PoliticsGullapally Rajesheditor@indiaherald.comhttps://www.indiaherald.com/ImageStore/images/politics/politics_latestnews/jagan6cf86887-016c-4c7f-9759-89a5e31a86c9-415x250-IndiaHerald.jpghttps://www.indiaherald.com/ImageStore/images/politics/politics_latestnews/jagan6cf86887-016c-4c7f-9759-89a5e31a86c9-415x250-IndiaHerald.jpgరాయలసీమ ప్రాంతంలో పరిస్థితి చాలా దారుణంగా మారింది ఇప్పుడు. భారీ వరదలతో ప్రజలు ఇళ్ళ నుంచి బయటకు రాలేని పరిస్థితి కొన్ని చోట్ల ఉంటే ప్రాణాలు అరచేతిన పెట్టుకుని పరుగులు తీసే పరిస్థితి మరో చోట ఉందని చెప్పాలి. కొన్ని కొన్ని ప్రాంతాల్లో వరద భారీగా రావడంతో ఏం చేయాలో అర్ధం కాని పరిస్థితి అధికారులు కూడా ఉన్నారు ఇప్పుడు. కొన్ని కొన్ని ప్రాంతాలతో సమాచార వ్యవస్థ కూడా పూర్తిగా నాశనం కాగా జంతువులు కూడా ప్రాణాలు కోల్పోయాయి. కడప అనంతపురం జిల్లాల్లో పరిస్థితి చాలా దారుణంగా ఉందనే విస్శయం అర్ధమవుతుంది. పలు నదులుjagan{#}Rayalaseema;kadapa;Jagan;Ananthapuram;CM;Governmentరాయలసీమలో అత్యంత దయనీయ పరిస్థితి, అలెర్ట్ అయిన సిఎం జగన్...!రాయలసీమలో అత్యంత దయనీయ పరిస్థితి, అలెర్ట్ అయిన సిఎం జగన్...!jagan{#}Rayalaseema;kadapa;Jagan;Ananthapuram;CM;GovernmentFri, 19 Nov 2021 12:19:15 GMTరాయలసీమ ప్రాంతంలో పరిస్థితి చాలా దారుణంగా మారింది ఇప్పుడు. భారీ వరదలతో ప్రజలు ఇళ్ళ నుంచి బయటకు రాలేని పరిస్థితి కొన్ని చోట్ల ఉంటే ప్రాణాలు అరచేతిన పెట్టుకుని పరుగులు తీసే పరిస్థితి మరో చోట ఉందని చెప్పాలి. కొన్ని కొన్ని ప్రాంతాల్లో వరద భారీగా రావడంతో ఏం చేయాలో అర్ధం కాని పరిస్థితి అధికారులు కూడా ఉన్నారు ఇప్పుడు. కొన్ని కొన్ని ప్రాంతాలతో సమాచార వ్యవస్థ కూడా పూర్తిగా నాశనం కాగా జంతువులు కూడా ప్రాణాలు కోల్పోయాయి. కడప అనంతపురం జిల్లాల్లో పరిస్థితి చాలా దారుణంగా ఉందనే విస్శయం అర్ధమవుతుంది.

పలు నదులు భారీ వర్షానికి పొంగి పొర్లడంతో ప్రజలు ఇళ్ళ నుంచి బయటకు రావడం లేదు. ఇక రవాణా వ్యవస్థ పూర్తిగా దెబ్బ తినడమే కాకుండా ప్రజలకు ఆహరం అందించే పరిస్థితి కూడా లేకుండా పోయింది అని చెప్పాలి. ఈ నేపధ్యంలో సిఎం వైఎస్ జగన్ పూర్తి స్థాయిలో అలెర్ట్ అయి జాగ్రత్తలు తీసుకుంటున్నారు. సచివాలయంలో ప్రకాశం, నెల్లూరు, చిత్తూరు, వైయస్సార్, అనంతపురం జిల్లాల కలెక్టర్లతో సీఎం వీడియో కాన్ఫరెన్స్‌నిర్వహించి పలు సూచనలు చేసారు. భారీ వర్షాల నేపథ్యంలో తీసుకోవాల్సిన చర్యలపై సీఎం వీడియో కాన్ఫరెన్స్‌ నిర్వహించారు.

వరద సహాయక పనుల పర్యవేక్షణకు మూడు జిల్లాలకు ప్రత్యేక అధికారులను జగన్ నియమించారు. భారీ వర్షాలు కురుస్తున్న నెల్లూరు, చిత్తూరు, వైయస్సార్‌ జిల్లాలకు ప్రభుత్వం ప్రత్యేక అధికారులను నియమించింది అని జగన్ తెలిపారు.

సీఎం  వైయస్‌ జగన్‌ ఆదేశాల మేరకు గత రాత్రే అధికారులు ఆయా జిల్లాలకు చేరుకున్నారు.

భారీ వర్షాల వల్ల సంభవిస్తున్న వరదల నేపథ్యంలో సహాయ చర్యలను అధికారులు స్వయంగా పర్యవేక్షించనున్నారు.

అలాగే వారు పరిస్థితిని ఎప్పటికప్పుడు ముఖ్యమంత్రికి నివేదిస్తారు.
 
నెల్లూరు జిల్లాకు విద్యా శాఖ ముఖ్య కార్యదర్శి బుడితి రాజశేఖర్,

చిత్తూరు జిల్లాకు మార్కెటింగ్‌ కమిషనర్‌ ప్రద్యుమ్న,

వైయస్సార్‌ జిల్లాకు మరో సీనియర్‌ అధికారి శశిభూషణ్‌కుమార్‌ను ప్రభుత్వం ప్రత్యేక అధికారులుగా నియ‌మించిన‌ట్టు వెల్ల‌డి



రాయలసీమలో అత్యంత దయనీయ పరిస్థితి, అలెర్ట్ అయిన సిఎం జగన్...!

జ‌గ‌న్‌కు ' క‌మ్మ‌' టి దెబ్బ బాగా ప‌డిందా...!

జ‌గ‌న్ గ్రాఫ్ నిజంగానే ప‌డిపోయిందా...!

చంద్ర‌బాబు ఆ ఇద్ద‌రినే న‌మ్మారు.. నిండా మునిగారు..!

ఆ వైపీపీ క‌మ్మ ఎమ్మెల్యేకు డేంజ‌ర్ బెల్స్‌...!

రైతు విజయం : మోడీకి చుక్కలు చూపించిన ఆ ఒక్కడు..!

న‌ల్ల‌గొండ ఎమ్మెల్సీ అభ్య‌ర్థిగా కూసుకుంట్ల ప్ర‌భాక‌ర్

బిగ్ బాస్ 5 : కొత్త కెప్టెన్ ఎవరో తెలిసిపోయింది?

జనసేన : కృతఙ్ఞతలు తప్ప.. ఇంకేమి చేయలేవా..!



సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - Gullapally Rajesh]]>