PoliticsRATNA KISHOREeditor@indiaherald.comhttps://www.indiaherald.com/ImageStore/images/politics/politics_latestnews/ycp796bb1e8-25f3-42a1-9c75-6884075f7a3a-415x250-IndiaHerald.jpghttps://www.indiaherald.com/ImageStore/images/politics/politics_latestnews/ycp796bb1e8-25f3-42a1-9c75-6884075f7a3a-415x250-IndiaHerald.jpgమ‌రోసారి ఆదివారం రాజ‌కీయం మారిపోయింది. ప్ర‌తి శుక్ర‌వారం సినిమా జాత‌కం మారిపోతుంది అని అనుకునేంత‌లా ఈ సారి నెల్లూరు రాజ‌కీయ ముఖ చిత్రం మారిపోయింది. ఎవ‌రు ఎవ‌రికి ఎలాంటి ప్రాధాన్యం ఇస్తారు అన్న‌ది తేలిపోయింది. మేయ‌ర్ ప‌ద‌వికి ఇప్ప‌టిదాకా ఉన్న ఉత్కంఠ కూడా తీరిపోయింది. మొత్తం మీద నెల్లూరు లో నెల‌కొన్న రాజ‌కీయ‌ తుఫాను సిటీ,రూర‌ల్ రాజ‌కీయాల‌నూ మార్చేసింది. ఓ ప్ర‌భుత్వ పెద్ద చెప్పిందే వేదం అయి ఉండ‌డంతో కొత్త ముఖం ఒక‌టి మేయ‌ర్ ప‌దవికి ఎంపిక కా వ‌డం ఈ క‌థ‌లో అదిరిపోయే ట్విస్టు భ‌య్యా! ఇక డిప్యూటీ మేయ‌ర్ycp{#}March;Kumaar;MLA;Nellore;Reddy;local language;sunday;Chitram;Minister;CM;Cinemaఆదివారం నెల్లూరు : మేయ‌ర్ ఎంపిక‌లో అదిరిపోయే ట్విస్ట్ !ఆదివారం నెల్లూరు : మేయ‌ర్ ఎంపిక‌లో అదిరిపోయే ట్విస్ట్ !ycp{#}March;Kumaar;MLA;Nellore;Reddy;local language;sunday;Chitram;Minister;CM;CinemaSun, 21 Nov 2021 21:05:09 GMTమ‌రోసారి ఆదివారం రాజ‌కీయం మారిపోయింది. ప్ర‌తి శుక్ర‌వారం సినిమా జాత‌కం మారిపోతుంది అని అనుకునేంత‌లా ఈ సారి నెల్లూరు రాజ‌కీయ ముఖ చిత్రం మారిపోయింది. ఎవ‌రు ఎవ‌రికి ఎలాంటి ప్రాధాన్యం ఇస్తారు అన్న‌ది తేలిపోయింది. మేయ‌ర్ ప‌ద‌వికి ఇప్ప‌టిదాకా ఉన్న ఉత్కంఠ కూడా తీరిపోయింది. మొత్తం మీద నెల్లూరు లో నెల‌కొన్న రాజ‌కీయ‌ తుఫాను సిటీ,రూర‌ల్ రాజ‌కీయాల‌నూ మార్చేసింది. ఓ ప్ర‌భుత్వ పెద్ద చెప్పిందే వేదం అయి ఉండ‌డంతో కొత్త ముఖం ఒక‌టి మేయ‌ర్ ప‌దవికి ఎంపిక కా వ‌డం ఈ క‌థ‌లో అదిరిపోయే ట్విస్టు భ‌య్యా! ఇక డిప్యూటీ మేయ‌ర్ ప‌ద‌వులు మాత్రం మంత్రి అనీల్ వ‌ర్గానికి ద‌క్కే అవ‌కాశాలు నిర్థారితం అయ్యాయి. రూర‌ల్ కు మేయ‌ర్ ప‌ద‌వి, డిప్యూటీ మేయ‌ర్ ప‌ద‌వులు (2) న‌గ‌రానికి కేటాయించే ఛాన్స్ ఉంద‌ని తెలుస్తోం ది. ఇందులో ఒక‌టి పోలుబోయిన రూప్ కుమార్ యాద‌వ్ కు ద‌క్క‌నుంది. మ‌రో ప‌దవి మైనార్టీల‌కు కేటాయించనున్నారని స్థానిక మీడియా వ‌ర్గాల నుంచి నిర్థారితం అయింది.


మాములుగా కాదు చాలా పెద్ద స్థాయిలోనే మార్పులు జ‌రిగిపోయాయి నెల్లూరు ప‌రిణామాల‌కు సంబంధించి.! సీఎం ద‌గ్గ‌ర జ‌రిగిన చ‌ర్చోప‌చ‌ర్చ‌లు ఫ‌లించి, ఎవ్వ‌రూ క‌ల‌లో అయినా ప్ర‌తిపాదించని పేరు ఒక‌టి తెర‌పైకి వ‌చ్చి అంద‌రినీ ఆశ్చ‌ర్య‌పోయేలా చేసింది. ముందు నుంచి పార్టీకి క‌ట్టుబ‌డి ప‌నిచేసిన వారంతా కూడా ఇప్పుడు డైల‌మాలో ప‌డిపోయారు. మంత్రి అనీల్ కూడా అదేవిధంగా డైల‌మాలో ప‌డిపోయారు. రాజకీయం త‌న‌కు అంద‌కుండా ఎవ్వ‌రో చెప్పిన విధంగా న‌డుచుకునే స్థాయిలో ఉంద‌న్న బాధ‌లోనో తీవ్ర నిరాశ‌లోనో  ఉన్నారు మంత్రి అనీల్. ఆయ‌న‌కు కూడా అంద‌ని విధంగా పార్టీలో ఓ కీల‌క నేత చ‌క్రం తిప్పి ప‌రిణా మాల‌ను త‌మ‌కు అనుగుణంగా మార్చి నెల్లూరులో రెడ్ల మాటే చెల్లింపు అయ్యేలా చేసిన ఘ‌న‌త ద‌క్కించుకున్నారు. దీంతో తా జాగా తీసుకున్న నిర్ణ‌యాల‌ను ఏ విధంగా మార్చ‌నుందో మ‌రి!


నెల్లూరు మేయ‌ర్ ఎంపిక‌కు సంబంధించి అదిరిపోయే ట్విస్టు ఇది. మొద‌ట్నుంచి భావించిన అభ్య‌ర్థిని కాకుండా మ‌రొక‌రికి అనూహ్యంగా ప‌ద‌వి వ‌రించ‌డం ఈ క‌థ‌లో ఓ కీల‌క మ‌లుపు. సినిమా స్టోరీని మించిపోయే విధంగా ఈ క‌థ‌కు కూడా క‌ర్త, క‌ర్మ, క్రియ కూడా ఒక‌రున్నారు. ఏదైతేనేం సొంత సామాజిక‌వ‌ర్గ నేత మాట‌కు ఓటు వేశారు జ‌గ‌న్. అవును! ముందునుంచి అనుకున్న విధంగా  53 వ డివిజ‌న్ (న‌గ‌ర ప‌రిధికి చెందిన డివిజ‌న్ ఇది మంత్రి అనీల్ ప్రాబల్యం ఉన్న డివిజ‌న్ ఇది) నుంచి కార్పొరేట‌ర్ గా గెలిచిన దేవ‌ర‌కొండ సుజాత‌కు కాద‌ని, ఈ ప‌ద‌విని  అదే సామాజిక‌వ‌ర్గం (ఎస్టీ) కి చెందిన 12 వ డివిజ‌న్ కార్పొరేట‌ర్ పొట్లూరి స్ర‌వంతికి కేటాయించారు అని స‌మాచారం. స్ర‌వంతి భ‌ర్త పొట్లూరి  జ‌య‌వ‌ర్థ‌న్ విద్యార్థి నాయ‌కుడు అని స్థానికంగా అందుతున్న ప్రాథ‌మిక స‌మాచారం. దీంతో ఇప్పుడు అంతా ఊహించిన విధంగా కాకుండా అందుకు విభిన్నంగా నెల్లూరు రాజ‌కీయం న‌డుస్తోంది. జ‌గ‌న్ సర్కారులో కీల‌కంగా ఉన్న ఓ పెద్ద ఈ క‌థ‌నంతా న‌డిపించి ఆఖ‌రులో త‌న మాట నెగ్గించుకుని, మంత్రి అనీల్ ను ఓడ‌గొట్టారు. దీంతో ఇప్పుడు రూర‌ల్ ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీ‌ధ‌ర్ రెడ్డి వ‌ర్గం అంతా ఆనందోత్సాహాలులో మునిగి తేలుతున్నారు.





ఎన్టీఆర్ కే షాక్ ఇచ్చిన కైకాల సత్యనారాయణ!!

ఏడుపుల సీమ... నవ్వుల అసెంబ్లీ...!

'అఖండ' లో ఆ 47 నిమిషాలు ఇక దబిడి దిబిడే..!!

జగన్ బాబూలాట - ఆంధ్రప్రజా నోటా పెండ : మాకెందుకీ గొడ‌వ..?

జల ప్రళయంతో ఆ జిల్లాల్లో బస్సులు.. రైళ్లు రద్దు..!

అమెరికా కీలక నిర్ణయం.. వారందరికీ బూస్టర్ డోస్?

వైద్యుల నిర్ల‌క్ష్య కార‌ణంగా మ‌హిళ మృతి

బాబు బాధ:ఎవరికీ చేదు.. ఎవరికి తీపి..!

భార్య ప్రాణాలు కాపాడబోతే.. భర్త ప్రాణం పోయింది?



సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - RATNA KISHORE]]>