ఇదేనా..!

తాలిబ‌న్ మాట : టీవీల్లో అవి చూపించ‌రాద‌ట‌..!

నాగ చైతన్య ఆస్తి విలువ అన్ని కోట్లా..?

అనుభవించు రాజా.. కరోనా తర్వాత మారిన సీన్ ?

జనంలోకి బాబు.. జగన్.. జర జాగ్రత్త..?

జగన్ 2.O: పవన్ ని గురిచూసి దెబ్బకొట్టిన సీఎం

జగన్ 2.0: సలహాదారులు ఏమయ్యారో...!

మెగాస్టార్ స్కోర్ ఎంత అంటే... ?



సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - Chakravarthi Kalyan]]>