PoliticsRATNA KISHOREeditor@indiaherald.comhttps://www.indiaherald.com/ImageStore/images/politics/politics_latestnews/trs-a2304b3f-f874-4b59-bc90-cc1032e1cc64-415x250-IndiaHerald.jpghttps://www.indiaherald.com/ImageStore/images/politics/politics_latestnews/trs-a2304b3f-f874-4b59-bc90-cc1032e1cc64-415x250-IndiaHerald.jpgవ్య‌వ‌సాయం తీరు ఎలా ఉన్నా రైతుకు రాజ‌కీయాల‌కు మ‌ధ్య బంధం కొన‌సాగుతూనే ఉంటుంది. సాగుకు మ‌ద్ద‌తు ద‌క్క‌క అవ‌స్థ ప‌డుతున్న రైతుల‌కు ప్ర‌భుత్వాలు ఇస్తున్న‌ది ఏమీ లేదు. మద్ద‌తు పేరిట ప్రక‌ట‌న‌లే కానీ క్షేత్ర స్థాయిలో అది అమ‌లు కాదు. ఇప్ప‌టికీ ధాన్యం కొనుగోలు ప్ర‌భుత్వం చేప‌ట్టినా సంబంధిత చెల్లింపులు స‌కాలంలో జ‌ర‌గ‌డం లేదు. దీంతో రైతులు ల‌బోదిబోమంటున్నారు. ఇదే సంద‌ర్భంలో రైతు చ‌ట్టాలు కొన్ని సేద్య‌గాడి మెడ‌కు ఉచ్చు బిగిస్తున్నాయి. ప్ర‌భుత్వాల‌కు రైత‌న్న అంటే ప్రేమ ఉన్నా ఆ ప్రేమ అంతా ఓటు బ్యాంకు రాజ‌కీtrs {#}KCR;prema;Love;Delhiరైతంటే ప్రేమ ఎందుకంటే?రైతంటే ప్రేమ ఎందుకంటే?trs {#}KCR;prema;Love;DelhiMon, 22 Nov 2021 11:29:00 GMTవ్య‌వ‌సాయం తీరు ఎలా ఉన్నా రైతుకు రాజ‌కీయాల‌కు మ‌ధ్య బంధం కొన‌సాగుతూనే ఉంటుంది. సాగుకు మ‌ద్ద‌తు ద‌క్క‌క అవ‌స్థ ప‌డుతున్న రైతుల‌కు ప్ర‌భుత్వాలు ఇస్తున్న‌ది ఏమీ లేదు. మద్ద‌తు పేరిట ప్రక‌ట‌న‌లే కానీ క్షేత్ర స్థాయిలో అది అమ‌లు కాదు. ఇప్ప‌టికీ ధాన్యం కొనుగోలు ప్ర‌భుత్వం చేప‌ట్టినా సంబంధిత చెల్లింపులు స‌కాలంలో జ‌ర‌గ‌డం లేదు. దీంతో రైతులు ల‌బోదిబోమంటున్నారు. ఇదే సంద‌ర్భంలో రైతు చ‌ట్టాలు కొన్ని సేద్య‌గాడి మెడ‌కు ఉచ్చు బిగిస్తున్నాయి. ప్ర‌భుత్వాల‌కు రైత‌న్న అంటే ప్రేమ ఉన్నా ఆ ప్రేమ అంతా ఓటు బ్యాంకు రాజ‌కీయాల‌కే ప‌రిమితం అవుతుండ‌డం ఇప్ప‌టి దౌర్భాగ్యానికి సంకేతం. కేంద్రం కానీ రాష్ట్రం కానీ నిర్దిష్ట ప్ర‌ణాళిక‌లు లేకుండా ప‌ని చేసినంత కాలం రైతుకు ద‌క్కేది ఏమీ ఉండదు గాక ఉండ‌దు.


రాష్ట్రంలోనూ దేశంలోనూ రైతు చుట్టూనే రాజ‌కీయాలు న‌డుస్తున్నాయి. తెలంగాణ‌లో అయితే ఈ త‌ర‌హా రాజ‌కీయం మ‌రీ ఎక్కువ‌గా ఉంది. ఆశించిన స్థాయిలో పంట‌లు లేక అవ‌స్థ‌లు ప‌డుతున్న రైతుల‌కు తాజా ప‌రిణామాలు కంట త‌డి పెట్టిస్తున్నాయి. వ‌రుస వాన‌లు వ‌ర‌ద‌లు అన్న‌వి రైతుకు కంటి మీద కునుకులేకుండా చేస్తున్నాయి. ఈ ఏడు పండిన పంట చేతికి వ‌స్తుందా రాదా అన్న సందేహాలూ ఉన్నాయి. ఈ త‌రుణాన సంపాదించిదంతా పెట్టుబ‌డి కింద పెట్టినా కూడా లాభం రావ‌డం లేద‌ని  వాపోతున్నారు రైతులు. సేద్యానికి తాము సాయం చేస్తున్నామ‌ని చెబుతున్న ప్ర‌భుత్వాలు ఆ మాట‌లు కేవలం ప్ర‌క‌ట‌న‌ల‌కే ప‌రిమితం చేస్తున్నా  రు. రుణ‌మాఫీ పేరిట ప్ర‌క‌ట‌న‌లు చేస్తున్నారే త‌ప్ప అర్హుల‌యిన వారికి సాయం అందించ‌డ‌మే లేదు. ఈ త‌రుణంలో తెలంగాణ‌లో యాసంగిలో వ‌చ్చే ధాన్యం దిగుబ‌డుల కొనుగోలుకు కేంద్రం ముందుకు రావాల‌ని కోరుతూ ఇప్ప‌టికే కేసీఆర్ ఉద్య‌మం చేస్తున్నా రు. ఢిల్లీ కేంద్రంగా కూడా ఉద్య‌మాలు చేసేందుకు సిద్ధం అవుతున్నారు. ఇవ‌న్నీ వీరికి రైతంటే ప్రేమ ఉండే చేస్తున్నారా లేదా అన్న‌ది ఇప్ప‌టికీ ఓ సందిగ్ధ‌మే!

గ్రామీణ భార‌తావ‌నిలో ఓటు బ్యాంకు రాజ‌కీయాల‌ను ప్ర‌భావితం చేయ‌డంలో రైతులు ముందుంటున్నారు. అందుకే న‌ల్ల చ‌ట్టాల ర‌ద్దుకు కేంద్రం ముందుకు వ‌చ్చింది. ముఖ్యంగా హ‌ర్యానా, పంజాబ్‌, ఉత్త‌ర ప్ర‌దేశ్ రైతుల పోరాట ఫ‌లితంగానే ఇక్క‌డ ప్ర‌భుత్వాలు
దిగివ‌చ్చాయి. కొన్ని చోట్ల ఉద్య‌మాలు తీవ్ర రూపం దాల్చేందుకు  సంబంధించి ఉద్య‌మ సంఘాలు చేసిన కృషి ఎన‌లేనిది. దీంతో రైతుల పై కేంద్రం చూపిన ప్రేమ కార‌ణంగా చ‌ట్టాలు ర‌ద్ద‌య్యాయి. అయితే ఇవి ఇప్ప‌టికిప్పుడు ర‌ద్ద‌యినా రేపు మ‌ళ్లీ ఏదో ఓ రూపంలో వెలుగు  చూస్తాయ‌న్న‌ది కొంద‌రి ఆందోళ‌న. కానీ కేంద్రం మాత్రం కొంత ప్రేమ‌చూపిస్తోంది. ముంచుకు వ‌స్తున్న ఐదు రాష్ట్రా ఎన్నిక‌ల నేప‌థ్యంలోనే ఈ ప్రేమ అంతా అన్న‌ది తేలిపోయింది. ఇక ఏపీలోనూ రైతు అంటే ప్రేమ మాత్ర‌మే ఉంది. ఉచిత విద్యుత్, రుణ మాఫీ, పెట్టుబ‌డి సాయం ఇవ‌న్నీ రైతు అంటే ప్రేమ‌లో భాగంగానే ఉన్నాయి కానీ వీటి ఫ‌లితాలే అంతంత మాత్రంగా
ఉన్నాయ‌న్న‌ది ఓ నిష్టుర స‌త్యం.





అప్పుడు ఓవర్ నైట్ స్టార్.. కానీ ఇప్పుడు?

మూడు రాజధానులు రద్దు చేసేసం: హైకోర్టు లో ఏజి

రైతు గుప్పిట్లో : అత‌డు రాజే కానీ?

మూడు రాజ‌ధానుల‌పై ఏపీ ప్ర‌భుత్వం కీల‌క నిర్ణ‌యం

కేసీఆర్ ఆ కార‌ణంతోనే తుమ్మ‌ల‌ను ప‌క్క‌న పెట్టారా ?

వరదలపై సిఎం జగన్ కీలక ఆదేశాలు !

నువ్వు లేని లోకంలో ఉండలేను.. నీతో వచ్చేస్తున్నా?

హిందూపురంలో తృటిలో తప్పిన ప్రమాదం



సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - RATNA KISHORE]]>