PoliticsVennelakanti Sreedhareditor@indiaherald.comhttps://www.indiaherald.com/ImageStore/images/politics/politics_latestnews/gudur7131d65e-ef9d-4c5e-bedb-914ad2011e69-415x250-IndiaHerald.jpghttps://www.indiaherald.com/ImageStore/images/politics/politics_latestnews/gudur7131d65e-ef9d-4c5e-bedb-914ad2011e69-415x250-IndiaHerald.jpgకనచూపు మేర వర్షం.. పొంగి పొర్లుతున్న పంబలేరు వాగు. కైవల్యా నది, కాళంగినదికి వరద ప్రవాహం. ఎన్నడూ లేనిది స్వర్ణ ముఖి నది కూడా ఈ సారి ఉగ్ర రూపం దాల్చింది. వేలాది ఎకరాల్లో పంట నీట మునిగింది. ఇదే సమయంలో అమరావతిలో అసెంబ్లీ సమావేశం.. పైగా వ్యవసాయం పై చర్చ. రైతులందరూ ప్రభుత్వం ఆదుకుంటుందని ఆశించారు. ప్రతిపక్ష సభ్యులు తమ సమస్యలను ప్రభుత్వం దృష్టికి తీసుకొస్తారని రైతులు భావించారు. కానీ జరిగిందేమిటి ? ప్రజల సమస్యలను చర్చించాల్సిన నేతలు అక్కడ ఏం చేశారు ?gudur{#}Aqua;Gudur;collector;Jagan;Telangana Chief Minister;Nellore;Government;Chennai;Assembly;Minister;Reddy;Partyజగన్ బాబులాట - ఆంధ్రప్రజ నోట్లో పెండ: గూడూరు గోడు వినండయ్యాజగన్ బాబులాట - ఆంధ్రప్రజ నోట్లో పెండ: గూడూరు గోడు వినండయ్యాgudur{#}Aqua;Gudur;collector;Jagan;Telangana Chief Minister;Nellore;Government;Chennai;Assembly;Minister;Reddy;PartySat, 20 Nov 2021 18:00:00 GMTఆంధ్ర ప్రదేశ్ వాణిజ్య చిత్ర పటంలో నెల్లూరు జిల్లాా గూడూరు కు ఓ ప్రత్యేకత ఉంది. గతంలో ఈ ప్రాంతం వర్తక వాణిజ్యానికి పెట్టింది పేరు. ఇక్కడ లభించే అబ్రకానికి ( మైకా)కు విదేశాలలో మంచి డిమాండ్ ఉండేది. దీంతో ఈ డివిజన్ ప్రపంచ ఖ్యాతి గాంచింది. బ్రిటీష్ హయాం నుంచి గూడూరులో సబ్ కలెక్టర్ కార్యాలయం ఉంది. స్వాతంత్య్రం వచ్చిన తరువాత కూడా సబ్ కలెక్టర్ గా ఐఏఎస్ అధికాలనే నియమిస్తున్నారు. ఇప్పటికీ ఆ ఆనవాయితీ దాదాపుగా అమలవుతోంది.  
వ్యవసాయ పరంగా  ఈ ప్రాంతం ప్రస్తుతం నిమ్మకాయలకు ఎగుమతి కేంద్రం గా ఉంది. ఇక్కడి  నుంచి ఉత్తర భారత దేశానికి నిమ్మకాయలు నిత్యం ఎగుమతి అవుతాయి. రైళ్లు, లారీలు, తిరుపతి, చెన్నై విమానాశ్రయాల నుంచి కూడా ఇక్కడి వ్యాపారులు నిమ్మకాయలను ఎగుమతి చేస్తారు.

 రాజకీయ పరంగా ఉద్దండుల స్వక్షేతం. దివంగత నేతలు మాజీ ముఖ్యమంత్రి నేదురు మల్లి జనార్దన్ రెడ్డి,   మాజీ మంత్రి నల్లపు రెడ్డి శ్రీనివాసులరెడ్డిల  బర్త్ ప్లేస్. ఇద్దరూ వేర్వేరు పార్టీ లో ఉన్నా, ఓకే పార్టీలో ఉన్నాకూడా విభిన్న దృవాలు గానే వ్యవహరించారు. ప్రస్తతం తరం మారింది. కొత్త నేతలు పుట్టుకు వచ్చారు. వారి స్వరం మారింది. అసెంబ్లీ లోనూ, బైట కూడా రాజకీయ నేతల తీరు మారింది.
నెల్లూరు జిల్లా వరి సాగుకు పెట్టింది పేరు. నెల్లూరు మొలగొలుకులంటే తెలియని తెలుగోడు ఉండడంటే అతిశయోక్తి లేదు.

పక్షం రోజులుగా ఎడతేరిపి లేకుండా  కురుస్తున్న వర్షాలు కర్షకులకు కంటి మీద కునుకు లేకుండా చేస్తున్నాయి. గతంలో రైతులకు ఏ కొద్ది పాటి ఇబ్బంది వచ్చినా  అధికారులు, రాజకీయ నేతలు  ఎలాంటి హడావిడి లేకుండా వచ్చి అండగా నిలబడే వారు. ప్రస్తుతం రాజకీయ నేతల తీరు మారింది.  ఇటీవలి వర్షానికి  ఒక్క గూడూరు డివిజన్ లోనే 75 వేల ఎకరాలకు పైగా వరి పంటకు నష్టం వాటిల్లింది.  ఐదువేల ఎకరాలకు పైగా మినుము పంట నీట మునిగింది వెయ్యి ఎకరాల్లో వేరు శనగ ,  పది వేలకు పైగా ఎకరాల్లో నిమ్మ పంటలు దెబ్బ తిన్నాయి. ఆక్వా రంగానికి జరిగిన నష్టం వివరాలు ఇంకా తెలియ రాలేదు. రైతుల గోడు పట్టించుకునే నాథుడే కరవయ్యారు.
ఇదే సమయంలో అమరావతిలో అసెంబ్లీ సమావేశం.. పైగా వ్యవసాయం పై చర్చ. రైతులందరూ ప్రభుత్వం ఆదుకుంటుందని ఆశించారు. ప్రతిపక్ష సభ్యులు తమ సమస్యలను ప్రభుత్వం దృష్టికి తీసుకొస్తారని  రైతులు భావించారు. కానీ జరిగిందేమిటి ?   ప్రజల సమస్యలను చర్చించాల్సిన నేతలు అక్కడ ఏం చేశారు ? జగన్ బాబులాట - ఆంధ్రప్రజ నోట్లో పెండ... ఇదా ప్రజాప్రతినిధులు చేయాల్సింది.







రంగంలోకి చంద్రబాబు... అక్కడే తేల్చుకుంటామంటున్న తమ్ముళ్లు...!

ఏడుపుల సీమ... నవ్వుల అసెంబ్లీ...!

'అఖండ' లో ఆ 47 నిమిషాలు ఇక దబిడి దిబిడే..!!

జగన్ బాబూలాట - ఆంధ్రప్రజా నోటా పెండ : మాకెందుకీ గొడ‌వ..?

జల ప్రళయంతో ఆ జిల్లాల్లో బస్సులు.. రైళ్లు రద్దు..!

అమెరికా కీలక నిర్ణయం.. వారందరికీ బూస్టర్ డోస్?

వైద్యుల నిర్ల‌క్ష్య కార‌ణంగా మ‌హిళ మృతి

బాబు బాధ:ఎవరికీ చేదు.. ఎవరికి తీపి..!

భార్య ప్రాణాలు కాపాడబోతే.. భర్త ప్రాణం పోయింది?



సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - Vennelakanti Sreedhar]]>