PoliticsN ANJANEYULUeditor@indiaherald.comhttps://www.indiaherald.com/ImageStore/images/politics/politics_latestnews/aerial-survey-of-ap-cm-jagan-today0ab2d414-3251-4302-b92a-ac42a17b2e73-415x250-IndiaHerald.jpghttps://www.indiaherald.com/ImageStore/images/politics/politics_latestnews/aerial-survey-of-ap-cm-jagan-today0ab2d414-3251-4302-b92a-ac42a17b2e73-415x250-IndiaHerald.jpgఆంధ్ర‌ప్ర‌దేశ్‌లో ముఖ్యంగా నాలుగు జిల్లాల‌ను వ‌ర్షాలు నిండా ముంచాయి. ప్రాణ న‌ష్టంతో పాటు తీవ్రంగా ఆస్తిన‌ష్టం కూడా క‌లిగించాయి. వంద‌లాది ఎక‌రాల్లో పంట‌లు నీటిలో మునిగాయి. దీంతో ఇవాళ సీఎం జ‌గ‌న్ వ‌ర‌ద ప్ర‌భావిత ప్రాంతాల‌లో ఏరియ‌ల్ స‌ర్వే నిర్వ‌హించ‌నున్నారు. క‌డ‌ప‌, రాజంపేట‌లో 10.30 గంట‌ల‌కు వెళ్ల‌నున్నారు. దాదాపు గ‌త 10 రోజుల నుంచి వ‌ర్షాలు బీభ‌త్సాన్ని సృష్టిస్తూనే ఉన్నాయి. ముసురు మాత్రం అస‌లు తొల‌గ‌డమే లేదు. ముసురుతో పాటు ఒక‌దాని త‌రువాత మ‌రొక‌టి వ‌ర‌స‌గా వాయుగుండాలు తీర‌ని న‌ష్టాల‌ను క‌లిగిస#సీఎం జగన్‌ ఏరియల్‌ సర్వే{#}gannavaram;Varsham;Nellore;Prime Minister;central government;Renigunta;Survey;kadapa;CM;Andhra Pradeshభారీ వ‌ర్షాలు : నేడు సీఎం జగన్‌ ఏరియల్‌ సర్వేభారీ వ‌ర్షాలు : నేడు సీఎం జగన్‌ ఏరియల్‌ సర్వే#సీఎం జగన్‌ ఏరియల్‌ సర్వే{#}gannavaram;Varsham;Nellore;Prime Minister;central government;Renigunta;Survey;kadapa;CM;Andhra PradeshSat, 20 Nov 2021 09:01:35 GMTఆంధ్ర‌ప్ర‌దేశ్‌లో ముఖ్యంగా నాలుగు జిల్లాల‌ను వ‌ర్షాలు నిండా ముంచాయి. ప్రాణ న‌ష్టంతో పాటు తీవ్రంగా ఆస్తిన‌ష్టం కూడా క‌లిగించాయి. వంద‌లాది ఎక‌రాల్లో పంట‌లు నీటిలో మునిగాయి. దీంతో ఇవాళ సీఎం జ‌గ‌న్ వ‌ర‌ద ప్ర‌భావిత ప్రాంతాల‌లో ఏరియ‌ల్ స‌ర్వే నిర్వ‌హించ‌నున్నారు. క‌డ‌ప‌, రాజంపేట‌లో 10.30 గంట‌ల‌కు వెళ్ల‌నున్నారు. దాదాపు గ‌త 10 రోజుల నుంచి వ‌ర్షాలు బీభ‌త్సాన్ని సృష్టిస్తూనే ఉన్నాయి. ముసురు మాత్రం అస‌లు తొల‌గ‌డమే లేదు.

ముసురుతో పాటు ఒక‌దాని త‌రువాత మ‌రొక‌టి వ‌ర‌స‌గా వాయుగుండాలు తీర‌ని న‌ష్టాల‌ను క‌లిగిస్తున్నాయి. నైరుతీ రుతుప‌వ‌నాలు తిరోగ‌మ‌న ద‌శ‌లో వ‌ర్షాలు కురుస్తుండ‌డంతో ముఖ్యంగా మూడు జిల్లాలు అత‌లాకుత‌ల‌మ‌వుతున్నాయి. క‌డ‌ప‌, చిత్తూరు, నెల్లూరు జిల్లాలు  భారీ కుంభ‌వృష్టి, వ‌ర‌ద‌ల‌తో అల్లాడిపోతున్నాయి. ఈ వ‌ర‌ద‌ల‌తో ప్ర‌భుత్వం అలెర్ట్ అయిన‌ది. ఇప్ప‌టికే స‌హాయ‌క చ‌ర్య‌ల‌ను చేప‌ట్ట‌డం మొద‌లు పెట్టింది. ఎప్ప‌టిక‌ప్పుడు మానిట‌రింగ్ చేయ‌డంతో పాటు ఇవాళ సీఎం జ‌గ‌న్ ఏరియ‌ల్ స‌ర్వే నిర్వ‌హించ‌నున్నారు. క‌డ‌ప‌, చిత్తూరు, నెల్లూరు జిల్లాల‌తో స‌హా ఈరోజు భారీ వ‌ర్ష‌ ప్ర‌భావిత ప్రాంతాల‌ను సీఎం జ‌గ‌న్ ఏరియ‌ల్ స‌ర్వే ద్వారా ప‌రిశీలించ‌నున్నారు.

తొలుత‌ గన్నవరం విమానాశ్రయం నుంచి నేరుగా కడప చేరుకుని అక్కడ నుంచి హెలికాప్టర్‌ ద్వారా వరద ప్రభావిత ప్రాంతాలను పరిశీలిస్తారు సీఎం. ఏరియల్‌ సర్వేకు బయలుదేరే ముందు ముఖ్యంగా  ఆ జిల్లాల కలెక్టర్లతో వీడియో కాన్ఫరెన్స్‌ నిర్వహించనున్నారు ముఖ్య‌మంత్రి.   ఏరియల్‌ సర్వే త‌రువాత  రేణిగుంట విమానాశ్రయం చేరుకుని  సీఎం అక్కడి నుంచి తిరిగి గన్నవరం వస్తారు. ఇప్ప‌టికే ఏపీలో వ‌ర‌ద ప‌రిస్థితుల‌తో ప్ర‌ధాని న‌రేంద్ర మోడీ ఫోన్‌లో మాట్లాడిన విష‌యం విధిత‌మే. అయితే ప్రభుత్వ చర్యలను, 5 జిల్లాల‌లో వర్షం ప్ర‌భావిత‌ పరిస్థితులను ప్రధాని మోడీకి  వివరించారు జ‌గ‌న్‌. కేంద్ర ప్ర‌భుత్వం నుంచి స‌హాయ‌, స‌హ‌కారాలు త‌ప్ప‌కుండా అంద‌జేస్తామ‌ని మోడీ ఏపీ సీఎం జ‌గ‌న్‌కు హామీ ఇచ్చారు.





ఊహించని ట్విస్ట్: బాబుకి బీజేపీ మద్దతు

ఎమ్మెల్సీ మృతి ప‌ట్ల సీఎం దిగ్భ్రాంతి

ఇంట్లో అద్దం ఏ దిశలో ఉండాలో తెలుసా ?

చంద్రబాబు పొలిటికల్ కెరీర్ లో ఇదే లాస్ట్: కొడాలి నానీ

ఢిల్లీలో బిజీ బిజీగా ఏపీ మంత్రి...!

ఓ మంచి కథ, మరో మంచి ప్రయత్నం..

బైబై బాబూ అంటూ రోజా సంచలన వీడియో

రోడ్లపైకి కోట్లలో పీతలు.. భయాందోళనలో ప్రజలు

ఇవాల్టి ఘటనను ఖండించిన బిజేపి !!



సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - N ANJANEYULU]]>