HealthMOHAN BABUeditor@indiaherald.comhttps://www.indiaherald.com/ImageStore/images/health/movies_news/health-12485529-3c3b-476e-90e5-dc0f306a10b0-415x250-IndiaHerald.jpghttps://www.indiaherald.com/ImageStore/images/health/movies_news/health-12485529-3c3b-476e-90e5-dc0f306a10b0-415x250-IndiaHerald.jpgమహిళలు ఉపాధి నష్టం 4.2శాతంగా ఉంది.ఇది పురుషుల విషయంలో మూడు శాతంగానే ఉండటం గమనార్హం. గత నెల ఐఎల్ ఓ వెల్లడించిన సమాచారం ప్రకారం..ప్రస్తుతం మహమ్మారి సృష్టించిన ఈ పరిస్థితి 2008-09 లో సంభవించిన ప్రపంచ ఆర్థిక సంక్షోభం తో పోలిస్తే విరుద్ధంగా ఉండటం గమనార్హం.ఆ సమయంలో ఆర్థిక సంక్షోభం ప్రభావం మహిళల కంటే పురుషుల పైనే అధికంగా పడింది.అయినప్పటికీ ఉద్యోగ రికవరీకి పట్టిన సమయం పురుషులతో పోల్చుకుంటే మహిళలే అధికంగా ఉండటం గమనార్హం.ఐఎల్ ఓ అంచనాల ప్రకారం ప్రస్తుతం 2021 పురుషులు, మహిళల ఉపాధి పుంజుకునే అవకాశం ఉన్నప్పటHealth {#}News;INTERNATIONAL;Coronavirusకరోనాతో ఉపాధిపై తీవ్ర ప్రభావం..!కరోనాతో ఉపాధిపై తీవ్ర ప్రభావం..!Health {#}News;INTERNATIONAL;CoronavirusSun, 21 Nov 2021 21:37:00 GMTప్రపంచవ్యాప్తంగా కరోనా మహమ్మారి తీసుకొచ్చిన ప్రతికూల మార్పులు అన్నీ ఇన్నీ కావు. అభివృద్ధి చెందిన దేశాల నుంచి అట్టడుగు దేశాల వరకు ఆర్థికంగా, ఆరోగ్యపరంగా, సామాజికంగాఈ మహమ్మారి తీవ్ర ప్రభావాన్ని చూపింది.ఇక ఉద్యోగ, ఉపాధి నష్టాలు వర్ణనాతీతం. వేలాది మంది ఉద్యోగాలు కోల్పోవాల్సిన పరిస్థితి ఏర్పడింది. ముఖ్యంగా ఈ ప్రభావం పురుషులతో పోల్చుకుంటే మహిళలపైనే అధికంగా పడింది. ఈ విషయాన్ని ఐక్యరాజ్యసమితికి చెందిన అంతర్జాతీయ కార్మిక సంస్థ వెల్లడించింది. అయితే ప్రపంచ దేశాలన్నీ ఇప్పుడిప్పుడే కాస్త కుదుట పడుతున్నాయి. ఈ ఉపాధి సంక్షోభం. 

ప్రపంచవ్యాప్తంగా కరోనా మహమ్మారి తీసుకొచ్చిన ప్రతికూల మార్పులు అన్నీ ఇన్నీ కావు. అభివృద్ధి చెందిన దేశాల నుంచి అట్టడుగు దేశాల వరకు ఆర్థికంగా, ఆరోగ్యపరంగా, సామాజికంగాఈ మహమ్మారి తీవ్ర ప్రభావాన్ని చూపింది.ఇక ఉద్యోగ, ఉపాధి నష్టాలు వర్ణనాతీతం. వేలాది మంది ఉద్యోగాలు కోల్పోవాల్సిన పరిస్థితి ఏర్పడింది. ముఖ్యంగా ఈ ప్రభావం పురుషులతో పోల్చుకుంటే మహిళలపైనే అధికంగా పడింది. ఈ విషయాన్ని ఐక్యరాజ్యసమితికి చెందిన అంతర్జాతీయ కార్మిక సంస్థ వెల్లడించింది. అయితే ప్రపంచ దేశాలన్నీ ఇప్పుడిప్పుడే కాస్త కుదుట పడుతున్నాయి. ఈ ఉపాధి సంక్షోభం కుదుటపడుతుందనుకుంటున్న సందర్భంలో మాత్రం మహిళలు వెనకబడి పోయారని ఐఎల్ ఓ వివరించింది.ఐఎల్ ఓ -2020 నివేదిక అంచనాల ప్రకారం ప్రపంచవ్యాప్తంగా ప్రతిరంగంలోనూ పురుషులతో పోల్చుకుంటే మహిళలు అధిక సంఖ్యలో ఉద్యోగాలు కోల్పోయారు. ప్రపంచ వ్యాప్తంగా మొత్తం మహిళా కార్మికులలో దాదాపు సగం మంది అధిక, మధ్యస్థ-అధిక ప్రమాదం కల రంగాల్లో పని చేశారు.

మహిళలు ఉపాధి నష్టం 4.2శాతంగా ఉంది.ఇది పురుషుల విషయంలో మూడు శాతంగానే ఉండటం గమనార్హం. గత నెల ఐఎల్ ఓ వెల్లడించిన సమాచారం ప్రకారం..ప్రస్తుతం  మహమ్మారి సృష్టించిన ఈ పరిస్థితి 2008-09 లో సంభవించిన ప్రపంచ ఆర్థిక సంక్షోభం తో పోలిస్తే విరుద్ధంగా ఉండటం గమనార్హం.ఆ సమయంలో ఆర్థిక సంక్షోభం ప్రభావం మహిళల కంటే పురుషుల పైనే అధికంగా పడింది.అయినప్పటికీ ఉద్యోగ రికవరీకి పట్టిన సమయం పురుషులతో పోల్చుకుంటే మహిళలే అధికంగా ఉండటం గమనార్హం.ఐఎల్ ఓ అంచనాల ప్రకారం ప్రస్తుతం 2021 పురుషులు, మహిళల ఉపాధి పుంజుకునే అవకాశం ఉన్నప్పటికీ అది మహిళల్లో మందకొడిగా ఉండటం గమనార్హం.



ఓటీపీతో వ్యాక్సినేషన్ స్టేటస్...అంతేకాదు..!

ఏడుపుల సీమ... నవ్వుల అసెంబ్లీ...!

'అఖండ' లో ఆ 47 నిమిషాలు ఇక దబిడి దిబిడే..!!

జగన్ బాబూలాట - ఆంధ్రప్రజా నోటా పెండ : మాకెందుకీ గొడ‌వ..?

జల ప్రళయంతో ఆ జిల్లాల్లో బస్సులు.. రైళ్లు రద్దు..!

అమెరికా కీలక నిర్ణయం.. వారందరికీ బూస్టర్ డోస్?

వైద్యుల నిర్ల‌క్ష్య కార‌ణంగా మ‌హిళ మృతి

బాబు బాధ:ఎవరికీ చేదు.. ఎవరికి తీపి..!

భార్య ప్రాణాలు కాపాడబోతే.. భర్త ప్రాణం పోయింది?



సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - MOHAN BABU]]>