WinnersVAMSIeditor@indiaherald.comhttps://www.indiaherald.com/ImageStore/images/winners/130/vijayam-meedhec49f2aac-0b04-448b-8e7e-1f2333564085-415x250-IndiaHerald.jpghttps://www.indiaherald.com/ImageStore/images/winners/130/vijayam-meedhec49f2aac-0b04-448b-8e7e-1f2333564085-415x250-IndiaHerald.jpgజీవితం చాలా చిన్నది చెప్పుకోవడానికి మనిషి జీవితం వందేళ్లే. కానీ అంత కాలం బ్రతికే అదృష్టం మనకెక్కడుంది, ఒకప్పుడైతే వందేళ్లకు మించి జీవిస్తూ ఉండేవారు. అది ఎంతో ఆరోగ్యంగా, దృఢంగా. కానీ ఇప్పుడు మన అలవాట్లు, జీవనశైలి కారణంగా మన జీవిత కాలాన్ని మనమే చేజేతులా తగ్గించుకుంటున్నాం. మారిన ఆహారపు అలవాట్లు, నిద్రపోయే, నిద్రలేచే సమయం, శరీరానికి తగిన వ్యాయామం , మనస్సుకి ప్రశాంతత లేని ఆలోచనలు, బయట ఆహారానికి అలవాటు పడటం ఇలా ఇవన్నీ కలిసి మన ఆరోగ్యంపై తీవ్రంగా ప్రభావం చూపి మన జీవిత కాలాన్ని తగ్గిస్తున్నాయి అన్నది vijayam meedhe{#}jeevitha rajaseskhar;Manam;Chiranjeeviవిజయం మీదే: జీవితం పరమార్థం ఇదే?విజయం మీదే: జీవితం పరమార్థం ఇదే?vijayam meedhe{#}jeevitha rajaseskhar;Manam;ChiranjeeviSun, 21 Nov 2021 22:56:53 GMTజీవితం చాలా చిన్నది చెప్పుకోవడానికి మనిషి జీవితం వందేళ్లే. కానీ అంత కాలం బ్రతికే అదృష్టం మనకెక్కడుంది, ఒకప్పుడైతే వందేళ్లకు మించి జీవిస్తూ ఉండేవారు. అది ఎంతో ఆరోగ్యంగా, దృఢంగా.  కానీ ఇప్పుడు మన అలవాట్లు, జీవనశైలి కారణంగా మన జీవిత కాలాన్ని మనమే చేజేతులా తగ్గించుకుంటున్నాం. మారిన ఆహారపు అలవాట్లు, నిద్రపోయే, నిద్రలేచే సమయం, శరీరానికి తగిన వ్యాయామం , మనస్సుకి ప్రశాంతత లేని ఆలోచనలు, బయట ఆహారానికి అలవాటు పడటం ఇలా ఇవన్నీ కలిసి మన ఆరోగ్యంపై తీవ్రంగా ప్రభావం చూపి మన జీవిత కాలాన్ని తగ్గిస్తున్నాయి అన్నది అందరికీ తెలిసిన వాస్తవమే. ఇంకొందరు విధిరాత వలన జీవితం అనే ఆటలో మధ్యలోనే వెనుతిరుగుతున్నారు. వందేళ్లు దేవుడెరుగు కనీసం 60 పైబడి బ్రతకలన్నా అదృష్టం ఉండాల్సిందే అన్న రోజులివి. 

అలాంటి ఈ చిరు జీవితంలో తెలిసి తెలియక బాల్యం గడిచిపోతుంది. పెద్దయ్యాక మంచి, చెడు విచక్షణ తెలిసి కూడా జీవితంపై పెద్దగా అవగాహన లేకుండానే చాలా మంది జీవితం యొక్క పరమార్ధం తెలియకుండానే జీవితం మొత్తం   గడిపేస్తున్నారు. అందరూ విజయం విజయం అంటూ పరుగులు పెడుతున్నారు. కానీ జీవితంలో నిజమైన విజయం అంటే తోటి మనిషిని మనిషిగా ప్రేమించడం వారి ప్రేమను పొందడం. కానీ చాలామంది దృష్టిలో మన కుటుంబం తప్ప మిగిలిన మనుషులంతా మనకు పోటీదారులే వాళ్ళకంటే గొప్పగా బ్రతకాలి, వారు ఎప్పుడూ మనకంటే తక్కువగానే ఉండాలి, ఇలా కుల్లు కుతంత్రాలు ఎక్కువైపోతున్నాయి. ఈ పోరాటంలో మన బంధుమిత్రులను కూడా కోల్పోతున్నాం. వారి ఆదరణకు మనమే దూరం అవుతున్నాం.

సమాజం అద్దం లాంటిది మనం నవ్వితే అది నవ్వుతుంది, మనం ఎదురు తిరిగితే అది కూడా కాలు దువ్వుతుంది. అందరూ మీ ప్రేమని మంచితనాన్ని వెంటనే అర్థం చేసుకో లేకపోవచ్చు, కానీ ఖచ్చితంగా ఒకరోజు గ్రహిస్తారు. వీలైనంత వరకూ అందరితోనూ సంతోషంగా జీవించండి, మళ్ళీ మళ్ళీ ఇదే బంధాలు, ఇదే సమాజంలో  
తిరిగి జన్మించక పోవచ్చు, ఉన్న ఒక్క జీవితాన్ని అందరితో కలిసి ఆనందంగా ఆస్వాదించండి, ప్రశాంతంగా జీవించండి. జననం మరణం మధ్యలో అంతా మర్మమే...ఆసక్తిగా సాగిస్తే ఆద్యంతం ఉత్కంఠభరితమే...!



మట్టి గొంతుకలే ఉపాధ్యాయులైనా వేళా..!

ఏడుపుల సీమ... నవ్వుల అసెంబ్లీ...!

'అఖండ' లో ఆ 47 నిమిషాలు ఇక దబిడి దిబిడే..!!

జగన్ బాబూలాట - ఆంధ్రప్రజా నోటా పెండ : మాకెందుకీ గొడ‌వ..?

జల ప్రళయంతో ఆ జిల్లాల్లో బస్సులు.. రైళ్లు రద్దు..!

అమెరికా కీలక నిర్ణయం.. వారందరికీ బూస్టర్ డోస్?

వైద్యుల నిర్ల‌క్ష్య కార‌ణంగా మ‌హిళ మృతి

బాబు బాధ:ఎవరికీ చేదు.. ఎవరికి తీపి..!

భార్య ప్రాణాలు కాపాడబోతే.. భర్త ప్రాణం పోయింది?



సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - VAMSI]]>