PoliticsVUYYURU SUBHASHeditor@indiaherald.comhttps://www.indiaherald.com/ImageStore/images/politics/politics_analysis/jagan-pawan6f56bb37-55d3-4729-b8d5-a0424d441324-415x250-IndiaHerald.jpghttps://www.indiaherald.com/ImageStore/images/politics/politics_analysis/jagan-pawan6f56bb37-55d3-4729-b8d5-a0424d441324-415x250-IndiaHerald.jpgజనసేన అధినేత పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ వచ్చే ఎన్నికల్లో కూడా ఆయన సొంత జిల్లాలోని భీమవరం నియోజకవర్గం నుంచి పోటీ చేస్తారనే ప్రచారం జరుగుతోంది. గత ఎన్నికల్లో పవన్ గాజువాక - భీమవరం రెండు చోట్ల ఓడిపోయినా... భీమవరంలో గట్టి పోటీ ఇచ్చి రెండో స్థానంలో నిలిచారు. అదే గాజువాక లో పవన్ మూడో స్థానంతో సరిపెట్టుకున్నాడు. ఈ క్రమంలోనే వచ్చే ఎన్నికల్లో టీడీపీతో పొత్తు ఉంటుందన్న‌ అంచనాల నేపథ్యంలో పవన్ భీమవరం నుంచి పోటీ చేస్తారని అంటున్నారు. అదే జరిగితే టిడిపి - జనసేన ఓటుబ్యాంకు కలిస్తే ప‌వ‌న్‌ గెలుపు సులువు అవుతుంద‌నJagan Pawan{#}Kshatriya;Bhimavaram;Gajuwaka;Sasanamandali;Janasena;Backward Classes;Cheque;Pawan Kalyan;king;Jagan;TDP;MLA;Party;Directorప‌వ‌న్ నియోజ‌క‌వ‌ర్గంలో జ‌గ‌న్ న‌యా పొలిటిక‌ల్ ఆప‌రేష‌న్‌...!ప‌వ‌న్ నియోజ‌క‌వ‌ర్గంలో జ‌గ‌న్ న‌యా పొలిటిక‌ల్ ఆప‌రేష‌న్‌...!Jagan Pawan{#}Kshatriya;Bhimavaram;Gajuwaka;Sasanamandali;Janasena;Backward Classes;Cheque;Pawan Kalyan;king;Jagan;TDP;MLA;Party;DirectorMon, 22 Nov 2021 13:20:36 GMTజనసేన అధినేత పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ వచ్చే ఎన్నికల్లో కూడా ఆయన సొంత జిల్లాలోని భీమవరం నియోజకవర్గం నుంచి పోటీ చేస్తారనే ప్రచారం జరుగుతోంది. గత ఎన్నికల్లో పవన్ గాజువాక - భీమవరం రెండు చోట్ల ఓడిపోయినా... భీమవరంలో గట్టి పోటీ ఇచ్చి రెండో స్థానంలో నిలిచారు. అదే గాజువాక లో పవన్ మూడో స్థానంతో సరిపెట్టుకున్నాడు. ఈ క్రమంలోనే వచ్చే ఎన్నికల్లో టీడీపీతో పొత్తు ఉంటుందన్న‌ అంచనాల నేపథ్యంలో పవన్ భీమవరం నుంచి పోటీ చేస్తారని అంటున్నారు. అదే జరిగితే టిడిపి - జనసేన ఓటుబ్యాంకు కలిస్తే ప‌వ‌న్‌ గెలుపు సులువు అవుతుంద‌న్న అంచ‌నాలు ఉన్నాయి.

అయితే ఈక్వేషన్ కు ఇప్పటి నుంచే చెక్ పెట్టాలని భావిస్తున్న జగన్ భీమవరం పై ప్రత్యేకమైన పొలిటికల్ ఆపరేషన్ ప్రారంభించారు. తాజాగా భీమవరానికి చెందిన కొయ్యే మోషేన్ రాజు కు ఎమ్మెల్సీ ఇవ్వడంతో పాటు ఆయనను శాసనమండలి చైర్మన్ చేశారు. ఇదే నియోజక వర్గానికి చెందిన బీసీ నేత వేండ్ర వెంకట స్వామి కి డీసీఎస్ఎంఎస్ చైర్మన్ పదవి ఇచ్చారు. ఇక భీమవరంలో బలంగా ఉన్న క్ష‌త్రియులను ఆకట్టుకునే క్రమంలో అదే సామాజిక వర్గానికి చెందిన మాజీ ఎమ్మెల్యే పాతపాటి సర్రాజు కు క్షత్రియ కార్పొరేషన్ చైర్మన్ పదవి ఇచ్చారు.

భీమవరం కు ప‌లు రాష్ట్రస్థాయి నామినేటెడ్ డైరెక్టర్ పదవులు కూడా కట్టబెట్టారు. ఇక్కడ ప‌ట్టు ఉన్న గోక‌రాజు గంగ‌రాజు కుటుంబాన్ని కూడా పార్టీ తన వైపునకు తిప్పేసుకుంది. ఇక‌ గౌడ శెట్టిబలిజ కార్పొరేషన్ డైరెక్టర్ పదవులు కూడా భీమవరానికి ఎక్కువ  ఇచ్చారు. ఇలా అన్ని సామాజిక వర్గాలను పార్టీ వైపు తిప్పుకుని వచ్చే ఎన్నికల్లో మరోసారి పవన్ ను ఇక్క‌డ ఓడించాల‌నే జగన్ ఈ న‌యా పొలిటికల్ ఆపరేషన్ స్టార్ట్ చేసినట్టు తెలుస్తోంది. మ‌రి జ‌గ‌న్ ఈక్వేష‌న్లు వ‌చ్చే ఎన్నిక‌ల్లో మ‌రోసారి ప‌వ‌న్‌కు చెక్ పెడ‌తామో ?  లేదో ?  చూడాలి.



అమరావతి రైతులు హ్యాపీ..! కానీ రాజధాని ఎక్కడ..?

మూడు రాజధానుల రద్దుతో సీఎం ప్రజలకు ఇచ్చే భరోసా ఏంటి..?

కోమ‌టిరెడ్డి బ్ర‌ద‌ర్స్‌తో రేవంత్ రాయ ' భేరం ' ..!

సీఎం జ‌గ‌న్ ప్ర‌క‌ట‌పై అంద‌రి ఆస‌క్తి

మూడు రాజ‌ధానుల ఉప‌సంహ‌ర‌ణ‌పై హై కోర్టులో స్ప‌ష్ట‌త

నిన్న కేసీఆర్ తో భేటీ, ఈ రోజు జగన్ సంచలనం

మూడు రాజధానులు రద్దు చేసేసం: హైకోర్టు లో ఏజి

బిగ్ బ్రేకింగ్: ఏపీకి రెండు రాజధానులు

రైతు గుప్పిట్లో : అత‌డు రాజే కానీ?



సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - VUYYURU SUBHASH]]>