PoliticsVeldandi Saikiraneditor@indiaherald.comhttps://www.indiaherald.com/ImageStore//images/categories/politics-IndiaHerald.jpghttps://www.indiaherald.com/ImageStore//images/categories/politics-IndiaHerald.jpgకోర్టులను తప్పుదారి పట్టించాలన్న రాష్ట్ర ప్రభుత్వ వైఫల్యమే నేడు బిల్లులు వెనక్కు తీసుకోవడమని.. న్యాయస్థానాల్లో న్యాయం గెలుస్తుందన్న భయంతోనే ఇప్పుడు మూడు రాజధానుల బిల్లు ఉంపసంహరణ అని పేర్కొన్నారు టీడీపీ రాజ్యసభ సభ్యులు కనకమేడల రవీంద్రకుమార్. ప్రభుత్వం తీసుకున్న దాదాపు 180కు పైగా నిర్ణయాలను న్యాయస్థానాలు తప్పుపట్టాయన్నారు. బిల్లులు విత్ డ్రా చేయడాన్ని స్వాగతిస్తున్నాం..కానీ ఆ నిర్ణయం వెనకున్న మీ దుర్భుద్ధిని ఖండిస్తున్నామని... లెజిస్లేచర్ ను పక్కదారి పట్టించి, ప్రజలను మోసంచేయడమేగాక న్యాయస్థానాలkanaka {#}Sri Krishna,Ishtam,TDP,Andhra Pradesh,Reddy,Amaravati,Capital,Telangana Chief Minister,Governmentమూడు రాజధానుల బిల్లు ఉపసంహరణ పెద్ద కుట్ర !!మూడు రాజధానుల బిల్లు ఉపసంహరణ పెద్ద కుట్ర !!kanaka {#}Sri Krishna,Ishtam,TDP,Andhra Pradesh,Reddy,Amaravati,Capital,Telangana Chief Minister,GovernmentMon, 22 Nov 2021 19:46:29 GMTకోర్టులను తప్పుదారి పట్టించాలన్న రాష్ట్ర ప్రభుత్వ వైఫల్యమే నేడు బిల్లులు వెనక్కు తీసుకోవడమని.. న్యాయస్థానాల్లో న్యాయం గెలుస్తుందన్న భయంతోనే ఇప్పుడు మూడు రాజధానుల బిల్లు ఉంపసంహరణ అని పేర్కొన్నారు టీడీపీ రాజ్యసభ సభ్యులు  కనకమేడల రవీంద్రకుమార్.  ప్రభుత్వం తీసుకున్న దాదాపు 180కు పైగా నిర్ణయాలను న్యాయస్థానాలు తప్పుపట్టాయన్నారు.  బిల్లులు విత్ డ్రా చేయడాన్ని స్వాగతిస్తున్నాం..కానీ ఆ నిర్ణయం వెనకున్న మీ దుర్భుద్ధిని ఖండిస్తున్నామని... లెజిస్లేచర్ ను పక్కదారి పట్టించి, ప్రజలను మోసంచేయడమేగాక న్యాయస్థానాలను తప్పుదారి పట్టిస్తున్నారని ఫైర్‌ అయ్యారు.  గతంలో ప్రాంతాల మధ్య విద్వేషాలు రెచ్చగొట్టడం ఇష్టం లేక అమరావతిని రాజధానిగా ఒప్పుకుంటున్నామన్నారని... ఆ ప్రకటనపై ఇప్పటి ప్రభుత్వం ఎందుకు వెనక్కు తగ్గిందో చెప్పాలి. ఇప్పుడు బిల్లులు ఉపసంహరించుకోవడం వెనుక పాలకులు రాజకీయ దురుద్దేశం కనిపిస్తోందని తెలిపారు.

 మీ యొక్క ఫ్యాక్షన్ రాజకీయాలకు బలైన అమరావతి రైతులకు తలొగ్గి మూడు రాజధానుల బిల్లు ఉపసంహరణకు పూనుకున్నారని... బిల్లు ఉపసంహరణ వెనుక పెద్ద రాజకీయ కుట్ర ఉందని ఫైర్‌ అయ్యారు. 20-01-2020న ఆంధ్రప్రదేశ్ గెజిట్ లో డీసెంట్రలైజేషన్ యాక్ట్, సీఆర్డీఏ రిపీల్ బిల్  తీసుకొచ్చారని... ఆయాక్ట్ లో మొదటిది శ్రీకృష్ణ కమిటీని ఉల్లంఘించి, దానిపై ఎక్స్ పర్ట్ కమిటీ, బోస్టన్ కమిటీ, హైపవర్ కమిటీ వేశారని చెప్పారని వెల్లడించారు.  ముఖ్యమంత్రి చెప్పిందే ఆయా కమిటీలు నివేదికల రూపంలో ప్రభుత్వం ముందు ఉంచాయని ఫైర్‌ అయ్యారు. తాజాగా ప్రభుత్వం ప్రవేశపెట్టిన కొత్త బిల్లుల్లో కూడా పాలకులు అదే పంథాను అనుసరించబోతున్నారని వెల్లడించారు.  జగన్మోహన్ రెడ్డి కాదుకదా..ఏ ప్రభుత్వం వచ్చినా ఎవరి ప్రభుత్వం వచ్చినా రాజధాని మార్చలేదు.. మొదట్నుంచీ అదేచెబుతున్నామన్నారు. పార్లమెంట్లో జరిగిన చర్చలకు భిన్నంగా, రాజ్యాంగంలోని నిర్ణయాలకు విరుద్ధంగా, ఆర్గనైజేషన్ యాక్ట్ కు భిన్నంగా వ్యవహరించడం ఎవరివల్లా కాదని... రాష్ట్ర రాజధానిగా అమరావతినే కొనసాగిస్తామని ఇప్పటికైనా చెప్పి, తప్పు ఒప్పుకుంటే ప్రజలు మిమ్మల్ని మన్నిస్తారని తెలిపారు.





సెలిబ్రిటీలను వదలని మహమ్మారి... ?

మెగాస్టార్ స్కోర్ ఎంత అంటే... ?

జగన్ 2.0: రివర్స్ గేర్ కారణాలు ఆ మూడే...!

ప్రకటన కాదు... చర్చించాల్సిందే...!

మెగా హీరోలకు తలనొప్పిగా మారిన వరుణ్ తేజ్!!

జనగ్ 2.0 : కాంపర్ మైజ్ కాదు... జస్ట్ అడ్జస్ట్ మెంట్ అంతే

డైలమాలో ఏపీ ప్రజలు... ఏ పార్టీకి పట్టం కడతారో?

జగన్ 2.0: హైకోర్టు దూకుడు... ప్రభుత్వానికి బ్రేకులు....!

భారీ ధరకు అమ్ముడైన 'శ్యామ్ సింగరాయ్' డబ్బింగ్ రైట్స్..!!



సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - Veldandi Saikiran]]>