PoliticsChakravarthi Kalyaneditor@indiaherald.comhttps://www.indiaherald.com/ImageStore/images/politics/politics_latestnews/modi7fc88f63-90b1-4066-8f36-47111f5ccbcc-415x250-IndiaHerald.jpghttps://www.indiaherald.com/ImageStore/images/politics/politics_latestnews/modi7fc88f63-90b1-4066-8f36-47111f5ccbcc-415x250-IndiaHerald.jpgసాగు చట్టాల విషయంలో కేంద్రం వెనక్కి తగ్గింది.. సాగు చట్టాలను రద్దు చేస్తున్నట్టు స్వయంగా ప్రధాని మోడీ ప్రకటించాడు. పార్లమెంటులో దీనిపై ప్రకటన చేస్తామన్నారు.. దీంతో కేంద్రంపై అలుపెరగకుండా చేసిన పోరాటంలో రైతన్న విజయం సాధించినట్టయింది. అయితే.. కొన్ని నెలలుగా సాగు చట్టాలపై రైతులు పోరాటం చేస్తూనే ఉన్నారు. జనవరి 26న ఏకంగా ఎర్రకోటపైనా జండా ఎగరేశారు.. దేశ రాజధాననే దిగ్బంధించారు. కానీ.. ఎప్పుడూ మోడీ సర్కారు వెనుకడుగు వేయలేదు. రైతులు నెలల తరబడి పోరాడి పోరాడి అలసిపోయారు. అయినా పోరాటం కొనసాగించారు. అయితmodi{#}Parliment;Elections;Punjab;Bharatiya Janata Party;January;Prime Ministerరైతు విజయం: మోడీ వెనక్కు తగ్గింది అందుకేనా..?రైతు విజయం: మోడీ వెనక్కు తగ్గింది అందుకేనా..?modi{#}Parliment;Elections;Punjab;Bharatiya Janata Party;January;Prime MinisterFri, 19 Nov 2021 09:53:24 GMTసాగు చట్టాల విషయంలో కేంద్రం వెనక్కి తగ్గింది.. సాగు చట్టాలను రద్దు చేస్తున్నట్టు స్వయంగా ప్రధాని మోడీ ప్రకటించాడు. పార్లమెంటులో దీనిపై ప్రకటన చేస్తామన్నారు.. దీంతో కేంద్రంపై అలుపెరగకుండా చేసిన పోరాటంలో రైతన్న విజయం సాధించినట్టయింది. అయితే.. కొన్ని నెలలుగా సాగు చట్టాలపై రైతులు  పోరాటం చేస్తూనే ఉన్నారు. జనవరి 26న ఏకంగా ఎర్రకోటపైనా జండా ఎగరేశారు.. దేశ రాజధాననే దిగ్బంధించారు. కానీ.. ఎప్పుడూ మోడీ సర్కారు వెనుకడుగు వేయలేదు.


రైతులు నెలల తరబడి పోరాడి పోరాడి అలసిపోయారు. అయినా పోరాటం కొనసాగించారు. అయితే రైతు పోరాటం ఉధృతి తగ్గిపోయిన సమయంలో ఇప్పుడు మోడీ ఈ కీలక నిర్ణయం తీసుకున్నారు. పోరాటం ఉధృతంగా ఉన్నప్పుడు కూడా పెద్దగా పట్టించుకోని మోడీ ఇప్పుడు ఎందుకు వెనక్కు తగ్గారు.. దీనికి ప్రధానంగా మూడు కారణాలు ఉన్నాయి. ఇటీవల జరిగి ఉపఎన్నికల్లో బీజేపీ చాలా చోట్ల దెబ్బతిన్నది. ఇది మూడ్ ఆఫ్ ద నేషన్‌ను ప్రతిబింబిస్తోంది.


మరోవైపు కొన్ని నెలల్లోనే యూపీ, పంజాబ్ వంటి ఐదు కీలక రాష్ట్రాల ఎన్నికలు ఉన్నాయి. ఈ ఎన్నికల్లో సాగు చట్టాల ప్రభావం గ్యారంటీగా ఉంటుంది. ఉపఎన్నికల ట్రెండ్ చూస్తే.. బీజేపీకి ఎదురు దెబ్బ తప్పకపోవచ్చు. అందుకే మోడీ.. సర్కారు ఈ సాగు చట్టాల విషయంలో యూ టర్న్ తీసుకుందని భావించవచ్చు.


అంతే కాదు.. గతంలోనూ మోడీ చాలా వివాదాస్పద నిర్ణయాలు తీసుకున్నారు. ప్రజలు తీవ్రంగా వ్యతిరేకించే నిర్ణయాలు తీసుకున్నాడు.. కానీ ఎప్పుడూ వెనక్కి మాత్రం తగ్గలేదు. ఎంత వ్యతిరేకత వచ్చినా తగ్గలేదు. కానీ మొదటిసారి రైతుల విషయంలో తగ్గాడు..  అంటే మోడీ ఈసారి ప్రజా వ్యతిరేకత అర్ధం చేసుకున్నాడని అర్థం అవుతోంది. వచ్చే పార్లమెంట్ ఎన్నికలను దృష్టిలో పెట్టుకుని కూడా మోడీ ఈ నిర్ణయం తీసుకుని ఉండొచ్చు. ఇప్పటికే వరుసగా రెండు సార్లు సార్వత్రిక ఎన్నికలను గెలిచిన మోడీకి మూడోసారి విజయం అంత సులభం కాదు. అందుకే ఇప్పటి నుంచే వ్యతిరేకత తగ్గించుకునే పని ప్రారంభించాడని భావించొచ్చు.



వరుణ్ తేజ్ సినిమా ప్రమోషన్ కష్టాలు...?

ఇండియా మరో ఘనత.. ప్రపంచంలోనే అతి పెద్ద..?

బిగ్ బ్రేకింగ్: మూడు వ్యవసాయ చట్టాలు రద్దు

అఖండ తో నాని కి తప్పని తిప్పలు !

బయటపడిన మరో చైనా కుట్ర.. ఇండియా అలెర్ట్...?

ప్రిన్స్ మహేష్ బాబు చేస్తున్న సేవ "అజరామరం"...

'RRR' ఎన్టీఆర్ హీరోయిన్ కి ఇంత బ్యాగ్రౌండ్ ఉందా..?

తెలంగాణ ట్రిప్... ఈ ప్రాంతాలు సందర్శించడం మరవొద్దు

చిత్తూరు జిల్లాలో భారీ వర్షాలు..రెండు రోజులు స్కూళ్లు బంద్



సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - Chakravarthi Kalyan]]>