PoliticsVUYYURU SUBHASHeditor@indiaherald.comhttps://www.indiaherald.com/ImageStore/images/politics/politics_analysis/jagan-ysrcpb6a0b1d3-57b3-4c30-91d5-4df88a60ab8a-415x250-IndiaHerald.jpghttps://www.indiaherald.com/ImageStore/images/politics/politics_analysis/jagan-ysrcpb6a0b1d3-57b3-4c30-91d5-4df88a60ab8a-415x250-IndiaHerald.jpgఏపీ అధికార పార్టీ వైసీపీలో ఎన్న‌డూ లేని విధంగా ఇప్పుడు అంత‌ర్మ‌థ‌న రాజ‌కీయం సాగుతోంది. తాజాగా `శుక్ర‌వారం అసెంబ్లీ` ఘ‌ట‌న‌పై పార్టీలో తీవ్ర చ‌ర్చేసాగుతోంది. దీనిలో వైసీపీ నేత‌ల త‌ప్పు ఉందా? లేదా? అనే విష‌యాలు ప్ర‌జ‌ల్లోకి వెళ్లేలోపే.. టీడీపీ అధినేత చంద్ర‌బాబు కార్చిన క‌న్నీరు..ప్ర‌జ‌ల్లో వ‌ర‌ద‌లా పారింద‌ని.. ఆయ‌న‌పై సింప‌తీ ప్ర‌వాహం పెరుగుతోంద‌ని.. వైసీపీలోని కొంద‌రు నాయ‌కులు అంచ‌నా వేస్తున్నారు. అంతేకాదు.. ఇది మున్ముందు పెంచుకునేందుకు చంద్ర‌బాబు మ‌రిన్ని వ్యూహాల‌ను సిద్ధం చేసుకునే అవ‌కాశం ఉందJagan ysrcp{#}Party;TDP;YCPరెండున్న‌రేళ్ల కృషి రెండు నిముషాల్లో.. వైసీపీలో అంత‌ర్మ‌థ‌నం..!రెండున్న‌రేళ్ల కృషి రెండు నిముషాల్లో.. వైసీపీలో అంత‌ర్మ‌థ‌నం..!Jagan ysrcp{#}Party;TDP;YCPSun, 21 Nov 2021 14:14:18 GMTఏపీ అధికార పార్టీ వైసీపీలో ఎన్న‌డూ లేని విధంగా ఇప్పుడు అంత‌ర్మ‌థ‌న రాజ‌కీయం సాగుతోంది. తాజాగా `శుక్ర‌వారం అసెంబ్లీ` ఘ‌ట‌న‌పై పార్టీలో తీవ్ర చ‌ర్చేసాగుతోంది. దీనిలో వైసీపీ నేత‌ల త‌ప్పు ఉందా?  లేదా? అనే విష‌యాలు ప్ర‌జ‌ల్లోకి వెళ్లేలోపే.. టీడీపీ అధినేత చంద్ర‌బాబు కార్చిన క‌న్నీరు..ప్ర‌జ‌ల్లో వ‌ర‌ద‌లా పారింద‌ని.. ఆయ‌న‌పై సింప‌తీ ప్ర‌వాహం పెరుగుతోంద‌ని.. వైసీపీలోని కొంద‌రు నాయ‌కులు అంచ‌నా  వేస్తున్నారు. అంతేకాదు.. ఇది మున్ముందు పెంచుకునేందుకు చంద్ర‌బాబు మ‌రిన్ని వ్యూహాల‌ను సిద్ధం చేసుకునే అవ‌కాశం ఉంద‌ని అంటున్నారు.

అయితే.. ఇదే స‌మ‌యంలో `మ‌నం ఎందుకు ఇంత ర‌చ్చ చేయాలి. వాళ్లున్నంది 19 మంది. వారికి మైక్ ఇవ్వ‌కుండా ఉంటే.. వాళ్లే వెళ్లిపోతారు క‌దా.. వారిని తిట్టి.. స‌భా స‌మ‌యాన్నివృథా చేసుకోవ‌డం ఎందుకు?  మ‌నమే స‌భ‌లో చ‌ర్చించుకుని.. మ‌న నాయ‌కుడిని పొగుడుకుంటే స‌రిపోయేదానికి వాళ్ల‌ను టార్గెట్ చేయాల్సిన అవ‌స‌రం లేదుక‌దా!`` అనే విశ్లేష‌ణ‌లు కూడా పార్టీ వ‌ర్గాల నుంచి వ‌స్తున్నాయి.  చంద్ర‌బాబు పాల‌న న‌చ్చ‌క‌పోవ‌డం వ‌ల్లే ప్ర‌జ‌లు మ‌న‌కు అవ‌కాశం ఇచ్చారు.

అనేక ఇబ్బందులు ప‌డుతున్నాం. చంద్ర‌బాబు చేసిన ప‌నుల‌తో కేంద్రం నుంచి నిధులు రావ‌డం లేదు. అయినా.. కూడా మ‌నం ప‌థ‌కాల‌ను కొన‌సాగిస్తున్నాం. ఈ రెండున్న‌రేళ్ల‌లో దేశంలో ఎక్క‌డా లేనివిధంగా ప‌థ‌కాల‌ను అమ‌లు చేశాం. ప్ర‌తి వ‌ర్గానికీ చేరువ అవుతున్నాం. ప్ర‌తి ఒక్క‌రికీ భ‌రోసా క‌ల్పిస్తున్నాం. అనేక ప‌ద‌వులు ఇచ్చాం. ముఖ్యంగా మ‌హిళ‌ల‌కు పెద్ద‌పీట వేశాం. గ‌తంలో ఎప్పుడూ.. ప‌ద‌వులకు నోచుకోని వారిని కూడా పిలిచి మ‌రీ ప‌ద‌వులు ఇచ్చాం.

ఇది మ‌న‌కు ఈ రెండున్న‌రేళ్ల‌లో ల‌భించిన పెద్ద మైలేజీ. అయితే.. ఇంత రెండున్న‌రేళ్ల‌లో క‌ష్ట‌ప‌డి సాధించిన ఈ మైలేజీని.. ఒక్క రెండు నిముషాల్లో చంద్ర‌బాబు పాడుచేశాడు. మ‌హిళ‌ల‌ను మ‌న‌కు దూరంచేసే ప్ర‌య‌త్నాలు చేస్తున్నాడు. అంత‌ర్గతంగా.. ఈ విష‌యంపై టీడీపీ బాగానే క‌స‌ర‌త్తు చేస్తోంది. దీంతో మ‌నం చేస్తున్న మంచి కొట్టుకుపోతోంది. మ‌న‌మే కొంత సంయ‌మ‌నం పాటిస్తే.. బెట‌రేమో! అనే సూచ‌న‌లు, స‌ల‌హాలు పార్టీ వ‌ర్గాల్లో వెల్లువెత్తుతుండ‌డం గ‌మ‌నార్హం.



క‌ల్వ‌కుంట్ల క‌విత‌కు ఆ ప‌ద‌విపై మ‌న‌సు మ‌ళ్లిందా...!

ఏడుపుల సీమ... నవ్వుల అసెంబ్లీ...!

'అఖండ' లో ఆ 47 నిమిషాలు ఇక దబిడి దిబిడే..!!

జగన్ బాబూలాట - ఆంధ్రప్రజా నోటా పెండ : మాకెందుకీ గొడ‌వ..?

జల ప్రళయంతో ఆ జిల్లాల్లో బస్సులు.. రైళ్లు రద్దు..!

అమెరికా కీలక నిర్ణయం.. వారందరికీ బూస్టర్ డోస్?

వైద్యుల నిర్ల‌క్ష్య కార‌ణంగా మ‌హిళ మృతి

బాబు బాధ:ఎవరికీ చేదు.. ఎవరికి తీపి..!

భార్య ప్రాణాలు కాపాడబోతే.. భర్త ప్రాణం పోయింది?



సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - VUYYURU SUBHASH]]>