MoviesNIKHIL VINAYeditor@indiaherald.comhttps://www.indiaherald.com/ImageStore/images/movies/movies_latestnews/-kaikalasatyanarayanae0a9f335-f13a-465e-a4a9-db5a808f41cf-415x250-IndiaHerald.jpghttps://www.indiaherald.com/ImageStore/images/movies/movies_latestnews/-kaikalasatyanarayanae0a9f335-f13a-465e-a4a9-db5a808f41cf-415x250-IndiaHerald.jpgతెలుగు సినిమా సీనియర్ నటుడు, మరియు భారత శాసనసభ సభ్యుడు అయిన కైకాల సత్యనారాయణ గారు గత 60 సంవత్సరాలుగా తెలుగు సినీ పరిశ్రమలో 750 కు పైగా సినిమాలలో నటించారు. ఒక నటుడిగా చాలా విభిన్నమైన పాత్రల్లో నటించి మెప్పించారు. అందుకు గాను ఆయన కు నటశేఖర అనే బిరుదు కూడా పొందారు . సత్యనారాయణ గారు కృష్ణా జిల్లా గుడ్లవల్లేరు మండలంలోని కౌతరం అనే గ్రామంలో1935 జూలై25 న జన్మించారు. 1959లో విడుదలైన సిపాయి కూతురు అనే చిత్రంతో ఆయన పరిచయమయ్యారు .ఆ సినిమా బాక్సాఫీసు దగ్గర పెద్దగా ఆడకపోయినా ఈయన పాత్రకు మంచి గుర్తింపు వచ్చిం#KaikalaSatyanarayana{#}apoorva;kaikala satyanarayana;mahima;krishna district;Yuvaraju;NTR;Hero;Cinema;Teluguకైకాల సినీ జీవితాన్ని మార్చేసిన సినిమా అదే ??కైకాల సినీ జీవితాన్ని మార్చేసిన సినిమా అదే ??#KaikalaSatyanarayana{#}apoorva;kaikala satyanarayana;mahima;krishna district;Yuvaraju;NTR;Hero;Cinema;TeluguSun, 21 Nov 2021 16:58:28 GMTతెలుగు సినిమా సీనియర్ నటుడు, మరియు భారత శాసనసభ సభ్యుడు అయిన కైకాల సత్యనారాయణ గారు గత 60 సంవత్సరాలుగా తెలుగు సినీ పరిశ్రమలో 750 కు పైగా సినిమాలలో నటించారు. ఒక నటుడిగా చాలా విభిన్నమైన పాత్రల్లో నటించి మెప్పించారు. అందుకు గాను ఆయన కు నటశేఖర అనే బిరుదు కూడా పొందారు .  సత్యనారాయణ గారు కృష్ణా జిల్లా గుడ్లవల్లేరు మండలంలోని కౌతరం అనే గ్రామంలో1935 జూలై25 న జన్మించారు. 1959లో విడుదలైన సిపాయి కూతురు అనే చిత్రంతో ఆయన పరిచయమయ్యారు .ఆ సినిమా బాక్సాఫీసు దగ్గర పెద్దగా ఆడకపోయినా ఈయన పాత్రకు మంచి గుర్తింపు వచ్చింది. దానికి కారణం ఆయన రూపు రేఖలు తెలుగు సినిమా సీనియర్ ఎన్టీఆర్ ను పోలి ఉండటం కూడా ఒక కారణం అయి ఉండవచ్చు.

దర్శకుడు ఎం డి లాల్ మరియు సీనియర్  ఎన్టీఆర్ గారి కాంబినేషన్ లో వచ్చిన సహస్ర శిరచ్ఛేద అపూర్వ చింతామణి సినిమాలో సత్యనారాయణ గారు ఒక యువరాజు పాత్ర పోషించారు. ఆ తర్వాత వచ్చిన కనకదుర్గ పూజ మహిమ ఆ సినిమాలో ఆయన ప్రతినాయకుడిగా నటించారు.ఈ సినిమా ఆయన సినీ జీవితాన్నే మార్చేసింది. అప్పటిదకా ఒక్కక్క ఆఫర్ తో మెల్లగా సినిమాలు చేసే కైకాలని స్టార్ విలన్ గా చేసి వరసగా సినిమాలు అవకాశాలు వచ్చాయి. ఈ సినిమా ఆయన కెరీర్ ని ఎంత మార్చింది అంటే హీరో గా సినీ పరిశ్రమకి వచ్చిన కైకాల ని విలన్ గా మార్చేసింది.  


తర్వాత సినిమాల్లో కూడా ఆయన విలన్ గా నటించ సాగారు. అది మాత్రమే కాకుండా విలన్ గా నటించిన సమయంలోనే మరో వైపు చాలా సినిమాల్లో సహాయ నటుడిగా నటించారు ఇది ఆయనకు సంపూర్ణ నటుడిగా గుర్తింపు తెచ్చింది. యుముడి పాత్రల్లో  కూడా కైకాల గారుకి గొప్ప పేరు ఉంది.



అఖండ గురించి అదిరిపోయే మాటలు చెప్పిన తమన్..!

ఏడుపుల సీమ... నవ్వుల అసెంబ్లీ...!

'అఖండ' లో ఆ 47 నిమిషాలు ఇక దబిడి దిబిడే..!!

జగన్ బాబూలాట - ఆంధ్రప్రజా నోటా పెండ : మాకెందుకీ గొడ‌వ..?

జల ప్రళయంతో ఆ జిల్లాల్లో బస్సులు.. రైళ్లు రద్దు..!

అమెరికా కీలక నిర్ణయం.. వారందరికీ బూస్టర్ డోస్?

వైద్యుల నిర్ల‌క్ష్య కార‌ణంగా మ‌హిళ మృతి

బాబు బాధ:ఎవరికీ చేదు.. ఎవరికి తీపి..!

భార్య ప్రాణాలు కాపాడబోతే.. భర్త ప్రాణం పోయింది?



సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - NIKHIL VINAY]]>