PoliticsM N Amaleswara raoeditor@indiaherald.comhttps://www.indiaherald.com/ImageStore/images/politics/politics_analysis/pawan167e027b-3ab5-411c-a8ef-cab0def4cf01-415x250-IndiaHerald.jpghttps://www.indiaherald.com/ImageStore/images/politics/politics_analysis/pawan167e027b-3ab5-411c-a8ef-cab0def4cf01-415x250-IndiaHerald.jpgఏపీ రాజకీయాల్లో పవన్ కల్యాణ్‌కు మూడో ప్రత్యామ్నాయంగా ఎదిగే అవకాశాలు చాలా తక్కువగా కనిపిస్తున్నాయి. ఎందుకంటే ఎన్నిసార్లు అవకాశాలు వచ్చినా సరే పవన్ పెద్దగా ఉపయోగించుకున్నట్లు కనిపించలేదు. ఇప్పుడు ఏపీలో అధికారంలో వైసీపీపై కాస్త వ్యతిరేకత వస్తుంది. అటు ప్రతిపక్ష టీడీపీ వీక్‌గానే ఉంది. ఇలాంటి సమయంలో పవన్ పికప్ అవ్వడానికి మంచి ఛాన్స్..కానీ ఆ ఛాన్స్ పవన్ ఉపయోగించుకోలేకపోతున్నారు. pawan{#}Rajahmundry;Janasena;local language;Party;YCP;TDPటీడీపీతో పవన్‌కే ప్లస్..ఇక సీన్ మారుతుందా?టీడీపీతో పవన్‌కే ప్లస్..ఇక సీన్ మారుతుందా?pawan{#}Rajahmundry;Janasena;local language;Party;YCP;TDPFri, 19 Nov 2021 02:30:00 GMTఏపీ రాజకీయాల్లో పవన్ కల్యాణ్‌కు మూడో ప్రత్యామ్నాయంగా ఎదిగే అవకాశాలు చాలా తక్కువగా కనిపిస్తున్నాయి. ఎందుకంటే ఎన్నిసార్లు అవకాశాలు వచ్చినా సరే పవన్ పెద్దగా ఉపయోగించుకున్నట్లు కనిపించలేదు. ఇప్పుడు ఏపీలో అధికారంలో వైసీపీపై కాస్త వ్యతిరేకత వస్తుంది. అటు ప్రతిపక్ష టీడీపీ వీక్‌గానే ఉంది. ఇలాంటి సమయంలో పవన్ పికప్ అవ్వడానికి మంచి ఛాన్స్..కానీ ఆ ఛాన్స్ పవన్ ఉపయోగించుకోలేకపోతున్నారు.

ఆ విషయం స్థానిక ఎన్నికల్లో స్పష్టంగా అర్ధమవుతుంది. బీజేపీతో పొత్తు పెట్టుకున్నా సరే పావలా ఉపయోగం లేదని తెలిసిపోతుంది. అసలు పవన్‌ సత్తా చాటడం కష్టమని తెలుస్తోంది. జగన్, చంద్రబాబుల మధ్యలో పవన్ మూడో శక్తిగా ఎదగడం జరిగే పని కాదని అర్ధమవుతుంది. కాకపోతే పవన్ హెల్ప్ చేస్తే టీడీపీకి అడ్వాంటేజ్ అయ్యే అవకాశాలు ఉన్నాయని ఇప్పటికే చాలా సార్లు అర్ధమైంది.

అదే సమయంలో టీడీపీతో కలిస్తే జనసేనకు ఎక్కువ బెనిఫిట్ వచ్చేలా ఉంది. సింగిల్‌గా, బీజేపీతో పొత్తు పెట్టుకున్న పెద్దగా ప్రయోజనం లేదని తేలిపోయింది. కానీ టీడీపీతో కలిసి ముందుకెళితే ఉపయోగం ఉందని తెలుస్తోంది. ఆ విషయం స్థానిక ఎన్నికల్లో అర్ధమవుతుంది. పార్టీ అధిష్టానాలతో సంబంధం లేకుండా స్థానిక టీడీపీ-జనసేన నాయకులు పొత్తు పెట్టుకుని ముందుకెళుతున్న విషయం తెలిసిందే.

తాజాగా ఆకివీడు మున్సిపల్ ఫలితాన్ని చూస్తే అదే అర్ధమవుతుంది. మున్సిపాలిటీని వైసీపీ కైవసం చేసుకున్నా సరే టీడీపే-జనసేనలు కలిసి వైసీపీకి గట్టి పోటీ ఇచ్చాయి. అలాగే పలు ఎం‌పి‌టి‌సి స్థానాల్లో కూడా రెండు పార్టీలు కలిసి మంచి ఫలితాలనే సాధిస్తున్నాయి. టీడీపీతో పొత్తు పెట్టుకుని రాజమండ్రి మండలం కడియపులంక-3వ ఎంపీటీసీ స్థానాన్ని జనసేన గెలుచుకుంది. ఇలా ఎం‌పి‌టి‌సి స్థానాలని టీడీపీ, జనసేనలు కైవసం చేసుకుంటున్నాయి. కాబట్టి టీడీపీతో పొత్తు పెట్టుకుంటే జనసేనకే ఎక్కువ లాభం ఉందని చెప్పొచ్చు. మరి ఈ ఫలితాలు బట్టి రానున్న రోజుల్లో రాజకీయ సమీకరణాలు ఏమన్నా మారతాయేమో చూడాలి.





టీడీపీతో పవన్‌కే ప్లస్..ఇక సీన్ మారుతుందా?

ప్రిన్స్ మహేష్ బాబు చేస్తున్న సేవ "అజరామరం"...

'RRR' ఎన్టీఆర్ హీరోయిన్ కి ఇంత బ్యాగ్రౌండ్ ఉందా..?

తెలంగాణ ట్రిప్... ఈ ప్రాంతాలు సందర్శించడం మరవొద్దు

చిత్తూరు జిల్లాలో భారీ వర్షాలు..రెండు రోజులు స్కూళ్లు బంద్

ఇప్పటికైనా.. టీడీపీ నాయకత్వంలో మార్పులు..!

అమెరికాలో మళ్ళీ.. ఆ సంక్షోభం..!

బన్నీ ఆశలు అడియాశలు అయినట్లేనా..

బాబోరి వల్లనే.. టీడీపీ ఓడిందా..!



సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - M N Amaleswara rao]]>