PoliticsChakravarthi Kalyaneditor@indiaherald.comhttps://www.indiaherald.com/ImageStore/images/politics/politics_latestnews/chandrababu981b2167-1131-4ec2-9787-bf1c1b81f282-415x250-IndiaHerald.jpghttps://www.indiaherald.com/ImageStore/images/politics/politics_latestnews/chandrababu981b2167-1131-4ec2-9787-bf1c1b81f282-415x250-IndiaHerald.jpgతెలుగుదేశం అధినేత చంద్రబాబు శుక్రవారం అనూహ్యంగా వెక్కి వెక్కి ఏడ్చారు. మీడియా సమావేశంలోనే ఒక్కసారిగా ఆవేదనతో కంటనీరు పెట్టుకున్నారు. నోట మాటరాక వెక్కి వెక్కి ఏడ్చారు. ఇలా చంద్రబాబు బేలగా మాట్లాడటం ఆయన రాజకీయ జీవితంలోనే తొలిసారి కావచ్చు. అయితే.. చంద్రబాబు అంతగా ఎందుకు వెక్కి వెక్కి ఏడ్చారన్న అంశం మాత్రం చర్చనీయాంశం అయ్యింది. తన భార్య భువనేశ్వరి వ్యక్తిత్వాన్ని కించపరిచేలా వైసీపీ నేతలు మాట్లాడారని చంద్రబాబు చెబుతున్నారు. అయితే.. అసెంబ్లీ రికార్డుల్లో అంబటి మాధవరెడ్డి అంశం ప్రస్తావించారని ఉంది తchandrababu{#}Audio;Press;Assembly;Raccha;Wife;kuppam;YCP;Party;media;CBN;TDPబాబు ఏడుపు: కుప్పం ఫెయిల్యూర్ డైవర్షన్‌ కోసమేనా..?బాబు ఏడుపు: కుప్పం ఫెయిల్యూర్ డైవర్షన్‌ కోసమేనా..?chandrababu{#}Audio;Press;Assembly;Raccha;Wife;kuppam;YCP;Party;media;CBN;TDPSat, 20 Nov 2021 06:00:00 GMTతెలుగుదేశం అధినేత చంద్రబాబు శుక్రవారం అనూహ్యంగా వెక్కి వెక్కి ఏడ్చారు. మీడియా సమావేశంలోనే ఒక్కసారిగా ఆవేదనతో కంటనీరు పెట్టుకున్నారు. నోట మాటరాక వెక్కి వెక్కి ఏడ్చారు. ఇలా చంద్రబాబు బేలగా మాట్లాడటం ఆయన రాజకీయ జీవితంలోనే తొలిసారి కావచ్చు. అయితే.. చంద్రబాబు అంతగా ఎందుకు వెక్కి వెక్కి ఏడ్చారన్న అంశం మాత్రం చర్చనీయాంశం అయ్యింది. తన భార్య భువనేశ్వరి వ్యక్తిత్వాన్ని కించపరిచేలా వైసీపీ నేతలు మాట్లాడారని చంద్రబాబు చెబుతున్నారు.


అయితే.. అసెంబ్లీ రికార్డుల్లో అంబటి మాధవరెడ్డి అంశం ప్రస్తావించారని ఉంది తప్ప.. అది ఏ విషయంపై అన్న క్లారిటీ లేదు. అయితే.. లోకేశ్‌ పుట్టుకకు సంబంధించిన కొందరు వైసీపీ నేతలు అసభ్యంగా మాట్లాడారని కొన్ని వీడియోలు సోషల్ మీడియాలో సర్క్యులేట్ అవుతున్నాయి. అయితే.. వాటిలో ఏ ఆడియో కూడా క్లియర్‌ గా లేదు. దీంతో అసలు చంద్రబాబును ఏమన్నారు.. చంద్రబాబు ఎందుకు అంతగా హర్ట్ అయ్యారు అన్న చర్చ మాత్రం కొనసాగుతోంది.

చంద్రబాబు మాత్రం.. శాసనసభలో జరిగిన అవమానంపై తీవ్ర ఆవేదన వ్యక్తం చేశారు. చంద్రబాబు... తన జీవితంలో ఇలాంటి పరిణామాలు ఎప్పుడూ చూడలేదన్నారు చంద్రబాబు. రెండున్నరేళ్లుగా బూతులు తిట్టినా, ఎన్ని అవమానాలకు గురిచేసినా భరించామన్న ఆయన... చివరకు తన భార్య గురించి మాట్లాడే పరిస్థితికి వచ్చారని ప్రెస్ మీట్‌లో ఆవేదన వ్యక్తం చేశారు.


అయితే.. ఇదంతా కుప్పం ఎన్నికల్లో టీడీపీ ఓటమిని గురించి ప్రజల దృష్టి తప్పించేందుకు ఆడిన డ్రామాగా కొందరు వైసీపీ నాయకులు కొట్టి పారేస్తున్నారు. ఇలా రచ్చ రచ్చ చేసి సానుభూతి సంపాదించి.. కుప్పంలో జరిగిన ఘోర ఓటమిని మరిపించాలని చంద్రబాబు ప్రయత్నిస్తున్నారన్న విమర్శలు కూడా వస్తున్నాయి. అసలు తమ పార్టీ నాయకులు ఏ మహిళ పేరు ప్రస్తావించలేదని.. చంద్రబాబే ఏదో ఒక గొడవ చేయాలని నిర్ణయించుకుని అసెంబ్లీకి వచ్చారని.. ఆయన అనుకున్నట్టుగానే గొడవ చేయించుకుని బయటకు వెళ్లిపోయారని వైసీపీ నేతలు విమర్శిస్తున్నారు.





భారీ వ‌ర్షాలు : నేడు సీఎం జగన్‌ ఏరియల్‌ సర్వే

ఎమ్మెల్సీ మృతి ప‌ట్ల సీఎం దిగ్భ్రాంతి

ఇంట్లో అద్దం ఏ దిశలో ఉండాలో తెలుసా ?

చంద్రబాబు పొలిటికల్ కెరీర్ లో ఇదే లాస్ట్: కొడాలి నానీ

ఢిల్లీలో బిజీ బిజీగా ఏపీ మంత్రి...!

ఓ మంచి కథ, మరో మంచి ప్రయత్నం..

బైబై బాబూ అంటూ రోజా సంచలన వీడియో

రోడ్లపైకి కోట్లలో పీతలు.. భయాందోళనలో ప్రజలు

ఇవాల్టి ఘటనను ఖండించిన బిజేపి !!



సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - Chakravarthi Kalyan]]>