PoliticsVUYYURU SUBHASHeditor@indiaherald.comhttps://www.indiaherald.com/ImageStore/images/politics/politics_latestnews/chandrababu-cry442cb7ed-11d7-4673-b56c-0591acb7a768-415x250-IndiaHerald.jpghttps://www.indiaherald.com/ImageStore/images/politics/politics_latestnews/chandrababu-cry442cb7ed-11d7-4673-b56c-0591acb7a768-415x250-IndiaHerald.jpgరాజకీయాల్లో సెంటిమెంట్లు పనిచేస్తాయి అనేది నిజం. ఇక తెలుగుగడ్డ పై కూడా ఎన్నోసార్లు సెంటిమెంట్లు పనిచేసి ఎంతో మందిని స్టార్లను చేశాయి. ఎన్టీ రామారావు ముఖ్యమంత్రి అయినప్పుడు కూడా తెలుగు ప్రజల్లో బలమైన సెంటిమెంట్ అన్నది వచ్చేసింది. అయితే ప్రతి సందర్భంలోనూ ఈ సెంటిమెంట్ పనిచేస్తుందని అనుకోవడం భ్రమే అవుతుంది. తాజాగా ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీలో టీడీపీ అధినేత మాజీ ముఖ్యమంత్రి చంద్ర‌బాబు తన ఫ్యామిలీ ప్రస్తావన తీసుకు వచ్చారని ఎంతో ఆవేదన చెందారు. ఈ క్రమంలోనే ప్రెస్ మీట్లో ఆయన కన్నీళ్లు పెట్టుకున్నారు. అయితే ఈ chandra babu{#}dr rajasekhar;Press;war;Congress;CBN;TDP;Andhra Pradesh;Party;Telugu;Telangana Chief Ministerక‌న్నీళ్ల‌కు ఓట్లు రావు... బాబుకు గ‌తంలోనే అనుభ‌వ‌మైందిగా...!క‌న్నీళ్ల‌కు ఓట్లు రావు... బాబుకు గ‌తంలోనే అనుభ‌వ‌మైందిగా...!chandra babu{#}dr rajasekhar;Press;war;Congress;CBN;TDP;Andhra Pradesh;Party;Telugu;Telangana Chief MinisterSun, 21 Nov 2021 12:25:00 GMTరాజకీయాల్లో సెంటిమెంట్లు పనిచేస్తాయి అనేది నిజం. ఇక తెలుగుగడ్డ పై కూడా ఎన్నోసార్లు సెంటిమెంట్లు పనిచేసి ఎంతో మందిని స్టార్లను చేశాయి. ఎన్టీ రామారావు ముఖ్యమంత్రి అయినప్పుడు కూడా తెలుగు ప్రజల్లో బలమైన సెంటిమెంట్ అన్నది వచ్చేసింది. అయితే ప్రతి సందర్భంలోనూ ఈ సెంటిమెంట్ పనిచేస్తుందని అనుకోవడం భ్రమే అవుతుంది. తాజాగా ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీలో టీడీపీ అధినేత మాజీ ముఖ్యమంత్రి చంద్ర‌బాబు తన ఫ్యామిలీ ప్రస్తావన తీసుకు వచ్చారని ఎంతో ఆవేదన చెందారు. ఈ క్రమంలోనే ప్రెస్ మీట్లో ఆయన కన్నీళ్లు పెట్టుకున్నారు. అయితే ఈ సెంటిమెంట్ ఆయనకు రాజకీయంగా ఆయనను ముఖ్యమంత్రిని చేస్తుందా ? అంటే చెప్పలేని పరిస్థితి.

ఇది గతంలో చంద్రబాబు  కు కూడా అనుభవమే. చంద్రబాబు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు 2003లో అలిపిరి లో ఆయనపై అప్పటి మావోయిస్టు , పీపుల్స్ వార్ సభ్యులు బాంబు దాడి చేశారు. ఈ దాడి నుంచి బాబు తృటి లో తప్పించుకున్నారు. దీన్ని అనుకూలంగా మార్చుకునేందుకు చంద్రబాబు 2004లో ముందస్తు ఎన్నికలకు వెళ్లారు. అప్పుడు ప్రచారంలో అన్ని జిల్లాల్లోనూ చంద్రబాబు నాయుడు చొక్కాపై రక్తం మరకలతో ఉన్న చిత్రపటాన్ని ప్రచారంగా వాడుకున్నారు. అయితే ఆ ఎన్నికల్లో పార్టీ ఘోరంగా ఓడిపోయింది.

నాటి సమైక్య ఆంధ్రప్రదేశ్ ప్రజలు బాబుపై ఎంతమాత్రం సానుభూతి చూపించలేదు. పైగా వైయస్ రాజశేఖర్ రెడ్డి నేతృత్వంలోని కాంగ్రెస్ పార్టీ 180 కి పైగా ఓట్లతో అఖండ మెజార్టీతో ఆంధ్రప్రదేశ్లో అధికారంలోకి వచ్చింది. అప్పుడు చంద్రబాబు పార్టీ చరిత్రలోనే ఇంత ఘోరంగా ఎప్పుడూ లేన‌ట్టు గా 47 సీట్లతో సరిపెట్టుకున్నారు. ఇక తాజాగా మరో రెండున్న‌ర‌ సంవత్సరాల తర్వాత జరిగే ఎన్నికల్లో బాబు కన్నీళ్లకు ఓట్లు రాలుతాయా ? అంటే ఎంత మాత్రం కాదు అనే చెప్పాలి. దీనిని బట్టి చంద్రబాబు ఎలా ? ఉన్నా ఆయనకు ఈ కన్నీళ్లు మాత్రం రాజకీయంగా ఎంతమాత్రం ల‌బ్ధి కలిగించవు అన్నది నిజం.



RC15 : మూడు నిమిషాల రొమాంటిక్ సీన్ కోసం 40 కోట్లా..?

ఏడుపుల సీమ... నవ్వుల అసెంబ్లీ...!

'అఖండ' లో ఆ 47 నిమిషాలు ఇక దబిడి దిబిడే..!!

జగన్ బాబూలాట - ఆంధ్రప్రజా నోటా పెండ : మాకెందుకీ గొడ‌వ..?

జల ప్రళయంతో ఆ జిల్లాల్లో బస్సులు.. రైళ్లు రద్దు..!

అమెరికా కీలక నిర్ణయం.. వారందరికీ బూస్టర్ డోస్?

వైద్యుల నిర్ల‌క్ష్య కార‌ణంగా మ‌హిళ మృతి

బాబు బాధ:ఎవరికీ చేదు.. ఎవరికి తీపి..!

భార్య ప్రాణాలు కాపాడబోతే.. భర్త ప్రాణం పోయింది?



సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - VUYYURU SUBHASH]]>