PoliticsMOHAN BABUeditor@indiaherald.comhttps://www.indiaherald.com/ImageStore/images/politics/politics_latestnews/political-b2d4db8f-ce80-4cb2-ab49-1b757c69315d-415x250-IndiaHerald.jpghttps://www.indiaherald.com/ImageStore/images/politics/politics_latestnews/political-b2d4db8f-ce80-4cb2-ab49-1b757c69315d-415x250-IndiaHerald.jpgబయటా చంద్రబాబు ను తిట్టిన తిట్టు తిట్టకుండా నోటికి పని చెప్పారు. అప్పటికే నాని,వంశీల కామెంట్లపై జనాల్లో ను కొంత వ్యతిరేకత వచ్చింది. ఇప్పుడు ఏకంగా నారా ను వదిలేసి నందమూరి ఫ్యామిలీ పై పరుష వ్యాఖ్యలు చేయడం వైసీపీలోనే కాదు, జనాలోనూ వ్యతిరేక భావన పెంచుతోంది. చంద్రబాబుకు సానుభూతి వెల్లువలా వచ్చి పడుతోంది. జూనియర్ ఎన్టీఆర్ కూడా అరాచక పాలన అంటూ తీవ్రంగా స్పందించాల్సి వచ్చింది. ఇకనుంచి చంద్రబాబుపై, లోకేష్ పై పర్సనల్ ఎటాక్ మానాలని రాజకీయంగానే విమర్శలు చేయాలని కొందరు కాంట్రవర్షియల్ నేతలకు వైసిపి పెద్దలు అPolitical {#}Lokesh;bhavana;Lokesh Kanagaraj;Episode;Party;Congress;YCP;Assembly;CBN;TDP;Jr NTR;Andhra Pradeshవైసీపీలో అంతర్మథనం.. ఎందుకో తెలుసా..!వైసీపీలో అంతర్మథనం.. ఎందుకో తెలుసా..!Political {#}Lokesh;bhavana;Lokesh Kanagaraj;Episode;Party;Congress;YCP;Assembly;CBN;TDP;Jr NTR;Andhra PradeshSun, 21 Nov 2021 18:02:00 GMTమాటల తూటాల పై వైసీపీలో అంతర్మథనం మొదలైందా? నోరు జారం అని తెగ ఆలోచిస్తున్నారా? బాబుని ఏడిపించి అనవసరంగా  సానుభూతి ఆయుధం ఇచ్చామని భావిస్తున్నారా? ఇక ఆ నలుగురు నోరును అదుపులో పెట్టుకోవాలని వైసీపీ పెద్దలు వార్నింగ్ బెల్ మోగించారా? టీడీపీ అధినేత చంద్రబాబు శపదాలు, కన్నీటి సుడులు అంతా నాటకమంటూ వైయస్సార్ కాంగ్రెస్ పైపైకి అనగలిగిన లోలోపల మాత్రం మదనపడుతున్నట్టు కనిపిస్తోంది. అసెంబ్లీలో వ్యక్తిగత దూషణల ఘట్టం, చంద్రబాబు దుఃఖం ఎపిసోడ్ తెలుగు రాష్ట్రాల్లో ఇంకో లెవల్లో ప్రాజెక్ట్ అవుతుండడంపై అధికార పార్టీ కొంత డిఫెన్స్ లో పడినట్టు కనబడుతోంది. పర్సనల్ ఎటాక్స్ తో అనవసరంగా టీడీపీకి ఆయుధం ఇచ్చామని జనంలో సానుభూతి, అనేది వెల్లువెత్తుందేమోనన్న చర్చ వైసిపిలో జరుగుతోందట.

కొడాలి నాని, వల్లభనేని వంశీలు మొదటి నుంచి చంద్రబాబు పై తీవ్ర స్థాయిలో విమర్శలు చేస్తూ వచ్చారు. వ్యక్తిగతంగా అనరాని మాటలు అన్నారు. అదే పనిగా వెన్నుపోటు అస్త్రాన్ని వినియోగిస్తూ కుళ్లబొడిచారు. అసెంబ్లీ లోపలా బయటా చంద్రబాబు  ను తిట్టిన తిట్టు తిట్టకుండా నోటికి పని చెప్పారు. అప్పటికే నాని,వంశీల కామెంట్లపై జనాల్లో ను కొంత వ్యతిరేకత వచ్చింది. ఇప్పుడు ఏకంగా నారా ను వదిలేసి నందమూరి ఫ్యామిలీ పై పరుష వ్యాఖ్యలు చేయడం వైసీపీలోనే కాదు, జనాలోనూ వ్యతిరేక భావన పెంచుతోంది. చంద్రబాబుకు సానుభూతి వెల్లువలా వచ్చి పడుతోంది. జూనియర్ ఎన్టీఆర్ కూడా అరాచక పాలన అనేది అంటూ తీవ్రంగా స్పందించాల్సి వచ్చింది. ఇకనుంచి చంద్రబాబుపై, లోకేష్ పై పర్సనల్ ఎటాక్ మానాలని రాజకీయంగానే విమర్శలు చేయాలని కొందరు కాంట్రవర్షియల్ నేతలకు వైసిపి పెద్దలు అల్టిమేటం ఇచ్చారని  తెలుస్తోంది. మొత్తానికి అనుభవం అయితేనే కానీ  తత్వం బోధపడదన్నట్టుగా తయారైంది వైసీపీలో కొందరు నేతల తీరు అంటున్నారు రాజకీయ విశ్లేషకులు. ఇలా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో  రాజకీయం కొనసాగుతోంది.



హస్తిన చంద్రుడు:మమత కేసీఆర్ మాట వింటారా...?

ఏడుపుల సీమ... నవ్వుల అసెంబ్లీ...!

'అఖండ' లో ఆ 47 నిమిషాలు ఇక దబిడి దిబిడే..!!

జగన్ బాబూలాట - ఆంధ్రప్రజా నోటా పెండ : మాకెందుకీ గొడ‌వ..?

జల ప్రళయంతో ఆ జిల్లాల్లో బస్సులు.. రైళ్లు రద్దు..!

అమెరికా కీలక నిర్ణయం.. వారందరికీ బూస్టర్ డోస్?

వైద్యుల నిర్ల‌క్ష్య కార‌ణంగా మ‌హిళ మృతి

బాబు బాధ:ఎవరికీ చేదు.. ఎవరికి తీపి..!

భార్య ప్రాణాలు కాపాడబోతే.. భర్త ప్రాణం పోయింది?



సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - MOHAN BABU]]>