MoviesChakravarthi Kalyaneditor@indiaherald.comhttps://www.indiaherald.com/ImageStore/images/movies/movies_latestnews/jaibhim61068176-b5ed-4238-b970-731d83e1bfa3-415x250-IndiaHerald.jpghttps://www.indiaherald.com/ImageStore/images/movies/movies_latestnews/jaibhim61068176-b5ed-4238-b970-731d83e1bfa3-415x250-IndiaHerald.jpgజై భీమ్.. ఇటీవలి కాలంలో సోషల్ మీడియాలో బాగా చర్చ జరిగిన సినిమాల్లో ఇది ఒకటి. అంతే కాదు.. ఐఎండీబీ వెబ్ సైట్ 9.6 వరకూ రేటింగ్ ఇచ్చిన అరుదైన సినిమా ఇది. ఐఎండీబీ వెబ్ సైట్‌లో నెంబర్ వన్‌గా నిలిచిన సినిమా కూడా ఇదే. ఓ అమాయక గిరిజన మహిళ తన భర్తకు జరిగిన అన్యాయం పై ఏళ్ల తరబడి సాగించిన పోరే ఈ సినిమా.. తమిళ హీరో సూర్య ప్రత్యేక అభిరుచితో స్వయంగా నిర్మించిన నటించిన చిత్రం ఈ జై బీమ్.. ఈ సినిమా దర్శకుడు జ్ఞానవేల్. అయితే.. ఈ సినిమాలో ఓ సామాజిక వర్గాన్ని కించపరిచారంటూ కొన్నిరోజులుగా వివాదం సాగుతోంది. ఈ సినిjaibhim{#}Amazon;Traffic police;surya sivakumar;Hero;Darsakudu;Director;Tamil;Chitram;Cinema;Novemberసూర్యను లాగొద్దు- సారీ చెప్పిన జై భీమ్ డైరెక్టర్..?సూర్యను లాగొద్దు- సారీ చెప్పిన జై భీమ్ డైరెక్టర్..?jaibhim{#}Amazon;Traffic police;surya sivakumar;Hero;Darsakudu;Director;Tamil;Chitram;Cinema;NovemberMon, 22 Nov 2021 07:00:00 GMTజై భీమ్.. ఇటీవలి కాలంలో సోషల్ మీడియాలో బాగా చర్చ  జరిగిన సినిమాల్లో ఇది ఒకటి. అంతే కాదు.. ఐఎండీబీ వెబ్ సైట్ 9.6 వరకూ రేటింగ్ ఇచ్చిన అరుదైన సినిమా ఇది. ఐఎండీబీ వెబ్ సైట్‌లో నెంబర్ వన్‌గా నిలిచిన సినిమా కూడా ఇదే. ఓ అమాయక గిరిజన మహిళ తన భర్తకు జరిగిన అన్యాయం పై ఏళ్ల తరబడి సాగించిన పోరే ఈ సినిమా.. తమిళ హీరో సూర్య ప్రత్యేక అభిరుచితో స్వయంగా నిర్మించిన నటించిన చిత్రం ఈ జై బీమ్.. ఈ సినిమా దర్శకుడు జ్ఞానవేల్. అయితే.. ఈ సినిమాలో ఓ సామాజిక వర్గాన్ని కించపరిచారంటూ కొన్నిరోజులుగా వివాదం సాగుతోంది.


ఈ సినిమాలో క్రూరుడైన పోలీస్ క్యారెక్టర్‌కు వన్నియర్ సామాజిక వర్గానికి చెందిన పేరు పెట్టడం.. దానికి సంబంధించిన కొన్ని చిహ్నాలు వాడటం వివాదాస్పదం అయ్యింది. దీనిపై ఆ సామాజిక వర్గానికి చెందిన నేతలు ఈ అంశంపై నానా గోల చేస్తున్నారు. అయితే.. ఈ విషయంలో నటుడు సూర్యకు సోషల్ మీడియాలో చాలా మద్దతు లభించింది. కానీ.. ఇష్యూ మరింత జఠిలం అవుతుండటంతో దర్శకుడు జ్ఞానవేల్ సదరు సామాజిక వర్గ నేతలకు క్షమాపణలు చెబుతున్నానని ప్రకటించాడు.


ఈ సినిమాలో వన్నియార్ కమ్యూనిటీని హీరో సూర్య కించపరిచాడని పీఎంకే నేతలు చేసిన ఆరోపణలపై దర్శకుడు టీజే జ్ఞానవేల్ స్పందించారు. వన్నియార్ సంఘం రూ.5 కోట్ల నష్ట పరిహారం చెల్లించాలని డిమాండ్ చేసిన నేపథ్యంలో వివాదం పెద్దదిగా మారకూడదని టీజే జ్ఞానవేల్ ఒక మెట్టు దిగారు. ఇప్పటికే ఈ సంఘం సూర్య, జ్యోతిక, టీజే జ్ఞానవేల్, అమెజాన్ ప్రైమ్ వీడియోలకు తాకీదులు పంపింది. ఇక లాభం లేదనుకున్న సినిమా దర్శకుడు టీజే జ్ఞానవేల్ సారీ చెప్పేశారు.


టీజే జ్ఞానవేల్ ఏమంటున్నారంటే.. మేం సినిమా విడుదలకు ముందు ఆ సీన్‌ను గుర్తిస్తే తప్పక తొలగించేవాళ్లం అన్నారు. నవంబర్ 2న చిత్రం విడుదలయిన అనంతరం అనేక మంది ఆ సీన్‌ను గుర్తించారని.. అందుకే వివాదం చెలరేగక ముందే దానిని తొలగించాలని ప్రయత్నించామని సంజాయిషీ ఇచ్చుకున్నారు. దీనికి దర్శకుడిగా తాను పూర్తి బాధ్యత వహిస్తున్నానన్న జ్ఞానవేల్.. సూర్యను ఈ వివాదంలోకి లాగవద్దన్నారు. తమకు ఏ కులాన్ని కించపరచాలనే ఉద్దేశం లేదని.. అందువల్ల ఎవరైనా బాధపడినట్లయితే క్షమాపణలు కోరుతున్నానని జ్ఞానవేల్ ఒక ప్రకటనలో తెలిపారు.



సూర్యను లాగొద్దు- సారీ చెప్పిన జై భీమ్ డైరెక్టర్..?



సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - Chakravarthi Kalyan]]>