PoliticsRATNA KISHOREeditor@indiaherald.comhttps://www.indiaherald.com/ImageStore/images/politics/politics_latestnews/bjp-9eda7fd4-ceed-4a95-aa30-4f5dda5c5eff-415x250-IndiaHerald.jpghttps://www.indiaherald.com/ImageStore/images/politics/politics_latestnews/bjp-9eda7fd4-ceed-4a95-aa30-4f5dda5c5eff-415x250-IndiaHerald.jpgఇక ఈ సీన్ లోకి తాజాగా బీజేపీ రావ‌డమే కాదు పురంధ‌రి వ‌చ్చి మాట్లాడుతున్నారు. ఉద్య‌మంలోకి ప్ర‌త్య‌క్షంగా పాల్గొంటున్నా రు. అంతేకాదు రాజ‌ధానికి మ‌ద్దతుగా మాట్లాడుతున్నారు. ఇదంతా జ‌గ‌న్ వ‌ర్గాన్ని టార్గెట్ చేసేందుకే అని వేరే చెప్ప‌న‌క్క‌ర్లేదు కానీ ఇప్ప‌టికిప్పుడు రాజ‌ధాని ప్ర‌భావిత ప్రాంతాల స‌మ‌స్య తీర‌కున్నా వారంద‌రికీ కాస్త ఊర‌ట. పురంధ‌రి కూడా చాలా బాగానే మాట్లాడుతున్నారు. మిగిలిన బీజేపీ లీడ‌ర్ల క‌న్నా హుందాగా మాట్లాడ‌డ‌డంలో ఆమెకు ఆమే సాటి అని అనిపించుకుంటున్నా రు. రాజ‌ధాని విష‌య‌మై ఆ రోజు నిశ్శ‌bjp {#}Adhurs;Bharatiya Janata Party;Delhi;YCP;Minister;TDP;Capital;Andhra Pradesh;central governmentఅమ‌రావ‌తి సీన్ లో పురంధ‌రి దెబ్బ అదుర్స్ క‌దూ!అమ‌రావ‌తి సీన్ లో పురంధ‌రి దెబ్బ అదుర్స్ క‌దూ!bjp {#}Adhurs;Bharatiya Janata Party;Delhi;YCP;Minister;TDP;Capital;Andhra Pradesh;central governmentMon, 22 Nov 2021 10:48:32 GMTమూడు రాజ‌ధానుల ఏర్పాటుకు బీజేపీ సిద్ధంగా లేద‌నే తేలిపోయింది. తాము ఆ రోజు అమ‌రావ‌తిని రాజధానిగా ప్ర‌క‌టించాక నిధులు ఇచ్చామ‌ని  వాటినే ఖ‌ర్చు చేసి టీడీపీ స‌ర్కారు కొన్ని భవంతులు నిర్మించిన విష‌యాన్ని మ‌రువ‌కూడ‌ద‌ని ఏపీ బీజేపీ నాయ‌కులు మాట్లాడుతున్నారు. కేంద్ర మాజీ మంత్రి పురంధ‌రి కూడా అదే వాయిస్ తో ఉన్నారు. సీన్ లో కి పురంధ‌రి రావ‌డంతో  కేంద్రం త‌ర‌ఫున మాట్లాడే గొంతుక‌గా ఆమె చెప్పిన లేదా వినిపించిన మాట‌లు ఇప్పుడిక ప్ర‌త్యేకం కానున్నాయి. అంద‌రికీ ఇవే చ‌ర్చ‌కు తావివ్వ‌నున్నాయి.

ఏదేమైన‌ప్ప‌టికీ..బీజేపీ బీజియ‌మ్ అదుర్స్ క‌దూ! మామూలుగా కాదు చాలా ప్ర‌త్యేకంగా ఉంది ఈ బీజియ‌మ్. అమ‌రావ‌తికి సంబంధించి బీజేపీ వాయిస్తున్న లేదా వినిపిస్తున్న బీజీయ‌మ్ మామూలుగా కాదు ఎవ్వ‌రికీ అంద‌ని విధంగా కూడా ఉంది. అవును! రాష్ట్ర రాజధాని విష‌య‌మై బీజేపీ చెబుతున్న‌ది చేస్తున్న‌ది ఇప్పుడొక్క‌టే కావ‌డం బాగుంది. ఆ రోజు తామిచ్చిన నిధుల లెక్క తేల్చందే కొత్త‌గా ఏ ప్ర‌తిపాద‌న‌లూ తెర‌పైకి తేవొద్ద‌ని కూడా అంటోంది. ప‌దిహేను వంద‌ల కోట్ల రూపాయ‌ల‌ను రాజ‌ధాని కోసం వెచ్చించి, ఆ రోజు తాము ప‌నులు పురోగ‌తి సాధించేందుకు ఎంత‌గానో స‌హ‌క‌రించామ‌ని కానీ ఇప్పుడు కొత్త‌గా మూడు రాజ‌ధానుల పేరిట రైతుల‌ను నిలువునా ముంచే ప్ర‌య‌త్నం ఎందుకు చేస్తున్నార‌ని టీడీపీ ఆవేద‌న‌కు అర్థం చెప్పేలా బీజేపీ మాట్లాడుతోంది. రాష్ట్ర విభ‌జ‌న అనంత‌రం రాజ‌ధాని విష‌యాన్ని తేల్చేసిన ఢిల్లీ పెద్ద‌లు మ‌ళ్లీ కొత్త ప్ర‌తిపాద‌న‌లతో బ‌య‌లుదేరిన వైసీపీ ని నిలువ‌రించేందుకు ప్ర‌య‌త్నిస్తున్నారు. ఈ క్ర‌మంలో అది 29 గ్రామాల స‌మ‌స్య‌గా చూడొద్ద‌ని కోర్టులు కూడా చెబుతున్నాయి. అయినా కూడా జ‌గ‌న్ మాత్రం వెన‌క్కు త‌గ్గడం లేదు. ఆయ‌న అనుకున్న‌దేదో ఆయ‌న చేస్తున్నారు. ఈ క్ర‌మంలో న‌వ్వుల పాల‌వుతున్నా కూడా ప‌ట్టించుకోవ‌డం లేదు. ఈ క్ర‌మంలో త‌ప్పులు దొర్లిపోతున్నా కూడా ప‌ట్టించుకోవ‌డం లేదు.
 

ఇక ఈ సీన్ లోకి తాజాగా బీజేపీ రావ‌డమే కాదు పురంధ‌రి వ‌చ్చి మాట్లాడుతున్నారు. ఉద్య‌మంలోకి ప్ర‌త్య‌క్షంగా పాల్గొంటున్నా రు. అంతేకాదు రాజ‌ధానికి మ‌ద్దతుగా మాట్లాడుతున్నారు. ఇదంతా జ‌గ‌న్ వ‌ర్గాన్ని టార్గెట్ చేసేందుకే అని వేరే చెప్ప‌న‌క్క‌ర్లేదు కానీ ఇప్ప‌టికిప్పుడు రాజ‌ధాని ప్ర‌భావిత ప్రాంతాల స‌మ‌స్య తీర‌కున్నా వారంద‌రికీ కాస్త ఊర‌ట. పురంధ‌రి కూడా చాలా బాగానే మాట్లాడుతున్నారు. మిగిలిన బీజేపీ లీడ‌ర్ల క‌న్నా హుందాగా మాట్లాడ‌డ‌డంలో ఆమెకు ఆమే సాటి అని అనిపించుకుంటున్నా రు. రాజ‌ధాని విష‌య‌మై ఆ రోజు నిశ్శ‌బ్దంగా ఉండి ఈరోజు మాట్లాడుతున్న వైసీపీకి ఈ ప‌రిణామం మింగుడు ప‌డకున్నా బీజేపీ సీన్ లోకి రావ‌డంతో మొత్తం వ్య‌వ‌హారం మొద‌టికే మోసం తెచ్చేలా ఉంద‌ని వైసీపీ భావిస్తోంది.



ఒక్క సినిమాతో ఆ హీరోయిన్ కు ఫుల్ క్రేజ్... కానీ ఇప్పుడు?



సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - RATNA KISHORE]]>