BreakingVennelakanti Sreedhareditor@indiaherald.comhttps://www.indiaherald.com/ImageStore/images/breaking/134/ttdd3c66689-0505-4e57-bf62-6fc6870c7199-415x250-IndiaHerald.jpghttps://www.indiaherald.com/ImageStore/images/breaking/134/ttdd3c66689-0505-4e57-bf62-6fc6870c7199-415x250-IndiaHerald.jpg తిరుమల లోని వరాహ స్వామి ఆలయం దాదాపు రెండు సంవత్సారాల తరువాత తెరుచుకోనుంది. బాలాలయ సంప్రోక్షణ కార్యక్రమం నిమిత్తం ఆలయాన్ని 2020 డిసెంబర్ 6 నుంచి మూసి వేశారు. ఈ నెల 24 నుంచి వరాహ స్వామి వారికి మహాసంప్రోక్షణ జరగ నుంది. ఆ తరువాత భక్తులకు స్వామి వారి దర్శన భాగ్యం లభించ నుంది.ttd{#}gold;2020;Evening;Tirupati;sree;Novemberతెరుచుకోనున్న వరాహస్వామి ఆలయం తలపులుతెరుచుకోనున్న వరాహస్వామి ఆలయం తలపులుttd{#}gold;2020;Evening;Tirupati;sree;NovemberTue, 23 Nov 2021 14:02:49 GMT
తిరుమల కొండ పై తొలి దర్శనం,  తొలి నైవేద్యం అక్కడకొలువై ఉన్న శ్రీ వేంకటేశ్వర స్వామికి ఇవ్వరు. ఆయన కంటే ముందుగా  కోనేరు పక్కన ఉన్న వరాహ స్వామికి నివేదిన చేస్తారు. ఇది తరతరాలుగా సాగుతున్న వైష్ణవ సంప్రదాయం. ఇందుకు సంబంధించి పెద్ద చరిత్రే ఉంది.  అదికాసేపు పక్కన పెడదాం.
డిసెంబర్ 2020  నుంచి వరాహ స్వామివారు భక్తులకు దర్శనం ఇవ్వడం లేదు.  వారాహ స్వామి ఆలయ విమాన గోపురానికి బంగారు పూత పూసిన రాగి రేకులు అమర్చాలని తిరుమల తిరుపతి దేవస్థానం పాలక మండలి నిర్ణయించింది. దీంతో నాటి నుంచి దేవాలయాన్ని మూసివేశారు. ఆలయంలోని ముఖ మండపంలో నమూనా ఆలయం ఏర్పాటు చేశారు. అత్తి చెక్కతో నమూనా విగ్రహాలను  తయారు చేసి అక్కడ తాత్కాలికంగా ప్రతిష్టించారు . స్వామివారి కళలను అత్తి విగ్రహాలలో నిక్షిప్తం చేశారు, స్వామివారికి జరప వలసి ఆగమోక్త కార్యక్రమాలన్నీ కూడా ఈ అత్తి విగ్రహాలకే నిర్వహిస్తున్నారు. దీంతో  పూజార్లకు తప్ప మరెవరికీ  వరాహ స్వామి దర్శనం 2020 డిసెంబర్ నుంచి లభించ లేదు.
కాగా ఈ నెల 24వ తేదీ నుంచి  వరాహ స్వామి ఆలయంలో  అష్టబంధన, మహాసంప్రోక్షణ కార్యక్రమాలు నిర్వహించాలని  టిటిడి  సిద్ధాంతులు ముహూర్తం నిర్ణయించారు. దీనికి టిటిడి పాలక మండలి, ఆగమ సలహా మండలి అమోదం తెలిపాయి. నవంబర్ 24వ తేదీ  సాయంత్రం ఆగమ కార్యక్రమాలు ప్రారంభం కానున్నాయి. 25, 26,27 తేదీలలో యాగశాలలో ఆగమ కార్యక్రమాలు నిర్వహించనున్నారు. 27 వ తేదీ వరాహ స్వామి వారికి కోయిల్ ఆళ్వార్ తిరుమంజనం నిర్వహిస్తారు. 28 వ తేదీ యాగశాలలో శయనాధి వాసం జరిగుతుంది. అదే విధంగా 29 తేది యాగశాలలో పూర్ణాహుతి కార్యక్రమం ఉంటుంది. అదే  వరాహస్వామి తిరుమల మాడ వీధులలో ఊరేగుతూ భక్తులకు దర్శనమిస్తారు.




కొండపల్లి ఎన్నిక ఏమైంది...? టీడీపీ ,వైసీపీ మాట ఏంటీ...?

నన్నే కాదు.. అతన్ని కూడా జట్టులోకి తీసుకోరు : అశ్విన్

మూడు రాజ‌ధానుల‌తో ముంద‌స్తు ఎన్నిక‌ల‌కు జ‌గ‌న్ రెఢీ..!

కొండ‌ప‌ల్లి చైర్మ‌న్ ఎన్నిక‌పై హై కోర్టు ఆగ్ర‌హం

జీహెచ్ఎంసీ కార్యాల‌యం వ‌ద్ద బీజేపీ కార్పొరేట‌ర్ల నిర‌స‌న

టీడీపీకి నాని కంటే వంశీయే గట్టి టార్గెట్ అయ్యాడా ?

స్థానిక సంస్థ‌ల ఎమ్మెల్సీ ఎన్నికల బరిలో కాంగ్రెస్‌..!

జ‌గ‌న్ చేసిన పెద్ద త‌ప్పు ఇదేనా..?

'బిగ్ బాస్ 5' విన్నర్ ఎవరో తెలిసిపోయింది..?



సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - Vennelakanti Sreedhar]]>